• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  త్రిష అంటే క్రష్ అంటున్న...

త్రిష అంటే క్రష్ అంటున్న జగపతి బాబు

By - Tupaki Desk
Update: 2017-05-09 11:22 GMT
తనకేమనిపిస్తే అది మాట్లాడుతుంటాడు సీనియర్ హీరో జగపతి బాబు. మాటలకు ముసుగేసి మాట్లాడటం జగపతికి అలవాటు లేదు. ఓపెన్ గా చాలా విషయాలు డిస్కస్ చేస్తుంటాడు. అందుకే ఆయన ఇంటర్వ్యూలో ఆసక్తి రేపుతుంటాయి. సెన్సేషన్ క్రియేట్ చేస్తుంటాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో జగపతి బాబు అనేక ఆసక్తికర విషయాలు చెప్పాడు.

తన కంటే వయసులో చాలా చిన్నదైన హీరోయిన్ త్రిష అంటే తనకు క్రష్ అని జగపతిబాబు ఈ ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. త్రిషతో కలిసి ఒక్క సినిమా అయినా చేయాలని ప్రయత్నించానని.. కానీ కుదర్లేదని జగపతి చెప్పాడు. ప్రియమణి చాలా హాట్ అంటూ మరో హాట్ కామెంట్ కూడా చేశాడు జగపతి. హీరో అర్జున్ తనకు ప్రాణ స్నేహితుడని.. జూనియర్ ఎన్టీఆర్ చాలా దగ్గరివాడని చెప్పాడు.

హీరోయిన్ సౌందర్యతో ఎఫైర్ అంటూ వార్తలపైనా జగపతి స్పందించాడు. సౌంద‌ర్య ఎవ‌రినీ అంత తొంద‌ర‌గా న‌మ్మేది కాద‌ని.. తనను మాత్రం చాలా అభిమానించేదని అన్నాడు. ఆమె కుటుంబానికి కూడా తనను దగ్గర చేసిందన్నాడు. తమ మధ్య అందరూ అనుకున్నట్లు ఎఫైర్ ఏమీ లేదని స్పష్టం చేశాడు.

లెజెండ్ సినిమాకు ముందు తాను  పడ్డ ఇబ్బందుల గురించి జగపతి బాబు మాట్లాడాడు. ఆ సినిమాకు ముందు మూడేళ్లలో చాలా ఖాళీగా ఉన్నానని.. అవకాశాలు లేక రోడ్ల మీద ఊరికే స్టిక్ పట్టుకుని నడిచిన సందర్భాలు చాలా ఉన్నాయని తెలిపాడు. తాను సినిమాల్లోకి రావడం తన తల్లికి ఇష్టం లేదని.. ఆమె మాట విననందుకు రెండేళ్లు పాటు తనతో మాట్లాడలేదని చెప్పాడు. అలాగే సిగరెట్ కాల్చానని.. ఓ అమ్మాయితో కనిపించానని.. ఇలా రకరకాల కారణాలతో ఏళ్లకు ఏళ్లు తన తల్లి తనతో మాట్లాడుకుండా ఉండిపోయిందని చెప్పాడు.
Tags:    
  • Trisha 
  • Actress Trisha 
  • Jagapathi Babu 
  • Telugu News 
  • Telugu Cinema News 
  • Tollywood 

Similar News

పవన్‌తో సినిమా.. అసలు ప్లాన్ ఏంటి?

2026-11-19 18:30 GMT

ఛాన్సిచ్చారు క‌దా అని అంత మాటనేస్తావా త‌మ్మూ?

2026-11-19 16:30 GMT

బెడ్ రూమ్ సీన్స్..పెద‌వి ముద్దుల‌పై చ‌ర్చేలేదే!

2026-11-19 15:30 GMT

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Copyright @2026

Powered by Blink CMS