నయన్ సినిమాకు ఫైనాన్స్ సమస్యలు!
నయన్ సినిమా అనగానే డ్రగ్ పెడ్లర్ గా నటించిన 'కొలమావు కోకిల' తెలుగు డబ్బింగ్ వెర్షన్ 'కో కో కోకిల' అనుకునేరు బాబోయ్... అది కాదు. 'కో కో కోకిల' యధావిధిగా ఈ రోజు రిలీజ్ అవుతోంది. చూడాలనుకున్న సినీ ప్రియులు చక్కగా దగ్గరున్న థియేటర్ కు వెళ్లి చూడండి. ఇప్పుడు టాపిక్ కోకిల కాదు 'ఇమైక్క నోడిగల్'.
'కొలమావు కోకిల' తమిళంలో ఆగష్టు 17 నే రిలీజ్ అయింది. ఆ తర్వాత విడుదల అయిన నయన్ సినిమానే 'ఇమైక్క నోడిగల్'. ఈ సినిమా నిన్న గురువారం నాడు రిలీజ్ కావాల్సి ఉండగా నిర్మాతకు- డిస్ట్రిబ్యూటర్లకు మధ్య ఫైనాన్సు సమస్యలు తలెత్తడంతో 'కీ డెలివరీ మెసేజ్' థియేటర్లకు అందకపోవడంతో తమిళనాడు అంతటా మార్నింగ్ షోస్ క్యాన్సిల్ అయ్యాయట. ఆతర్వాత మ్యాట్నీ షోస్ కూడా క్యాన్సిల్ అయ్యాయని సమాచారం. సాయంత్రానికి షోస్ పడ్డాయిగానీ నయన్ అభిమానులు మాత్రం తీవ్రగా నిరాశకు గురయ్యారు. తమిళంలో నయన్ లేడీ సూపర్ స్టార్ అనే సంగతి తెలుసు కదా. దాంతో నయన్ సినిమాకు మొదటి రోజు భారీ వసూళ్ళు ఉంటాయి. మార్నింగ్ షో- మాట్నీలు రద్దు కావడంతో ఓపెనింగ్ కలెక్షన్స్ కు భారీ గండి పడింది.
మరోవైపు సినిమా లేట్ గా రిలీజ్ అయినా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. నయన్ తో పాటు అథర్వ - అనురాగ్ కశ్యప్- రాశి ఖన్నా ఇతర కీలకపాత్రలలో నటించిన ఈ సినిమా ఒక సైకో థ్రిల్లర్. బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఇందులో సైకో కిల్లర్ గా నటించాడు. నయన్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించింది. వీలుంటే ట్రైలర్ పై ఒక లుక్కేయండి.. థ్రిల్ అవుతారు!