మళ్లీ మతులు పోగొట్టేస్తున్న ఇల్లీ బేబీ
టాలీవుడ్ హీరోయిన్లలో పర్ఫెక్ట్ ఫిజిక్.. పర్ఫెక్ట్ షేప్.. అనే మాటల్లోకి వెళ్తే తప్పకుండా గుర్తుకొచ్చే పేర్లలో ఇలియానా ఒకటి. మిగతా స్టార్ హీరోయిన్లతో పోలిస్తే ఆమెలో కొన్ని మైనస్‌లు ఉన్నప్పటికీ తనకే సొంతమైన ఫిగర్‌తో కుర్రాళ్లను తన దాసులుగా చేసుకుందీ గోవా బ్యూటీ. చాలా తక్కువ టైంలో పెద్ద స్టార్ హీరోయిన్ అయిన ఆమె.. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ లాంటి పెద్ద పెద్ద స్టార్లతో నటించి తిరుగులేని ఫాలోయింగ్ సంపాదించింది. ఐతే ఇంకా అందం చెక్కు చెదరని సమయంలోనే ఆమె అనుకోకుండా టాలీవుడ్ వదిలి బాలీవుడ్ వెళ్లిపోయింది. అక్కడ కొన్ని సినిమాల్లో మెరిసి మాయమైంది. సినిమాలు తగ్గించేసి.. ఔట్ ఆఫ్ షేప్ అయిపోయిన ఇల్లీని ఏడాది కిందట చూసిన ఫ్యాన్స్ షాకైపోయారు.
కెరీర్లో ఎన్నడూ లేని విధంగా బరువు పెరిగి చూడ్డానికి ఏదోలా తయారైన ఇల్లీ.. ఇక సినిమాలకు టాటా చెప్పేస్తుందనే అంతా అనుకున్నారు. కానీ ఆండ్రూతో వివాహ బంధం తెగిపోయాక ఇల్లీ రూటు మార్చేసింది. మళ్లీ ఫిజిక్ మీద దృష్టిపెట్టింది. ఇంతకుముందే కొంత మార్పు చూపించిన గోవా బ్యూటీ..
లాక్ డౌన్ టైంను పూర్తిగా ఉపయోగించుకుని పాత ఇల్లీని బయటికి తీసుకొచ్చింది. తాజాగా ఆమె సోషల్ మీడియాలో పంచుకున్న సెల్ఫీ చూసి ఫ్యాన్స్ వావ్ అంటున్నారు. పూర్తిగా ఒకప్పటిలా నాజూగ్గా తయారైన ఇల్లీ.. తనకే సొంతమైన కర్వ్స్ అన్నింటినీ యాజిటీజ్‌గా దించేసింది. ఇప్పుడామె లుక్ చూస్తే సినీ కెరీర్ మీద మళ్లీ సీరియస్‌గా ఫోకస్ పెట్టినట్లే కనిపిస్తోంది. ఐతే సినిమాల సంగతేమో కానీ.. ఇల్లీ బేబీని మళ్లీ ఇలా చూసినందుకు ఫ్యాన్స్ మాత్రం ఖుషీ అయిపోతున్నారు. ఆమె కొత్త ఫొటోలను వైరల్ చేస్తున్నారు.