రానా-మిహీక‌ ల‌వ్ స్టోరీలో ఇన్ని ట్విస్టులా?

Update: 2020-08-10 07:50 GMT
ద‌గ్గుబాటి రానా ఓ ఇంటివాడైన సంగ‌తి తెలిసిందే. తాను ప్రేమించిన మిహీక బజాన్ ని పెళ్లాడేశాడు. అయితే ఈ జంట పెళ్లి గురించి తెలిసిన చాలా మందికి అస‌లు వీరి ప్రేమ‌క‌థ ఎలా మొద‌లైందో తెలియ‌నే తెలీదు. అస‌లు రానా- మిహీక మ‌ధ్య స్నేహం ఎప్ప‌టి నుంచి అన్న‌ది కూడా తెలిసింది త‌క్కువ‌మందికే. ఇంత‌కుముందు ల‌క్ష్మీ మంచుతో టాక్ షోలో లీకుల‌ ప్ర‌కారం.. విక్ట‌రీ వెంక‌టేష్ కుమార్తె ఆశ్రిత‌కు మిహీక క్లోజ్ ఫ్రెండ్ ..పైగా క్లాస్ మేట్ కూడా. అలా త‌న‌కు సోద‌రి వ‌ల్ల‌నే ప‌రిచ‌యమైన మిహీక‌.. ఆ త‌ర్వాత స్నేహితురాలిగా మారి ఇప్పుడిలా ప్రేమ వివాహం వ‌ర‌కూ వ‌చ్చింద‌నే అనుకున్నారంతా.

కానీ దానికి ముందు ఆ ఇద్ద‌రి ప‌రిచ‌యంలో చాలానే ట్విస్టులున్నాయి. విక్ట‌రీ వెంకటేష్ హీరోగా సురేష్ బాబు నిర్మించిన నాగ‌వ‌ల్లి (2010)కి ఆభ‌ర‌ణాలు డిజైన్ చేసింది మిహీక త‌ల్లిగారైన బంటీ బ‌జాజ్. ఆ క్ర‌మంలోనే మిహీక ఆ సినిమా స‌మ‌యంలో రానాకు ప‌రిచ‌యం అయ్యార‌ట‌. అప్ప‌టికే ఆ ఇరు కుటుంబాల మ‌ధ్య చ‌క్క‌ని స‌త్సంబంధాలున్నాయి. దాంతో రానాకు మిహీక‌తో స్నేహం కుదిరింది. బంగారు వ‌జ్రాభ‌ర‌ణాల డిజైనింగ్ లో నిష్ణాతులైన బ‌జాజ్ ఫ్యామిలీతో ద‌గ్గుబాటి కుటుంబానికి బాగా జ‌త కుదిరింది. ఇక రానానే నాగ‌వ‌ల్లి నిర్మాణ కార్య‌క్ర‌మాల్లో పాలు పంచుకోవ‌డంతో మిహీక‌తో స్నేహం బాగానే కుదిరింద‌ట‌.

అంతెందుకు.. ఇటీవ‌ల పెళ్లికి కొన్ని నెల‌ల ముందు రానాకు ఆరోగ్యం బావుండ‌కపోతే త‌న‌కు అండ‌గా నిలిచిన స్నేహితురాలు ఎవ‌రు? అంటే మిహీక‌నే అని తెలిసింది. అప్ప‌ట్లో దీని గురించి ఎలాంటి స‌మాచారం బ‌య‌టికి రాలేదు.. కానీ రానా తీవ్ర అనారోగ్యంతో ఉన్న‌ప్పుడు తాను అండ‌గా నిల‌వడంతో ఇక త‌న‌ను మించిన భాగ‌స్వామి వేరొక‌రు ఉండ‌రు అని రానా భావించాడ‌ట‌. అలా స్నేహ‌బంధం కాస్తా ప్రేమానుబంధంగా మారింది. ఇప్పుడు పెళ్లితో ఓ కొలిక్కి వ‌చ్చింది. సుశ్రిత ద‌గ్గుబాటి పెళ్లి వేడుక స‌హా ఇటీవ‌ల `అమ‌ర్ చిత్ర‌క‌థ` పుస్త‌కావిష్క‌ర‌ణ వ‌ర‌కూ ప్ర‌తిదాంట్లో బ‌జాజ్ ఫ్యామిలీ ఇన్వాల్వ్ మెంట్ ఉంది. ముఖ్యంగా మిహీక బ‌జాజ్ ఈవెంట్ మేనేజ‌ర్ గా ఈవెంట్ల నిర్వ‌హ‌ణ అంతా స్వ‌యంగా చూసుకున్నారు. ఒక‌ర‌కంగా ద‌గ్గుబాటి కుటుంబంలో మిహీక చాలా ఏళ్లుగానే ఒక భాగం అని దీనిని బ‌ట్టి అర్థ‌మ‌వుతోంది. స్నేహం ప్రేమ‌గా మారింది. ప్రేమ ప‌రిణ‌యంగా మారింది. అలా భ‌ళ్లాలుని వికెట్ నేల కూలింద‌న్న‌మాట‌.
Tags:    

Similar News