ఛాన్సుల కోసం అలా చేయడం తప్పు

Update: 2017-08-25 16:41 GMT
తెలుగులో దేవదాసు సినిమాతో అమాయకపు హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి  అప్పట్లో ఇండస్ట్రీ  హిట్స్ ని అందుకొని టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా ఎదిగింది ఇలియానా. దాదాపు అందరు హీరోలతో కలిసి నటించిన ఈ భామ ప్రస్తుతం బాలీవుడ్ లో అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. అయితే బర్ఫీ సినిమాతో నటన పరంగా మంచి మార్కులను కొట్టేసి ఆ తర్వాత మెల్ల మెల్లగా తన గ్లామర్ తో అక్కడి స్టార్ హీరోలతో ఛాన్సులు కొట్టేసింది. ప్రస్తుతం ఈ అమ్మడి ఒక బాలీవుడ్ సినిమా రిలీజ్ కి రెడీగా ఉంది.

అజయ్ దేవగన్ - ఇమ్రాన్ హష్మి హీరోలుగా మిలాన్ లుథ్రియా దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమాలో ఇలియానా లీడ్ రోల్ లో నటిస్తోంది. ఇప్పటికే ట్రైలర్ లో ఘాటు అందాలను చూపించి ఆకట్టుకున్న భామ థియేటర్స్ వరకు వస్తే ఇంకా చూడవచ్చు అనేలా చేసింది. అయితే ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల నిర్వహించిన ప్రెస్ మీట్స్ లో ఇలియానా తెగ పాల్గొంటోంది. అయితే ఆమెను సినిమా ఛాన్సుల కోసం ఇతరులతో స్వీట్ గా మాట్లాడతారా అన్న ప్రశ్నకు ఇలియానా కాస్త గట్టిగానే సమాధానం చెప్పింది.

ఆమె మాట్లాడుతూ.. ఛాన్సుల కోసం నేను ఇతరులతో అందంగా మాట్లాడుతూ.. వారిని పొగడ్తలతో ముంచెత్తి ఛాన్సులు దక్కించుకోవడం చాలా ఛండాలంగా ఉంటుందని చెప్పుకొచ్చింది. అంతే కాకుండా సినిమా ఇండస్ట్రీలో అందరితో మంచిగా ఉండడం వరకు ఒకే కానీ ఛాన్సుల కోసమే అలా ఉంటుందని అనుకోవడం చాలా తప్పని చెప్పుకొచ్చింది గోవా బేబి.
Tags:    

Similar News