ఆస్కార్ గెలుపొందిన ఇండియ‌న్ సినిమా!

Update: 2019-02-25 05:16 GMT
ప్ర‌తిష్టాత్మకంగా భావించే ఆస్కార్ పుర‌స్కారాల్లో భార‌తీయ చిత్రానికి చోటు ద‌క్కుతుందా అని యావ‌త్ భార‌తీయ ప్రేక్ష‌కులు ఎంతో ఆశ‌తో ఎదురు చూస్తుంటారు. ఆ ఆశ ఈ ఏడాది ఫ‌లించింది. 2019 ఆస్కార్ పుర‌స్కారాల్లో భార‌తీయ చిత్రానికి చోటు ద‌క్కింది. `పిరియేడ్ ఎండ్ ఆఫ్ సంటెన్స్‌` చిత్రానికి ఆస్కార్ అవార్డు ద‌క్కింది. అయితే ఇది ఫీచ‌ర్ ఫిల్మ్ కాదు. షార్ట్ ఫిల్మ్‌. షార్ట్ ఫిల్మ్ విభాగంలో `పిరియేడ్ ఎండ్ ఆఫ్ సంటెన్స్‌`కు  బెస్ట్ డాక్యు మెంట‌రీ పుర‌స్కారం ద‌క్కింది. ఈ వార్త విన్న బాలీవుడ్ వ‌ర్గాలు హ‌ర్షాన్ని వ్య‌క్తం చేస్తున్నారు.

ఆడ‌వాళ్ల పిరియాడ్ స‌మ‌స్య‌ల‌పై రూపొందిన ఈ డాక్యుమెంట‌రీలో సానిట‌రీ న్యాప్‌ కిన్స్ కి ఆద్యుడైన ప్యాడ్‌మెన్ అరుణాచ‌లం మురుగ‌నాధ‌మ్‌, ట‌బు న‌టించారు. గునీత్ మోంగా నిర్మించారు. ఒక భార‌తీయ ల‌ఘు చిత్రానికి ఆస్కార్ ద‌క్క‌డం దేశ చ‌రిత్ర‌లోనే ఇది తొలిసారి కావ‌డంతో బాలీవుడ్ వ‌ర్గాలు ఈ ఆనంద‌క్ష‌ణాల్ని సెల‌బ్రేట్ చేసుకుంటున్నాయి. ఈ సినిమాతో గునీత్ మోంగా ఖ‌చ్చితంగా ఆస్కార్ పుర‌స్కారాన్ని మ‌న దేశానికి తీసుకొస్తార‌ని నేహా దూపియా, దియా మీర్జా గ‌త కొన్ని రోజులుగా వాదిస్తున్నారు. ఈ రోజు వారి వాద‌నే నిజ‌మై ఆస్కార్ పుర‌స్కారం ద‌క్క‌డం ఆనందాన్ని క‌లిగిస్తోందట‌.

`మ‌హిళా చిత్రాల‌కు మంచి రోజులొచ్చాయి. కంగ్రాట్యులేష‌న్స్ గునీత్‌. చాలా అద్భుత‌మైన క్ష‌ణాలివి. మా అంద‌రికి గ‌ర్వంగా వుంది. ఈ డాక్యుమెంట‌రీని నెట్‌ ఫ్లిక్స్‌ లో చూడ‌టానికి సిద్ధం కండి` అని నేహా దూపియా పెట్టిన పోస్ట్ సోష‌ల్ మీడియా ట్విట్ట‌ర్‌ లో వైర‌ల్ అవుతోంది.


Tags:    

Similar News