ఇలియానాకు కొత్త జాబ్ వచ్చింది

Update: 2018-03-23 05:46 GMT
బ్రాండ్ అంబాసిడర్ జాబ్ దొరికిందంటే సినిమా స్టార్స్ అన్ని రకాలుగా ఇమేజ్ తెచ్చుకున్నట్లే అని చెప్పాలి. మనిషిని ఆకర్షించే గుణం ఉండాలే గాని తారలకంటే అదృష్టవంతులు ఎవరుంటారు. ఎక్కడికి వెళ్లినా నలుగురు చూడటానికి ఎగబడితే చాలు ఆ హోదా ఉన్నంత వరకు రాజా రేంజ్ లో బ్రతకొచ్చు. ఇకపోతే ఎంతో కాలంగా సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతోన్న ఇలియానా అనేక యాడ్స్ లలో కనిపించింది. అయితే బ్రాండ్ అంబాసిడర్ గా అనుకున్నంత రేంజ్ లో గుర్తింపు పొందలేదు.

కానీ లేటుగా కొట్టినా ఓ మంచి ప్రజెక్టును అమ్మడు దక్కించేసుకుంది. ఒక దేశానికి ప్రచారకర్తగా కొనసాగడానికి ఇలియాన గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. అందుకు సంబందించిన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎందుకంటే అమ్మడు ఏకంగా ఓ దేశానికి బ్రాండ్ అంబాసిడర్ మరి. ఫిజి అనే దేశం పర్యాటక రంగం తరపున ఇలియానాను ఆ దేశ ప్రతినిధులు ప్రచార కర్తగా నియమించారు. ఫిజిలో ఇప్పటికే 38 శాతం వరకు భారత సంతతిగలవారు ఉన్నారు.

ప్రతి ఏడాది ఆ సంఖ్య పెరుగుతోంది కూడా. భారత్ నుంచి ఎక్కువ మంది పర్యాటకులు వస్తుండడంతో ఇంకా అభివృద్ధి చెందాలని ఇలియానని బ్రాండ్ అంబాసిడర్ గా నియమించారు. ఇంతకుముందు పరిణితీ చోప్రా ఆస్ట్రేలియా తరపున అలాగే సిదార్థ్‌ మల్హోత్రా న్యూజిల్యాండ్ తరఫున ప్రచారకర్తలుగా వారి బాధ్యతలను నిర్వర్తించారు. మరి ఇలియానా వారి తరహాలో మెప్పిస్తుందో లేదో చూడాలి.
Tags:    

Similar News