లైఫ్‌లోంచి పర్మినెంట్‌గా వెళ్లిపోయిందా?

Update: 2015-07-02 09:30 GMT
రొమానియన్‌ బ్యూటీ లులియా వాంటర్‌తో సల్మాన్‌ఖాన్‌ సహజీవనం చేస్తున్న సంగతి తెలిసిందే. లులియా సల్మాన్‌ జీవితంలో అనుకోని అతిధి. కత్రిన ఎండ్‌తో లులియా అతడి జీవితంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక అక్కణ్ణుంచి బాలీవుడ్‌లో బోలెడన్ని స్టోరీలొచ్చాయి ఈ జంటపై. లులియా సల్మాన్‌ జీవిత భాగస్వామి. సహజీవనం మొదలైంది. సీనియర్‌ బ్యాచిలర్‌ ఇక పెళ్లితో ఒకటైపోతున్నాడని ప్రచారం సాగించారు.

అయితే వాటన్నిటికీ చెక్‌ పెడుతూ లులియా తనకు స్నేహితురాలు మాత్రమేనని సల్మాన్‌ కవర్‌ చేసే ప్రయత్నం చేశాడు. సల్మాన్‌ కుటుంబ సభ్యులందరితో స్నేహంగా కలిసిపోయింది. అర్బాజ్‌, సోహైల్‌ అందరూ వదిన వదిన అంటూ పిలుచుకున్నారు. కానీ సల్మాన్‌ మాత్రం లులియాని స్నేహం వరకే పరిమితం చేశాడు. కుటుంబ సభ్యురాలిగా ఇంట్లోనే ఉంటుంది. కానీ భార్య మాత్రం కానేకాదు. సల్మాన్‌ ఇంట్లో రంజాన్‌ మాసంలో ఇఫ్తార్‌ సీజన్‌లో ఈ అమ్మడిదే హవా. కానీ ఈసారి ఇఫ్తార్‌ సీజన్‌లో లులియా మిస్సయ్యింది. రుమేనియాలోని తను స్వగృహానికి  వెళ్లిపోయింది. ఇప్పటికీ తిరిగిరాలేదు.

ట్విస్ట్‌ ఏంటంటే.. ఇక ఎప్పటికీ తిరిగిరాదరి తెలుస్తోంది. ఎందుకంటే సల్మాన్‌తో కటీఫ్‌ చెప్పేసిన తర్వాతే ఈ భామ తన దారి తను చూసుకుందని ప్రస్తుతం బాలీవుడ్‌లో ప్రచారం సాగుతోంది. కండల హీరో జీవితంలో పార్ట్‌ టైమ్‌ భార్య కథ ముగిసినట్టేని కథనాలు వస్తున్నాయి. తాజా రూమర్‌కి సల్మాన్‌ అధికారికంగా సమాధానం చెప్పాల్సి ఉంది.

Tags:    

Similar News