నాకు కరోనా రాలేదు బాబోయ్..!
సినీ ఇండస్ట్రీలో మళ్లీ కరోనా కలకలం మొదలైంది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. 'వకీల్ సాబ్' సినిమాలో కీలక పాత్రలో నటించిన హీరోయిన్ నివేదా థామస్ కు ఇటీవల కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. ఆ సినిమా ప్రమోషన్స్ పాల్గొంటున్న సమయంలో ఆమెకు కోవిడ్ రావడంతో చిత్ర యూనిట్ ఉలిక్కి పడింది. ఈ క్రమంలో 'వకీల్ సాబ్' లో నటించిన మరో హీరోయిన్ అంజలికి కూడా కరోనా సోకిందని.. ప్రస్తుతం ఆమె హోమ్ క్వారంటైన్ లో ఉన్నారని వార్తలు వచ్చాయి.
'వకీల్ సాబ్' సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నివేదా థామస్ తో కలిసి వరుసగా ఇంటర్వ్యూలు ఇచ్చింది అంజలి. ఇటీవల జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా పాల్గొన్నారు. దీంతో అంజలికి కరోనా వచ్చింది నిజమే అయ్యుంటుందని అందరూ అనుకున్నారు. అయితే దీనిపై తాజాగా అంజలి స్పందించింది. తనకు కరోనా పాజిటివ్ కాదని.. నేను ఆరోగ్యంగా సేఫ్ గా ఉన్నానని తెలిపింది. అంజలి ట్వీట్ చేస్తూ..''నాకు కోవిడ్ పాజిటివ్ అని నిర్ధారణ కాలేదని నా ఫ్రెండ్స్ కి ఫ్యాన్స్ కి వెల్ విషర్స్ కి తెలియజేస్తున్నాను. కొన్ని న్యూస్ ఆర్టికల్స్ లో నాకు కరోనా పాజిటివ్ అని రాసినట్లు నా దృష్టికి వచ్చింది. అవి పూర్తిగా అవాస్తవం. నేను సేఫ్ గా పూర్తి ఆరోగ్యంతో ఉన్నాను'' అని పేర్కొన్నారు.