అదే జరిగితే సినిమాలకు గుడ్ బై చెబుతా: కాజల్ అగర్వాల్

Update: 2021-05-20 02:30 GMT
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్.. గతేడాది అక్టోబర్ నెలలో పెళ్లి చేసుకొని సోలో బ్రతుకుకు ఫుల్ స్టాప్ పెట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అమ్మడు భర్త గౌతమ్ కిచ్లుతో కలిసి వివాహ బంధంలోని మాధుర్యాన్ని ఆస్వాదిస్తుంది. అయితే కాజల్ పెళ్లి చేసుకుంది బయటి వ్యక్తిని మాత్రం కాదు. చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లును పెళ్లి చేసుకొని అందరికి సర్ప్రైజ్ ఇచ్చింది. అయితే సంతోషించాల్సిన విషయం ఏంటంటే.. పెళ్లయ్యాక సినిమాలు చేయడం మాత్రం ఆపలేదు. కానీ జీవితం పెళ్లికి ముందుకంటే కూడా పెళ్లి తర్వాత వేరేలా ఉందని.. ప్రస్తుతం తన జీవితం ఎంతో అందంగా అనిపిస్తుందని కాజల్ చెప్పుకొస్తుంది.

నిజానికి కాజల్ ను తెలుగు ఫ్యాన్స్ చందమామ అని పిలుచుకుంటారు. ఎందుకంటే కళ్లతోనే కుర్రకారు మనసు దోచుకోగలదు అమ్మడు. ఇలా కళ్లతోనే మాయచేసే హీరోయిన్లలో కాజల్ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగి ఉంది. అందం, అభినయం కలిగిన కాజల్ పెళ్లి చేసుకుందని తెలిసే సరికి ఆ టైంలో అభిమానుల హార్ట్ బ్రేక్ అయ్యిందట. అయితే ఇప్పటికి వరుసగా అవకాశాలు అందిపుచ్చుకుంటూ సౌత్ ఇండస్ట్రీలో స్టార్ గా కొనసాగుతుంది. అమ్మడి చేతిలో ప్రస్తుతం చాలా మూవీస్ ఉన్నాయి. అందులో ఒకటి ఆచార్య. మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కాజల్ లీడ్ రోల్ పోషిస్తుంది. అదిగాక చిరుతో కాజల్ కు ఇది సెకండ్ మూవీ.

అలాగే విశ్వనటుడు కమల్ హాసన్ సరసన భారతీయుడు-2 లో నటిస్తోంది. ఇదిలా ఉండగా.. కాజల్ పెళ్లి జరిగినప్పటి నుండి తన భర్తతో కలిసి ఏదొక వార్తలో నిలుస్తూనే ఉంది. పెళ్లి చేసుకున్న వెంటనే మాల్దీవ్స్ హనీమూన్ కు ఈ దంపతులు a మధ్యలో కొత్త బిజినెస్ కూడా స్టార్ట్ చేశారు. అలాగే 'నా బెస్ట్ ఫ్రెండే నా భర్త కావడం చాలా ఆనందంగా ఉంది' అంటూ చెప్పిన కాజల్.. తాజాగా వ్యాపారంలో ఆయన, సినిమాలతో నేను ఎవరి పని వారు చూసుకుంటున్నాం. కానీ ఇంటికి చేరుకున్నాక బయట విషయాలు పూర్తిగా చర్చించం. నేను సినిమాల గురించి తీయను, ఆయన బిజినెస్ గురించి తీయరు. నన్ను చూడటానికి అప్పుడప్పుడు సెట్ కి రావడం హ్యాపీగా అనిపిస్తుంది. నా భర్తను సినిమా వాళ్ళు కూడా గౌరవిస్తున్నారు. వీటితో పాటుగా కాజల్ షాకింగ్ న్యూస్ కూడా చెప్పింది. నా భర్త ఎప్పుడైతే సినిమాలు స్టాప్ చేయాలనీ చెబుతారో.. ఆ వెంటనే సినిమాల్లో నటించడం ఆపేస్తా" అని చెప్పుకొచ్చింది కాజల్. మరి అమ్మడు ఎప్పుడు సినిమాలు ఆపేస్తుందో చెప్పలేం అంటూ ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు.
Tags:    

Similar News