రెజీనాతో హీరోగా తెరాస ఎమ్మెల్యే

Update: 2016-02-01 10:55 GMT
మంచు మనోజ్, రెజీనా కసాండ్రా జంటగా నటించిన శౌర్య ఆడియో ఫంక్షన్ హైద్రాబాద్ లో ఘనంగా నిర్వహించారు. తెలంగాణ ఉద్యమకారుడు - ప్రముఖ ఫోక్ సింగర్ - ప్రస్తుతం టీఆర్ ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకృష్ణ.. ఈ కార్యక్రమానికి గెస్ట్ గా విచ్చేశారు. ఈ సమయంలో రసమయి చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతున్నాయి.

రెజీనాను ఉద్దేశించి 'తను నాకు పెద్ద అభిమాని.. సారీ, నేను తనకు పెద్ద ఫ్యాన్ ని, నేను పొట్టిగా ఉండడం సమస్య కాకపోతే.. నేను హీరోగా రెజీనా గారు హీరోయిన్ గా ఖచ్చితంగా ఓ సినిమా చేస్తాను' అన్నారు ఎమ్మెల్యే. దీంతో ఆడిటోరియం అంతా నవ్వులతో నిండిపోయింది. రసమయి చేసిన ఈ వ్యాఖ్యలను రెజీనా కూడా లైట్ తీసుకుని.. మనస్ఫూర్తిగా నవ్వేసింది. ఈ సమయంలో తను రాసిన కొన్ని ఫోక్ సాంగ్స్ ని శౌర్య సినిమాలో ఉపయోగించారని చెప్పారు రసమయి.

కామెంట్స్ కామెడీగానే ఉన్నా.. రెజీనా గ్లామర్ ఇక్కడ మెయిన్ పాయింట్. తన అందం, నటనతో అభిమానులనే కాదు.. కళాకారులు, రాజకీయనాయకులను కూడా ఆకట్టుకుంటోందీ భామ. ప్రస్తతం రెజీనాకి శౌర్య హిట్ కావడం చాలా ముఖ్యం. రీసెంట్ గా ఈమె గ్లామర్ డాళ్ గా కనిపించిన సౌఖ్యం ఫ్లాప్ కావడంతో.. ఇప్పుడు ఆశలన్నీ మనోజ్ పైనే పెట్టుకుంది రెజీనా. దశరథ్ డైరెక్షన్ లో రూపొందిన ఈ థ్రిల్లర్ లవ్ స్టోరీపై ఇండస్ట్రీలో అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి.
Tags:    

Similar News