• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  '18 పేజెస్' ఇప్పట్లో...

'18 పేజెస్' ఇప్పట్లో కష్టమేనా..?

By - Tupaki Desk
Update: 2022-04-01 06:30 GMT
యంగ్‌ హీరో నిఖిల్‌ సిద్దార్థ్ - అనుపమ ప‌ర‌మేశ్వ‌ర‌న్ జంటగా నటిస్తోన్న తాజా చిత్రం "18 పేజెస్". స్టార్ డైరెక్టర్‌ సుకుమార్‌ కథ - స్క్రీన్‌ ప్లే అందించిన ఈ చిత్రాన్ని  'కుమారి 21 ఎఫ్‌' ఫేమ్‌ పల్నాటి సూర్య ప్రతాప్‌ తెరకెక్కిస్తున్నారు.

ఒక వైవిధ్యమైన ప్రేమ కథాంశంలో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి. నిజానికి ఈ చిత్రాన్ని ఫిబ్ర‌వ‌రి 18న విడుద‌ల చేయాలని అనుకున్నారు.

కానీ కరోనా మహమ్మారి కారణంగా వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు జూన్ లేదా జూలైలో '18 పేజెస్' సినిమాను రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్రయత్నిస్తున్నారని సమాచారం. అయితే ఇప్పట్లో సరైన రిలీజ్ డేట్ దొరికే పరిస్థితి లేదని తెలుస్తోంది.

కోవిడ్ పాండమిక్ తర్వాత ఎప్పుడు ఏ సినిమా థియేటర్లలోకి వస్తుందో తెలియడం లేదు. వాయిదా పడిన పెద్ద సినిమాలన్నీ ఒక్కటొక్కటిగా రిలీజ్ కు రెడీ అవుతుండటంతో చిన్న మీడియం రేంజ్ సినిమాలకు మంచి తేదీ దొరకడం కష్టంగా మారింది.

ఇప్పటికే సమ్మర్ సీజన్ మొదలుకొని ఆగస్ట్ వరకు డేట్స్ అన్నీ క్రేజీ సినిమాలకు బ్లాక్ అయిపోయాయి. మధ్యలో సరైన విడుదల తేదీని కనుగొనడానికి నిఖిల్ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే సినిమాల విడుదలలో గందరగోళం కారణంగా సెప్టెంబర్ వరకు '18 పేజెస్' కు చోటు లభించే అవకాశం లేదనే టాక్ వినిపిస్తోంది.

2019లో 'అర్జున్ సురవరం' సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న నిఖిల్.. వీలయినంత త్వరగా తన తదుపరి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చూస్తున్నారు. కాకపోతే ఇప్పట్లో సరైన రిలీజ్ డేట్ దొరుకుతుందో లేదో అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

కాగా, "18 పేజెస్" చిత్రాన్ని జీఏ2 పిక్చర్స్ మరియు సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై రూపొందిస్తున్నారు. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్‌ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్నారు.

గోపీ సుందర్ ఈ సినిమాకు సంగీతం సమకూరుస్తున్నారు. వసంత్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. నేషనల్ అవార్డ్ విన్నర్ నవీన్ నూలి ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. త్వరలోనే ఈ యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ కు మంచి డేట్ ని లాక్ చేస్తారేమో చూడాలి.
Tags:    
  • NikhilSidharth 
  • AnupamaParameshwar 
  • 18PagesMovie 
  • Sukumar 
  • Kumari21F 
  • PalnatiSuryaPratap 
  • ArjunaSuravaram 
  • GA2Pictures 

Similar News

టైటిల్ మార్పులపై సెన్సార్ కత్తి!

2026-11-04 13:30 GMT

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

గ్లామరస్ లుక్స్‌తో మరోసారి హాట్ టాపిక్‌గా మారిన సమంత!

2026-11-04 10:55 GMT

గోల్డెన్ టచ్‌తో బ్లాక్ అవుట్‌ఫిట్.. కీర్తి సురేష్ లుక్‌లో ఆ క్లాసే వేరు!

2026-11-04 10:30 GMT

Copyright @2026

Powered by Blink CMS