షాక్: నిర్మాతల మండలిలో వర్గ పోరు?
తెలుగు సినిమా నిర్మాతల మండలి (ప్రొడ్యూసర్స్ కౌన్సిల్) ఎన్నికల షెడ్యూల్ తాజాగా వెలువడిన సంగతి తెలిసిందే. ఈనెల 30న ఎన్నికలు నిర్వహించనున్నామని ఓ షెడ్యూల్ ని మండలి వర్గాలు రివీల్ చేశాయి. ఆ క్రమంలోనే సుమారు 1000పైగా నిర్మాతలు ఉన్న ఈ సంఘంలో ఆసక్తికర చర్చ మొదలైంది. అయితే ఈసారి ఎన్నికలకు కొన్ని చిక్కులు ఉన్నాయని అంతర్గతంగా నిర్మాతల్లో `వర్గ పోరు` వల్ల సరైన క్లారిటీ మిస్సయ్యిందని తాజాగా లోగుట్టు బయటపడింది.
ఈసారి తెలుగు సినిమా నిర్మాతల మండలికి సంబంధించిన ఎన్నికల విషయమై అంతా రాజీకొచ్చి సామరస్యంగానే వెళ్లాలని నిర్ణయించుకున్నారని మండలికి చెందిన ఓ కీలక వ్యక్తి ద్వారా రివీలైంది. ఆయన మాటల ప్రకారం.. కౌన్సిల్ లో పలుమార్లు కీలక పదవులు అలంకరించిన సీనియర్ నిర్మాత సి.కళ్యాణ్ సమక్షంలో దీనిపై అంతా కలిసి చర్చించుకున్నాం. ఇందులో చాలా విషయాలు చర్చకొచ్చాయి. కౌన్సిల్ చాలా కాలంగా నష్టాల్లో ఉంది. ఇందులో సభ్యులందరికీ మెడిక్లెయిమ్ వంటివి ఉన్నాయి. వాటి కోసమే 2కోట్ల వరకూ ఖర్చు చేయాల్సిన సన్నివేశం ఉంది. అయితే ఊహించని రీతిలో నిర్మాతల్లో ఉన్న వర్గ పోరు వల్ల రెవెన్యూ పడిపోయింది. ఖర్చులు పెరిగాయి. ఇందులోనూ రన్నింగ్ ప్రొడ్యూసర్లు.. నాన్ రన్నింగ్ ప్రొడ్యూసర్లు ఉన్నారు. సినిమాలు తీయకుండా నిర్మాతలుగా కొనసాగుతున్న వారిపై.. రన్నింగ్ ప్రొడ్యూసర్లు తీవ్ర ఆరోపణలు చేశారు. సినిమాలు తీయనివాళ్లంతా కౌన్సిల్ లో కూచుని మా మీద అజమాయిషీ చేయడం వల్ల సమస్యలొస్తున్నాయి. మేం ఏ నిర్ణయం తీసుకోవాలన్నా సానుకూలంగా లేదు అని వాళ్లు కొందరు ఒక నిర్ణయం తీసుకుని ప్రస్తుత అధికారిక కౌన్సిల్ నుంచి విడిపోయి సపరేట్ గా ఓ `ఎల్ ఎల్ పీ`ని పెట్టుకుని మరీ బయటకు వెళ్లిపోయారు.
వాళ్లే సొంతంగా నిర్ణయాలు తీసుకుని మీడియాకు ప్రకటనలు ఇవ్వడం.. ట్రైలర్లు వేయడం వగైరా వాటిపై నిర్ణయం తీసుకుంటున్నారు... మీడియా చానెళ్లకు వెళ్లి మాట్లాడుకుని యాడ్లు వేసుకుంటున్నారు. దీనివల్ల కౌన్సిల్ కి రెవెన్యూ తగ్గింది. దీంతో కౌన్సిల్ ని పక్కన పెట్టి వీళ్లు నడుపుకోవడం కరెక్ట్ కాదని వెళ్లి మేమే అడిగాం. కౌన్సిల్ ద్వారానే అధికారికంగా డ్రైవ్ చేయాలని కోరా. అయితే వాళ్లు ఒక మాటన్నారు. సినిమాలు తీసేవాళ్లు మేమైతే సినిమాలు తీయని వాళ్లు మాపై బాస్ లుగా ఉండడం మాకు నచ్చడం లేదు. మాపై అజమాయిషీ ఏంటి? అని ప్రశ్నించారు. మేం అక్కడికి రావాలంటే.. ఎన్నికల్లో పాల్గొనాలంటే 70 శాతం రన్నింగ్ ప్రొడ్యూసర్లు.. 30 శాతం సంఘంలో యాక్టివ్ ప్రొడ్యూసర్లు కలిసి పోటీ చేద్దామని ఒక ప్రపోజల్ పెట్టారు. ఆ ప్రపోజల్ పై జనరల్ బాడీలోనూ అప్రూవల్ చేశాం. అయితే రన్నింగ్ ప్రొడ్యూసర్లు ఎన్నికలకు వస్తారా లేదా? అన్నది ఇంకా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. ``మీరు రండి. యాక్టివ్ అవ్వండి.. అని అడిగాం. కౌన్సిల్ ఎలక్షన్ పైనా లీడ్ తీసుకోండి అని అడిగాం. అయితే వాళ్లు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. చర్చలు సాగుతున్నాయి. ఏ విషయం అన్నది రెండు మూడు రోజుల్లో క్లారిటీ వస్తుంది. ఇప్పటివరకూ ఎవరు ప్రెసిడెంట్ పోటీ దారు? అన్నదానిపై ఎలాంటి క్లారిటీ లేదు. ఎవరైనా అనుకుంటున్నా అవి పక్కా కాదు`` అని తెలిపారు. ఇంతకీ .. టాలీవుడ్ నిర్మాతల సంఘంలో వర్గపోరు ఉందా? ఉంటే ఇక్కడ ఎన్ని వర్గాలు ఉన్నాయి? ఎవరి వర్గం సత్తా ఎంత? అన్నది తర్వాతి ఆర్టికల్ లో.. వాచ్ దిస్ `తుపాకి` స్పేస్ టిల్ దెన్..