ప్లాప్ డైరెక్టర్ కి చరణ్ ఛాన్స్ ఇస్తున్నాడా...?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం 'ఆర్.ఆర్.ఆర్' అనే భారీ మల్టీస్టారర్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో పాటుగా మెగాస్టార్ చిరంజీవి - కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 'ఆచార్య' సినిమాలో కూడా కీలక పాత్రలో కనిపించనున్నాడు. అయితే ఈ రెండు సినిమాల్లో చరణ్ నటిస్తున్నాడనే విషయం లాక్ డౌన్ కి ముందే అందరికీ తెలిసిన విషయం. వీటి తర్వాత చెర్రీ ప్రాజెక్ట్ ఏంటని మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో 'ఛలో' 'భీష్మ' సినిమాలతో సక్సెస్ అందుకున్న వెంకీ కుడుముల దర్శకత్వంలో చరణ్ సినిమా ఉంటుందని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ను పెండింగ్ లో ఉంచినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా రైటర్ కమ్ డైరెక్టర్ వక్కంతం వంశీ ఇటీవల చరణ్ కి ఓ స్టోరీ లైన్ చెప్పినట్లు సమాచారం.
'అశోక్' 'అతిథి' 'ఊసరవెల్లి' 'రేసుగుర్రం' 'కిక్' 'టెంపర్' 'ఎవడు' వంటి చిత్రాలకు స్టోరీ అందించిన రచయిత వక్కంతం వంశీ.. 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' అనే సినిమాతో దర్శకుడి అవతరమెత్తాడు. అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. అప్పటి నుంచి వక్కంతం వంశీ మరో సినిమాని డైరెక్ట్ చేయలేదు. అయితే డైరెక్టర్ సురేందర్ రెడ్డి - పవన్ కళ్యాణ్ కాంబోలో రాబోయే సినిమాకు స్టోరీ అందిస్తున్నాడు. అలానే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ అక్కినేని నటించే సినిమాకు కూడా వక్కంతం కథ అందిస్తున్నాడని తెలుస్తోంది. ఈ క్రమంలో తాజాగా రామ్ చరణ్ ని కలిసిన వంశీ ఓ స్టోరీ లైన్ చెప్పినట్లుగా ఇండస్ట్రీ వర్గాల సమాచారం. అయితే చెర్రీ కూడా వక్కంతం వంశీతో సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నట్లుగా టాక్ నడుస్తోంది. ఇదే కనుక నిజమైతే మెగా కాంపౌండ్ లో ఒక ప్లాప్ ఇచ్చిన దర్శకుడికి చరణ్ అవకాశం ఇవ్వడం విశేషమనే చెప్పాలి.