30 ఏళ్ల అనుబంధంకు బ్రేక్‌ తో మేస్ట్రో కొత్త అడుగు

Update: 2021-02-05 00:30 GMT
సౌత్ ఇండియాలోనే కాకుండా బాలీవుడ్‌ లో కూడా తన పాటతో శ్రోతలను మంత్ర ముగ్దులను చేసిన సంగీత దర్శకుడు ఇళయరాజా. ఈయన మూడు దశాబ్దాలకు పైగా తన సంగీత ప్రపంచంను చెన్నై లోని ప్రసాద్‌ స్టూడియోలో నడిపిస్తున్నాడు. ప్రసాద్‌ స్టూడియోలో అప్పట్లో ఇళయరాజా కోసం ఒక గది కేటాయించగా అందులోనే కొన్ని వందల వేల పాటలను రికార్డ్ చేయడం జరిగింది. ప్రసాద్‌ స్టూడియో వారసులు ఆయన్ను అందులో నుండి ఖాళీ చేయాల్సిందిగా ఆదేశించడం అందుకు ఆయన ఒప్పుకోక పోవడం వంటి పరిణామాలతో కోర్టు వరకు వివాదం వెళ్లింది. కోర్టు సున్నితంగా ఇళయరాజాను మందలించడంతో ఖాళీ చేయక తప్పలేదు. ప్రసాద్‌ స్టూడియో నుండి ఖాళీ చేసిన ఇళయరాజా కొత్త స్టూడియోను ఏర్పాటు చేశాడు.

ఇళయరాజా కొత్త స్టూడియో ప్రారంభోత్సవం లాంచనంగా జరిగింది. కొద్ది మంది సినీ ప్రముఖులతో పాటు ఇళయరాజా సన్నిహితులు కూడా ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నట్లుగా తమిళ మీడియా వర్గాల ద్వారా తెలుస్తోంది. ప్రసాద్‌ స్టూడియోలోని సుదీర్ఘ ప్రస్థానం కు ఫుల్‌ స్టాప్ పడటంతో కొత్త స్టూడియోలో ఇళయరాజా అడుగు పెట్టాడు. ఇకపై కొత్త స్టూడియో నుండి ఇళయరాజా తన పాటల రికార్డును మొదలు పెట్టబోతున్నాడు. కొత్త స్టూడియో లో ఇళయరాజా రికార్డ్‌ చేయబోతున్న మొదటి పాట ఏంటా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రసాద్ స్టూడియోలోని తన రికార్డింగ్ స్టూడియోను ఇళయరాజా సెంటిమెంట్‌ గా భావిస్తూ ఉంటాడు. మరి కొత్త స్టూడియోలో కూడా మ్యూజిక్ మ్యాస్ట్రో తన మ్యాజిక్ ను రిపీట్ చేస్తాడా అనేది చూడాలి.
Tags:    

Similar News