రాజా సాబ్ పోస్ట్.. పేరు మిస్సైతే తమన్ ఫీలవ్వడా?

టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఇప్పుడు ఫుల్ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అటు స్టార్ హీరోల సినిమాలకు.. ఇటు మిడ్ రేంజ్ చిత్రాలకు.. వర్క్ చేస్తూ సందడి చేస్తున్నారు.;

Update: 2025-12-30 19:27 GMT

టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఇప్పుడు ఫుల్ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అటు స్టార్ హీరోల సినిమాలకు.. ఇటు మిడ్ రేంజ్ చిత్రాలకు.. వర్క్ చేస్తూ సందడి చేస్తున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటికే వివిధ చిత్రాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరించిన తమన్.. తన సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ తో సినీ ప్రియులను మెప్పించారు.

ఇప్పుడు ఆయన నుంచి రాబోతున్న కొత్త మూవీ ది రాజా సాబ్. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లీడ్ రోల్ లో నటిస్తున్న ఆ సినిమాను మారుతి తెరకెక్కిస్తున్నారు. కామెడీ హారర్ జోనర్ లో రూపొందిస్తున్నారు. అయితే తొలిసారి తమన్.. ప్రభాస్ యాక్ట్ చేస్తున్న మూవీకి వర్క్ చేస్తుండడంతో అభిమానులతోపాటు మ్యూజిక్ లవర్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు.

రాజా సాబ్ నుంచి ఫస్ట్ సింగిల్ విషయంలో ట్రోల్స్ ఎదుర్కొన్న తమన్.. సెకెండ్ సాంగ్ విషయంలో అందరినీ మెప్పించారు. రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ 2.0కి అయితే సూపర్ రెస్పాన్స్ వచ్చింది. తమన్ అందించిన ఆర్ఆర్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. దీంతో చాలా మంది తమన్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆర్ఆర్ అదిరిందని చెబుతున్నారు.

అదే సమయంలో బాలీవుడ్ క్రిటిక్ తరణ్ ఆదర్శ్.. రాజా సాబ్ ట్రైలర్ పై ప్రశంసలు కురిపిస్తూ పోస్ట్ పెట్టారు. హిందీ వెర్షన్ ను షేర్ చేస్తూ జనవరి 9వ తేదీ రిలీజ్ అంటూ రాసుకొచ్చారు. ఆ తర్వాత సినిమాకు సంబంధించిన వారిందరి పేర్లు మెన్షన్ చేశారు. హీరో, హీరోయిన్లు, కీలక పాత్రలు పోషించిన నటీనటులు, డైరెక్టర్, ప్రొడ్యూసర్ పేర్లు యాడ్ చేశారు.

కానీ అందులో తమన్ పేరు మాత్రం కనిపించలేదు. దీంతో తరణ్ ఆదర్శ్ ట్వీట్ ను రీట్వీట్ చేసి ఆయన పోస్ట్ పెట్టారు. సినిమాకు మ్యూజిక్ అందించింది తమన్ అంటూ రాసుకొచ్చారు. తన ట్విట్టర్ ఐడీని కూడా మెన్షన్ చేశారు. దీంతో ఇప్పుడు తమన్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అనేక మంది నెటిజన్లు రెస్పాండ్ అవుతున్నారు.

తరణ్ ఆదర్శ్.. తన పేరును మెన్షన్ చేయకపోవడంతో తమన్ హర్ట్ అయినట్టు ఉన్నారని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. అందరి పేర్లు రాసుకొచ్చి.. తమన్ ను వదిలేయడంతో బాధపడినట్లు ఉన్నారని చెబుతున్నారు. అందుకే అలా పోస్ట్ ను రీ ట్వీట్ చేసి.. మ్యూజిక్ అందించింది తానేనని రాసుకొచ్చి ఉంటారని అంటున్నారు.

అయితే తరణ్ ఆదర్శ్ ప్రముఖ క్రిటిక్ అన్న విషయం తెలిసిందే. బాలీవుడ్ సినిమాల బాక్సాఫీస్ లెక్కలు, రివ్యూలు ఇస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇచ్చే ఆయనకు మిలియన్ల కొద్దీ ఫాలోవర్స్ ఉన్నారు. మరి ఇప్పుడు రాజా సాబ్ కోసం పెట్టిన పోస్ట్ లో తమన్ పేరును ఎందుకు మెన్షన్ చేయలేదో ఆయనకే తెలియాలి.

Tags:    

Similar News