ఆర్మీ కోసం స్వరకోకిల భారీ విరాళం

Update: 2019-02-27 11:30 GMT
ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన అమర జవాన్‌ ల కోసం ఎంతో మంది సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. ఇప్పటికే వీర జవాన్‌ ల కోసం పెద్ద ఎత్తున విరాళాలు నమోదు అయ్యాయి. తాజాగా భారతరత్న, స్వర కోకిల లతా మంగేష్కర్‌ కోటి రూపాయల విరాళంను ప్రకటించారు. భారత ఆర్మీకి తన తండ్రి దీనానాథ్‌ మంగేష్కర్‌ గారి వర్థంతి సందర్బంగా ఆ విరాళంను అందించనున్నట్లుగా ఆమె పేర్కొన్నారు. కోటి రూపాయల విరాళంను ఇచ్చేందుకు ముందుకు వచ్చిన లతా మంగేష్కర్‌ గారిపై ప్రశంసల జల్లు కురుస్తోంది.

భారతరత్న అనే భిరుదుకు ఆమె నిలువెత్తు నిదర్శణం అంటూ సోషల్‌ మీడియాలో ప్రముఖులు కామెంట్‌ చేస్తున్నారు. ఇండియన్‌ ఆర్మీకి అంతా కూడా తమ వంతు సాయం చేయాలని, వీర జవాన్‌ ల కుటుంబాలను ఆదుకోవడం మన అందరి ముందున్న కర్తవ్యం. సినీ ప్రముఖులు చాలా మంది విరాళం ఇచ్చేందుకు ముందుకు రావడం అభినందనీయం అంటూ లతా మంగేష్కర్‌ అన్నారు.
Tags:    

Similar News