స్వచ్ఛంద సంస్థకు చెర్రీ సపోర్ట్

Update: 2016-10-25 17:19 GMT
మనుషుల్లో మహనీయులు చాలా తక్కువ మందే ఉంటారు. అందరికీ కాకపోయినా కొంతమందికయినా ప్రయత్నించే వారు మరికొందరు. కొందరు మాత్రం ఓ వైపు సాయం చేస్తూనే.. ఎవరు సాయం చేసినా భుజం తట్టి అభినందిస్తూ ఉంటారు. అలాంటి కోవకు చెందిన వాడే మెగాపవర్ స్టార్. సాధారణంగా రామ్ చరణ్ చేసే ఛారిటీ కార్యక్రమాలన్నీ వేరే ఎవరో చెబితేనే బయటకొస్తాయి. కానీ చెర్రీ మాత్రం ఓపెన్ గా సోషల్ మీడియా ద్వారా సాయం చేసే మనసున్న వారికి అభినందనలు చెబుతూ ఉంటాడు.

'ఇవాళ ఎంతో మంచిరోజు. ఇ చిన్నారులు ఇద్దరు పుట్టుక నుంచి వినలేరు. కానీ ఇఫ్పుడు మాత్రం మనలో ఒకరిగా వినగలరు. సాహి టీం.. డా.ఇ.సి వినయ్ కుమార్ లకు థాంక్యూ. మనం అది మన హక్కు అనుకుంటాం. కానీ ఇప్పుడు సాధారణంగా వినగలగడం ఎంత వరమో తెలుస్తోంది' అంటూ ట్వీట్ చేసి ఆ చిన్నారుల ఫోటోలు పోస్ట్ చేశాడు రామ్ చరణ్.

రీసెంట్ గా అపోలో హాస్పత్రి సీనియర్ డాక్టర్ ఈసీ వినయ్ కుమార్ నేతృత్వంలో.. ఇద్దరు చిన్నారులకు చికిత్స జరిగింది. ఆ పిల్లలిద్దరూ పుట్టుకతో వినికిడి లోపం పూర్తి స్థాయిలో ఉన్నవారు కాగా.. ఇప్పుడు వారు సాధారణ స్థాయిలోనే వినగలుగుతున్నారు. ఇందుకు సాహి అనే సంస్థ సాయం చేసింది. సాహి అంటే.. సొసైటీ టు ఎయిడ్ డ హియరింగ్ ఇంపెయిర్డ్ అని అర్ధం. వినికిడి లోపాలు ఉన్నవారిని సాధారణ స్థితికి తెచ్చేందుకు ఈ సంస్థ ప్రయత్నిస్తూ ఉంటుంది.

ప్రముఖుల నుంచే కాదు.. అందించిన ప్రతీ ఒక్కరి నుంచి విరాళాలు సేకరించి ఆపరేషన్లు చేయిస్తూ ఉంటుంది సాహి. ఇప్పుడు ఈ సాహి సంస్థ సౌజన్యంతో అపోలో ఆస్పత్రి వైద్యుల కృషితో.. ఇద్దరు చిన్నారులు సాధారణంగా వినగలగడాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాడు రామ్ చరణ్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News