టీజర్ టాక్: న్యూస్ పుట్టించడమే ఇదం జగత్

Update: 2018-08-21 14:00 GMT
న్యూస్ ఏది.. నిజం న్యూస్ ఏది.. బ్రేకింగ్ న్యూస్ ఏది.. కాస్త కలర్ అద్దిన న్యూస్ ఏది? వీటన్నిటికి సమాధానం చిన్న పిల్లాడినడిగినా చెప్తాడు.  ఎందుకంటే మనం ఉండేది మెరుగైన సమాజంలో కదా.. అందరూ తెలివైన వారే! కరెక్ట్ గా ఇలాంటి కాన్సెప్ట్ తోనే సుమంత్ తాజా చిత్రమైన 'ఇదం జగత్' టీజర్ రిలీజ్ అయింది.

ఇదంతా ఎందుకు షూట్ చేశావు? అని హీరో సుమంత్ ను అడిగితే "సార్ ఇక్కడ మనిషి చావు న్యూసే.. మనిషి జ్ఞాపకాలు న్యూసే.. ప్రేమ న్యూసే.. స్నేహం న్యూసే.. చేయాలనుకుంటే ప్రపంచంలో ప్రతిదీ న్యూసే.. అది ఎన్ క్యాష్ చేసుకోవటం తెలుసుకొని అవసరమైతే.. అ న్యూస్ క్రియేట్ చేయడం కూడా తెలుసుకోవాలి.  అది నాకు తెలుసు."  అంటే న్యూస్ పుట్టించడం కూడా ఇప్పటి జర్నలిజం లో ఒక మెయిన్ పార్ట్ అన్నట్టు 'ఇదం జగత్' సెలవిస్తోంది!

ఈ సినిమాలో ఒక మంచి థ్రిల్లర్ కు ఉండాల్సిన లక్షణాలు.. మేము ఒరిజినల్ న్యూస్ ఇస్తామంటూ - సమాజాన్ని బాగు చేస్తామంటూ స్లోగన్లు ఇచ్చిమరీ సమాజాన్ని సమాజాన్ని అథోగతి పాలుచేసే ఫేక్ న్యూస్ ఇచ్చే జర్నలిజం పైన ఎక్కుపెట్టిన బాణంలా కనిపిస్తోంది. శ్రీచరణ్ పాకాల బ్యాక్ గ్రౌండ్ స్కోర్, బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ అన్నీ మంచి క్వాలిటీ తో ఉన్నాయి.  కాన్సెప్ట్ కొత్తగా ఉంది.  అనిల్ శ్రీకంఠం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ థ్రిల్లర్ టీజర్ లో హాలీవుడ్ ఫిలిం 'నైట్ క్రాలర్' ఛాయలు కనిపించాయి. అంటే 'మెరుగైన సినిమా' కోసం తపించారేమో.. తప్పు లేదు.. సినిమా చూసే లోపు టీజర్ పై ఓ లుక్కేయండి!

వీడియో కోసం క్లిక్ చేయండి


Full View
Tags:    

Similar News