మహేష్ ఇన్ని హిట్లు కోల్పోయాడా..?! అన్నీ సూపర్ హిట్లే!
ఒక లైన్ అనుకొని, అది కథగా మారి, సెట్స్ పైకి వెళ్లేనాటికి ఏం జరుగుతుందో ఎవ్వరూ చెప్పలేరు. అనుకున్న హీరో ప్లేసులోకి మరో స్టార్ వచ్చి చేరొచ్చు. టేకప్ చేయాల్సిన దర్శకుడి స్థానంలో మరొకరు మెగా ఫోన్ పట్టొచ్చు. సెలక్ట్ చేసిన హీరోయిన్ బదులు.. మరో బ్యూటీ లైన్లోకి రావొచ్చు. ఇది సినీ ఇండస్ట్రీలో తరచూ జరిగేదే. కానీ.. అనూహ్యమైన ఫలితాలు వచ్చినప్పుడు ఈ విషయాలు చర్చనీయాంశం అవుతుంటాయి.
అయితే.. ఈ మధ్య సుకుమార్ చెప్పిన ఓ కథను మహేష్ బాబు రిజెక్ట్ చేయడంతో.. అది అల్లు అర్జున్ వద్దకు చేరిందట. దీంతో.. మహేష్ కెరీర్లో వదులుకున్న సినిమాల లిస్టు మొత్తం ఒక్కొక్కటిగా తెరపైకి వచ్చేసింది. కాగా.. ప్రిన్స్ వదులుకున్న సినిమాల్లో మెజారిటీ హిట్ మూవీస్ ఉండడం విశేషం. అవేంటన్నది చూద్దాం.
'ఫిదా' సినిమాతో దర్శకుడు శేఖర్ కమ్ముల సృష్టించిన ప్రభంజనం అంతాఇంతా కాదు. తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషన్ క్రియేట్ చేసిందీ మూవీ. ఈ కథను శేఖర్ ముందుగా మహేష్ బాబుకే వినిపించాడట. ప్రిన్స్ ను దృష్టిలో పెట్టుకొని కథ రాసుకున్నాడట. కానీ.. ఆయన నో చెప్పడంతో.. వరుణ్ తేజ్ దగ్గరకు వెళ్లింది. బాక్సాఫీస్ ను బద్దలు కొట్టింది.
'ఏమాయ చేసావే' చిత్రం తెలుగు ప్రేక్షకులను ఎంతగా మాయచేసిందో తెలిసిందే. ఈ క్యూట్ లవ్ స్టోరీని మహేష్ బాబును దృష్టిలో పెట్టుకునే సిద్ధం చేశాడట గౌతమ్ మీనన్. కానీ.. దీనికి కూడా మహేష్ తల అడ్డంగా ఊపేశాడట. దీంతో., ఈ కథ నాగచైతన్యను వెతుక్కుంటూ వెళ్లింది. బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.
ఇక, ఉదయ్ కిరణ్ ను హ్యాట్రిక్ హీరోగా నిలబెట్టిన చిత్రం 'మనసంతా నువ్వే'. ఈ సినిమాలో మహేష్ ను హీరోగా తీసుకోవాలని అనుకున్నారట నిర్మాత ఎంఎస్ రాజు. వీరిద్దరూ కలిసి ఒక్కడు వంటి బ్లాక్ బస్టర్ ను ఇచ్చిన సంగతి తెలిసిందే. కానీ.. మనసంతా నువ్వేకు నో చెప్పాడట ప్రిన్స్. దీంతో.. ఉదయ్ వద్దకు చేరి, సూపర్ హిట్ అయ్యింది.
మహేష్-త్రివిక్రమ్ కాంబినేషన్ కు ఎంత క్రేజ్ ఉందో తెలిసిందే. ఇప్పటికే వీరి కాంబోలో రెండు సినిమాలు వచ్చాయి. మూడో సినిమాగా 'అ, ఆ' అనుకున్నారట త్రివిక్రమ్. కానీ.. అంగీకరించలేదట మహేష్. ఫ్రేమ్ లోకి నితిన్ రావడం.. బిగ్గెస్ట్ హిట్ గా నిలవడం జరిగిపోయాయి.
ఇవేకాకుండా.. రుద్రమ దేవిలో అల్లు అర్జున్ చేసిన గోన గన్నారెడ్డి పాత్ర, మెగాస్టార్ రీమేక్ చేసిన 'కత్తి' వంటి సినిమాలు మహేష్ ను దాటుకునే వేరే హీరోల వద్దకు వెళ్లాయట. నిజంగా.. వీటిల్లో మహేష్ నటిస్తే ఎలా ఉండేదంటారు..?