అనన్య పాండే, అవతార్ 3 ని క్రష్ చేసి పడేసిన బాక్స్ ఆఫీస్
ధురంధర్.. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులను ఆకట్టుకోవడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తూ రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తూ దూసుకుపోతోంది.;
ధురంధర్.. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులను ఆకట్టుకోవడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తూ రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తూ దూసుకుపోతోంది. అంతేకాదు హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామరూన్ దర్శకత్వం వహించిన అవతార్ 3 తో పాటు చాలా సినిమాలు ఈ సినిమా దెబ్బకు బోల్తా కొట్టాయి అంటే ఎవరైనా నమ్మగలరా.. తాజాగా విడుదలైన ఆ చిత్రాల పరిస్థితి చూస్తుంటే నిజమే అనక మానరు. మరి ధురంధర్ సినిమాకి పోటీగా విడుదలై బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిన చిత్రాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..
ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ ఆదిత్యధర్ దర్శకత్వంలో రణ్ వీర్ సింగ్ హీరోగా, సారా అర్జున్ , ఆర్.మాధవన్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తూ వచ్చిన చిత్రం ధురంధర్. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఊహించని రేంజ్ లో కలెక్షన్లు వసూలు చేస్తూ సంచలనం సృష్టిస్తోంది. మూడు వారాల్లోనే 1000 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టిన ఈ సినిమా 24 రోజుల్లోనే 1100 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి రికార్డు క్రియేట్ చేసింది. అంతేకాదు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రాలలో తొమ్మిదవ స్థానాన్ని దక్కించుకోగా.. హిందీ చిత్రాలలో నాలుగవ చిత్రంగా స్థానం దక్కించుకుంది. అటు ఓటిటిలో కూడా రూ.285 కోట్లకు ఈ సినిమా డిజిటల్ హక్కులు అమ్ముడుపోయి నెట్ ఫ్లిక్స్ లో సంచలనం సృష్టించింది ఈ సినిమా.
అలాంటి ఈ సినిమా విడుదలైన సమయంలో హాలీవుడ్ అవతార్ ఫ్రాంచైజీ లో భాగంగా అవతార్: యాష్ అండ్ ఫైర్ అంటూ విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించలేదు. ముఖ్యంగా పాత్రలు ప్రేక్షకులను ఆకట్టుకోకపోవడమే కాకుండా కథ సాగదీతగా ఉంది అని చాలామంది అభిమానులు నిరాశ వ్యక్తం చేశారు. ఇదే సమయంలో ధురంధర్ థియేటర్లలోకి రావడంతో చాలామంది అభిమానులు అవతార్ 3 చిత్రాన్ని పక్కన పడేశారు. దీనికి తోడు ఇటీవల అనన్య పాండే హీరోయిన్గా, కార్తీక్ ఆర్యన్ హీరోగా వచ్చిన 'తూ మేరీ మైన్ తేరా మైన్ తేరా తూ మేరీ' మూవీ కూడా ఈ చిత్రం దెబ్బకు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిందని వార్తలు అనిపిస్తున్నాయి.
అసలు విషయంలోకి వెళ్తే బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే ఇటీవల కొన్ని చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అటు ఓటీటీ చిత్రాలు కూడా విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమాలతో మంచి ప్రశంసలు అందుకున్న ఈమెకు.. కార్తీక్ ఆర్యన్ తో తీసిన తూ మేరీ మైన్ తేరా మైన్ తేరా తూ మేరీ సినిమా మాత్రం ఆశించిన స్థాయిలో విజయాన్ని అందించలేదు. దీనికి కారణం ధురంధర్ సినిమా అనే చెప్పాలి. మొత్తానికైతే ఈ సినిమా దెబ్బకు చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయి. ఇక ధురంధర్ సినిమా హవా ఇంకెన్ని రోజులు కొనసాగుతుందో చూడాలి అంటూ నేటిజన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు.