ఇక్కడే కాదు అక్కడ కూడా 'ఉప్పెన' తాకినట్లుంది

Update: 2021-03-08 07:30 GMT
ఉప్పెన సినిమా తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ కృతిశెట్టి కి వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పటికే ఈమె తెలుగులో రామ్ మరియు సుధీర్ బాబు సినిమాల్లో నటిస్తున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది. మరో వైపు ఈమె తో ఇంకా పలువురు తెలుగు ఫిల్మ్ మేకర్స్ చర్చలు జరుపుతున్నారు. తాజాగా ఈమెను ప్రముఖ ఫిల్మ్‌ మేకర్‌ కలిసినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ సమయంలోనే తమిళం నుండి కూడా ఈమెకు ఆఫర్లు వస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం విక్రమ్‌ తనయుడు ధృవ హీరోగా నటించబోతున్న సినిమాలో ఈమెకు అవకాశం దక్కినట్లుగా తెలుస్తోంది.

అర్జున్‌ రెడ్డి తమిళ రీమేక్ తో ఇండస్ట్రీకి పరిచయం అయిన ధృవ మొదటి సినిమాతోనే సక్సెస్‌ దక్కించుకున్నాడు. ప్రస్తుతం ధృవ రెండు సినిమాలను లైన్ లో పెట్టాడు. అందులో ఒకటి స్టార్‌ డైరెక్టర్‌ మురుగదాస్‌ శిష్యుడు రవికాంత్ దర్శకత్వంలో రూపొందబోతుంది. ఆ సినిమా లో హీరోయిన్ గా ఉప్పెన బ్యూటీ కృతి శెట్టిని ఎంపిక చేసినట్లుగా సమాచారం అందుతోంది. ఇప్పటి వరకు అధికారికంగా అయితే ప్రకటన రాలేదు కాని తమిళ మీడియా వర్గాల్లో ప్రముఖంగా ఈ విషయమై చర్చించుకుంటున్నారు. తెలుగు మరియు తమిళంలో ఒకే సారి ఈ అమ్మడు కెరీర్‌ ఆరంభంలోనే ఆఫర్లు దక్కించుకోవడం తో సౌత్ స్టార్‌ హీరోయిన్ గా ఈమె నిలవడం ఖాయం అన్నట్లుగా టాక్ వినిపిస్తుంది.
Tags:    

Similar News