జాన్వీ క‌పూర్ తో హీటెక్కించే బెడ్ రూమ్ సీన్!

మ‌రి ఇప్పుడు అందుకు స‌మ‌యం అస‌న్న‌మైందా? అంటే అవున‌నే లీకులందుతున్నాయి.

Update: 2024-05-07 13:30 GMT

అతిలోక సుంద‌రి శ్రీదేవి త‌న‌య జాన్వీక‌పూర్ ఇంత‌వ‌ర‌కూ ఆన్ స్క్రీన్ పై స‌రైన హాట్ పెర్పార్మెన్స్ ఇచ్చింది లేదు. కుర్రాళ్ల స‌ర‌స‌న న‌టించినా ఆ ఛాన్స్ తీను తీసుకోలేదా? ద‌ర్శ‌కులు సీన్స్ అలా రాయ‌లేదా? అన్న‌ది తెలియ‌దు గానీ జాన్వీ ఇంకా కుర్రాళ్ల గుండెల్లో బ‌లంగా దిగ‌లేదు. జిమ్ వీడియోలు....డిజైన‌ర్ ఫోట‌లోతో సంద‌డి చేయ‌డం త‌ప్ప‌! సిస‌లైన హాట్ పెర్పార్మెన్స్ తో గున‌పాలు దించింది లేదు. మ‌రి ఇప్పుడు అందుకు స‌మ‌యం అస‌న్న‌మైందా? అంటే అవున‌నే లీకులందుతున్నాయి.

ప్ర‌స్తుతం అమ్మ‌డు `మిస్ట‌ర్ అండ్ మిసెస్ మ‌హి`లో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇందులో రాజ్ కుమార్ రావు హీరోగా న‌టిస్తున్నాడు. భార్య భ‌ర్త‌ల అనుబంధం నేప‌థ్యంలో సాగే చిత్ర‌మిది. శ‌ర‌న్ శ‌ర్మ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ క‌థ‌కి స్పోర్ట్స్ డ్రామా కూడా యాడ్ అయింది. మే 31న సినిమా రిలీజ్ అవుతుంది. కాగా ఈ సినిమా లో జాన్వీ క‌పూర్ బెడ్ రూమ్ స‌న్నివేశాల్లో న‌టించింది అన్న సంగ‌తి బాలీవుడ్ లో మీడియాలో ప్ర‌చారం సాగుతుంది. లో దుస్తుల్లో అమ్మ‌డు రాజ్ కుమార్ రావ్ తో ఇంటిమేట్ స‌న్నివేశాల్లో న‌టించింద‌ని స‌మాచారం.

Read more!

నాలుగు గోడ‌ల మ‌ధ్య వ్య‌వ‌హారాన్ని ఎంతో రొమాంటిక్ గా చిత్రీక‌రించిన‌ట్లు...సినిమాలో ఆ స‌న్నివేశాలు కాస్త హాట్ గానే హైలైట్ అవుతాయ‌ని ముంబై మీడియా కోడై కూస్తుంది. ఇందులో రాజ్ కుమార్ రావ్ భ‌ర్త పాత్ర రొటీన్ కి భిన్నంగా సాగుతుందిట‌. ఆ కోణంలో వ‌చ్చే స‌న్నివేశాలు సినిమాలో ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా హైలైట్ అవుతాయ‌ని వినిపిస్తుంది. భార్య పాత్ర‌లో జాన్వీ కూడా అంతే డీసెంట్ గా క‌నిపిస్తుంద‌ని తెలుస్తుంది.

మొత్తానికి 40 ఏళ్ల రాజ్ క‌మార్ రావ్ తో 27 ఏళ్ల జాన్వీ బెడ్ రూమ్ స‌న్నివేశాలంటే పండ‌కుండా ఉంటాయా? ఇంత‌వ‌ర‌కూ ఏ సినిమాలోనే జాన్వీ అలా న‌టించ‌లేదు. తొలిసారి రోల్ డిమాండ్ చేయ‌డంతో జాన్వీ కూడా క‌న్విన్స్ అయిన‌ట్లు తెలుస్తుంది. బాలీవుడ్ లో ఇలాంటి స‌న్నివేశాలు కొత్తేం కాదు. పాత్ర డిమాండ్ చేస్తే! హీరోయిన్లు ఎలాంటి సాహ‌సానికైనా సిద్దంగానే ఉంటారు. రొమాంటిక్ స‌న్నివేశాల్లో చెల‌రేనిగా భామ‌లెంతో మంది. ఇప్పుడా జాబితాలో క‌పూర్ బ్యూటీ కూడా చేర‌బోతుందన్న మాట‌.

Tags:    

Similar News