అందుకేగా గ్రీక్ గాడ్ అనేది!
బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ ఫిట్నెస్.. స్టైల్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. బాలీవుడ్ లో అంత్యంత ఫిట్ గా ఉండే హీరోలలో హృతిక్ ఒకరు. ఫోటో షూట్స్ లోనే కాదు క్యాజువల్ గా హృతిక్ కు ఫోటోలు తీసినా అవి ఎంతో స్టైలిష్ గా ఉంటాయి. కాసేపటి క్రితం హృతిక్ తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేశాడు.
ఈ ఫోటోకు హృతిక్ "ఒక్కోసారి పర్ఫెక్ట్ గా ఫోటోలు తీసినందుకు పేపరాజీకి థ్యాంక్ యూ చెప్పాలి" అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. అంటే ఈ ఫోటోను తీసింది బాలీవుడ్ మీడియావారు. ఫోటో అదిరిపోయింది. బ్లూ జీన్స్.. స్లీవ్ లెస్ టీ షర్టు..వైట్ కలర్ స్పోర్ట్ షూ ధరించిన హృతిక్ తలకు క్యాప్ పెట్టుకున్నాడు. చెవులలో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని.. కళ్ళకు గాగుల్స్.. ఒక చేత్తో టీ కప్ పట్టుకున్నాడు.. మరో చేత్తో హాయ్ చెప్తున్నాడు. స్లీవ్ లెస్ టీ షర్టు కావడంతో కండలు బైటపడ్డాయి. ఆ షోల్డర్.. ఆ బైసెప్స్.. ట్రైసెప్స్.. టోటల్ గా ఆ కండలు తిరిగిన చేతిని.. సన్నటి నడుమును చూస్తుంటే ఇప్పుడే మనం కూడా జిమ్ముకు వెళ్లి ఎడాపెడా ఎక్సర్ సైజులు చెయ్యాలి అని ఎవరికైనా ఇన్ స్పిరేషన్ వస్తుంది.
అందుకే ఆయనను బాలీవుడ్ లో గ్రీక్ గాడ్ అనే బిరుదుతో సత్కరించుకున్నారు. ఈ ఫోటోకు కామెంట్లలో కూడా అదే విషయాన్ని కొందరు చెప్పారు. ఈ ఫోటోను మరో బాలీవుడ్ కండల వీరుడు.. జిమ్నాస్టిక్ డ్యాన్స్ స్పెషలిస్ట్ టైగర్ ష్రాఫ్ లైక్ చేశాడు. హృతిక్ బైసెప్స్ సైజ్ 16 అంగుళాలు ఉంటుందని కామెంట్ కూడా చేశాడు. ఈ ఫోటో సంగతి సరే.. హృతిక్ సినిమాల విషయానికివస్తే 'సూపర్ 30' జూలై 12 న విడుదల కానుంది.