బిబి4 : ఈసారి కూడా అభిజిత్‌ కే ఎక్కువ ఓట్లు ఎలా?

Update: 2020-10-07 08:50 GMT
బిగ్‌ బాస్‌ ఈ సీజన్‌ కంటెస్టెంట్స్‌ విషయంలో ప్రేక్షకులు మొదటి రోజే పెదవి విరిచారు. బాగా పరిచయం ఉన్న వారు చాలా తక్కువ మంది ఉన్నారంటూ విమర్శలు వచ్చాయి. లైఫ్‌ ఈజ్‌ బ్యూటీఫుల్‌ సినిమాలో ఒక హీరోగా కనిపించిన అభిజిత్‌ ఈ సీజన్‌ లో ఒక కంటెస్టెంట్‌ గా ఉన్నాడు. ఈయన ప్రేక్షకుల్లో కొందరికి తప్ప ఎక్కువ శాతం మందికి అస్సలు తెలియదు. ఆ సినిమా పెద్దగా ఆడకపోవడం వల్ల అభిజిత్‌ కు గుర్తింపు రాలేదు. ఆ తర్వాత వెబ్‌ సిరీస్ లో నటించినా కూడా దాంతో అందరికి రీచ్‌ కాలేదు. కాని బిగ్‌ బాస్‌ హౌస్‌ లో ఉన్న వారందరిలోకి అభిజిత్‌ కే ఎక్కువగా ఓట్లు పడుతుండటం అందరిని ఆశ్చర్యపర్చుతుంది.

సోషల్‌ మీడియాలో అభిజిత్‌ పేరుతో పెద్ద ప్రచారం చేస్తున్నారు. ప్రతి కంటెస్టెంట్‌ కు కూడా పీఆర్‌ టీమ్‌ ఉంటుంది. వారు సోషల్‌ మీడియాలో ఆ కంటెస్టెంట్‌ ఎలిమినేషన్‌ లో ఉన్న సమయంలో పెద్ద ఎత్తున ప్రచారం చేసి సేవ్‌ చేసేందుకు కృషి చేస్తూ ఉంటారు. అభిజిత్‌ ఎంపిక చేసుకున్న పీఆర్‌ టీం చాలా యాక్టివ్‌ గా ఉందట. వారు అభి కోసం ప్రచారం చేయడంతో పాటు ఓట్లు భారీగా పడటంలో కీలకంగా వ్యవహరిస్తున్నారట. అభిజిత్‌ ఎలిమినేషన్‌ కు నామినేట్‌ అయిన ప్రతి సారి కూడా ఆయనకు మొత్తం ఓట్లలో 40 శాతం ఓట్లు వస్తున్నాయట. గతంలో కౌశల్‌ కు ఇలా ఓట్లు పడ్డట్లుగా చెబుతున్నారు. గంగవ్వ మొదటి రెండు వారాలు ఎలిమినేషన్‌ లో ఉండగా ఆమెకు ఎక్కువ ఓట్లు పడ్డాయి. ప్రస్తుతం మాత్రం అభిజిత్‌ కు ఎక్కువగా ఓట్లు పడుతున్నట్లుగా మీడియా సర్కిల్స్‌ ద్వారా తెలుస్తోంది.

అభిజిత్‌ పై కొందరు ప్రేక్షకుల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నా కూడా ఆయన గురించి మొత్తం పాజిటివ్‌ గా ప్రచారం చేయడంలో పీఆర్‌ టీం సక్సెస్‌ అయ్యింది. ఫిజికల్‌ గా గేమ్‌ ఆడేందుకు ఇష్టపడడు. ఎక్కువగా ఒంటరిగా ఉండేందుకు ఇష్టపడుతాడు. ఇంగ్లీష్‌ లో ఎక్కువ మాట్లాడుతూ తనకు తాను క్లాస్‌ అన్నట్లుగా ఫీల్‌ అవుతాడు అంటూ అభిజిత్‌ గురించి బయట ప్రచారం ఉంది. అయినా కూడా ఆయన ఈజీగా సేవ్‌ అవుతూ వస్తున్నాడు. ఈ వారం కూడా అభిజిత్‌ సేవ్‌ అవ్వడం ఖాయం అన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అభిజిత్‌ జోరు చూస్తుంటే ఫైనల్‌ వరకు వెళ్లే అవకాశం ఉందనిపిస్తుంది.
Tags:    

Similar News