ప్రియాంక‌ను పొగిడేసిన భ‌ర్త‌ పెదాల‌పై ముద్దుపెట్టిన హీరోయిన్‌.. షాక్ లో నిక్‌!

Update: 2021-03-14 00:30 GMT
భ‌ర్త పొగ‌డ్త‌ల‌తో మురిసిపోవాల‌నుకుంటుంది ప్ర‌తీ భార్య‌.. వైఫ్ ప్రేమ‌లో త‌డిసిపోవాల‌ని చూస్తాడు ప్ర‌తీ హ‌జ్బెండ్‌. ఇవి రెండూ ఒక‌రికొక‌రు ఇచ్చిపుచ్చుకుంటూ రొమాంటిక్ లైఫ్ లీడ్ చేస్తున్నారు నిక్ జోన‌స్‌, ప్రియాంక‌. చిలిపి రొమాన్స్ తో చెల‌రేగిపోతూ.. అంద‌మైన లోకంలో విహ‌రిస్తున్నారు.

తాజాగా.. త‌న లేటెస్ట్ మ్యూజిక్ ఆల్బ‌మ్ 'స్పేస్ మ్యాన్‌' ను రిలీజ్ చేశాడు నిక్‌. ఈ సంద‌ర్భంగా త‌న మ్యూజిక్ ఆల్బ‌మ్ గురించి చెప్తూ ఓ వీడియో రూపొందించాడు. ఇందులోనే.. భార్య గురించి కూడా చెప్పుకొచ్చాడు జోన‌స్‌. త‌న జీవితంలో వేసే ప్ర‌తీ అడుగు వెన‌క త‌న భార్య ఉంటుంద‌ని, ఆమె ఎన్నో విష‌యాల్లో ఇన్స్‌పిరేష‌న్ గా ఉంటుంద‌ని చెప్పాడు.

అయితే.. జోనస్ వీడియో రికార్డు చేస్తుండ‌గానే.. వ‌చ్చి పెదాల‌ను చుంబించి ప‌క్క‌కు వెళ్లిపోయింది ప్రియాంక‌. ఈ స‌మ‌యంలో మ‌నోడి ఫీలింగ్ చూడాలి. అరెరె.. నేను చేస్తున్నది వీడియో షూట్ క‌దా.. ఇప్పుడు ప్రియాంక ఏం చేసింది అన్న‌ట్టు షాకింగ్ ఎక్స్ ప్రెష‌న్ ఇచ్చాడు జోన‌స్‌. ఆ త‌ర్వాత న‌వ్వేసుకున్నాడు. మొత్తానికి.. బాలీవుడ్ నుంచి హాలీవుడ్ ప్ర‌మోటై అద‌ర‌గొడుతున్న ప్రియాంక‌.. మిస్ నుంచి మిసెస్ గా మారి కూడా.. రొమాంటిక్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తోంది.
Tags:    

Similar News