భరత్ ను కోటికి కొనలేదు

Update: 2018-04-15 11:21 GMT
ఈ ఆదివారం వదిలేస్తే భరత్ అనే నేను విడుదలకు కేవలం నాలుగు రోజులు మాత్రమే టైం ఉంది. శుక్రవారం తెల్లవారే లోపు ముఖ్య మంత్రి మహేష్ బాబు ఉమ్మడి రాష్ట్రాన్ని ఎలా పాలించబోతున్నాడు అనేది సిల్వర్ స్క్రీన్ మీద చూడొచ్చు. దీని విషయంలో యూనిట్ కంటే ఫాన్స్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. దానికి కారణం లేకపోలేదు. మ్యూజిక్ ఇప్పటికే సూపర్ హిట్ కావడం అంచనాలకు తగ్గట్టు ట్రైలర్ కూడా ఆదరణ పొందటం లాంటివన్నీ హైప్ ని అమాంతం పెంచేశాయి. అసలు ఒత్తిడి మాత్రం అందరు దర్శకుడు కొరటాల శివ మీదే ఉంది అనుకుంటున్నారు కాని ఆయన మాత్రం చాలా కూల్ గా ఉన్నారు.దీని సంబంధించి కొన్ని విషయాలు శివ మీడియాతో షేర్ చేసుకున్నాడు. భరత్ అనే నేను షూటింగ్ టైంలోనే ఈ కథను శ్రీహరి నాను అనే వ్యక్తికి కోరి రూపాయలు ఇచ్చి కొన్నారనే వార్త గురించి శివ స్పందించారు.

శ్రీహరి నాను తనకు మంచి ఫ్రెండ్ అని తామిద్దరికీ ఎప్పటి నుంచో పరిచయం ఉందని హీరో ముఖ్యమంత్రిగా చేస్తే ఎలా ఉంటుందో అన్న పాయింట్ తనతో డిస్కస్ చేసినప్పుడు అది తనకు బాగా నచ్చి ఈ కథను డెవలప్ చేసుకున్నాను తప్ప ఆ వార్త నిజమైతే కాదు అన్నాడు. కాని తనకు లైన్ ఐడియా ఇచ్చిన శ్రీహరికి మాత్రం తాను క్రెడిట్ ఇవ్వాల్సిందే అని కూడా స్పష్టం చేసాడు. కథను పూర్తిగా రాసుకున్నాక మహేష్ కు చెప్పినప్పుడు నవ్వి నేనేంటి సిఎం ఏంటి అన్నారని కాని పూర్తిగా విన్నాక ఇలాంటి ఛాలెంజింగ్ రోల్స్ చేయడానికి ఇష్టపడే తాను ఇలాంటిది వదులుకోనని చెప్పి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని శివ ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేసుకున్నాడు. కొత్త సినిమా ఎవరితో అనే ఆలోచన ఏమి చేయలేదని రెండు నెలల పూర్తి రెస్ట్ తర్వాత నిర్ణయం తీసుకుంటానని చెప్పాడు. రామ్ చరణ్ తో సినిమా ఇప్పుడు అతని కమిట్మెంట్స్ అన్ని పూర్తయ్యాక తప్పకుడా ఉంటుందని చెప్పి అన్నింటికీ చెక్ పెట్టేసాడు కొరటాల శివ.
Tags:    

Similar News