బాహుబలి2 లీక్ ఆపడం సాధ్యమేనా??

Update: 2017-04-27 07:56 GMT
బాహుబలి2 మూవీకి సంబంధించిన ఓ క్లిప్పింగ్ ఇప్పుడు ఎన్నో ప్రశ్నలకు దారి తీస్తోంది. నిజానికి అసలిప్పటివరకూ బాహుబలి2ను సెన్సార్ కి తప్ప ఎక్కడా ప్రదర్శించలేదన్నది మేకర్స్ వాదన. కానీ లీకైన క్లిప్పింగ్ ను చూసిన వారు చెబుతున్న వెర్షన్ మాత్రం వేరేగా ఉంది. థియేటర్ లో తీసినట్లుగానే ఉందని అంటున్నారు.

ఎక్కడో ఓ చోట స్పెషల్ స్క్రీనింగ్ చేయగా.. దానికి సంబంధించిన క్లిప్పింగ్ కావచ్చు. అయితే.. ఇప్పుడు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే.. ఒక్కసారి ప్రదర్శిస్తేనే బాహుబలి క్లిప్ ఇంత హంగామా చేస్తే.. ఇవాళ సాయంత్రం నుంచి వందల థియేటర్లలో బాహుబలి2ను ప్రదర్శించబోతున్నారు. జనాలందరి దగ్గరా సెల్ ఫోన్లలో.. వాటిలో హై క్వాలిటీ కెమేరాలు చేరి చాలా కాలమే అవుతోంది. అలాంటప్పడు ఇంత హైప్ ఉన్న బాహుబలి సీక్రెట్ ను ఆపడం సాధ్యమవుతుందా? తెల్లారితే 8 వేల థియేటర్లలో మూవీ టెలికాస్ట్ చేస్తున్నామని మేకర్స్ అంటున్నారు.

లక్షలాది మంది చూస్తున్నపుడు.. సోషల్ మీడియా ఇంత విస్తృతం అయినపుడు.. కట్టప్ప సీక్రెట్.. బాహుబలి2 హైలైట్స్ వీడియోలో రూపంలో బయటకు రాకుండా ఉంటాయా.. వీటిని ఆపగలగడం తేలికైన విషయమేమీ కాదు.. దాదాపు అసాధ్యం కూడా. అంతకు మించి సినిమాలో కంటెంట్ ను చూపడమే ఇప్పుడు రాజమౌళికి అసలు సిసలైన సవాల్!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News