బిగ్ బాస్ హోస్ట్.. డౌట్స్ అనవసరం..!

ఇదిలా ఉంటే బిగ్ బాస్ సీజన్ 9 హోస్ట్ గా నాగార్జున కూడా అదరగొట్టారు. ప్రతి సీజన్ అయ్యాక లేదా ప్రతి సీజన్ మొదలయ్యే ముందు హోస్ట్ గురించి కూడా రకరకాల వార్తలు వస్తాయి.;

Update: 2025-12-30 17:30 GMT

బిగ్ బాస్ సీజన్ 9 పూర్తవ్వడంతో ఎప్పుడు లేనిది బిగ్ బాస్ ఆడియన్స్ నెక్స్ట్ సీజన్ కోసం మాత్రమే కాదు అందులో పాల్గొనే కామనర్స్ ఎవరెవరు అన్నది చూడాలని ఆసక్తిగా ఉన్నారు. దానికి రీజన్ ఏంటంటే బిగ్ బాస్ సీజన్ 9కి అగ్నిపరీక్ష ద్వారా కంటెస్టెంట్స్ ఎంపిక జరిగింది. అలా అగ్నిపరీక్ష నుంచి వచ్చిన కామనర్ కళ్యాణ్ పడాల బిగ్ బాస్ సీజన్ 9 టైటిల్ విన్నర్ గా నిలిచాడు. సో నెక్స్ట్ సీజన్ అగ్నిపరీక్ష నుంచి వచ్చే వాళ్ల మీద కూడా ఈ రేంజ్ ఎక్స్ పెక్టేషన్స్ ఉంటాయి.

బిగ్ బాస్ హోస్ట్ మారుతున్నారంటూ..

ఇదిలా ఉంటే బిగ్ బాస్ సీజన్ 9 హోస్ట్ గా నాగార్జున కూడా అదరగొట్టారు. ప్రతి సీజన్ అయ్యాక లేదా ప్రతి సీజన్ మొదలయ్యే ముందు హోస్ట్ గురించి కూడా రకరకాల వార్తలు వస్తాయి. హోస్ట్ మారుతున్నారంటూ న్యూస్ రావడం కామన్ అయ్యింది. ఐతే సీజన్ 9 హోస్ట్ నాగార్జున మాత్రమే అని ఆయన తప్ప మరెవరు చేయలేరని క్లారిటీ వచ్చింది. ఐతే సీజన్ 10కి కూడా నాగార్జుననే హోస్ట్ చేస్తాడని తెలుస్తుంది.

ఈమధ్యనే బిగ్ బాస్ మేకర్స్ ఎండిమోల్ టీం బిగ్ బాస్ హోస్ట్ అందరినీ ఒకచోటికి తెచ్చింది. అందులో మళయాళ హోస్ట్ నాగార్జున, తమిళ్ హోస్ట్ విజయ్ సేతుపతితో పాటు తెలుగు హోస్ట్ నాగార్జున కూడా అటెండ్ అయ్యారు. మొదట్లో తాను బిగ్ బాస్ ని ఇష్టపడలేదు కానీ ఇప్పుడు బిగ్ బాస్ ని చాలా ఇష్టపడుతున్నా అన్నారు. చూస్తుంటే తెలుగు బిగ్ బాస్ కి హోస్ట్ గా నాగార్జున పర్మినెంట్ అనే చెప్పుకోవచ్చు.

నాగార్జున మాటలను బట్టి చూస్తే..

ఐతే నెక్స్ట్ ఇయర్ బిగ్ బాస్ సీజన్ 10 ఎండిమోల్ వాళ్లు అన్నపూర్ణ స్టూడియోస్ లో కాకుండా బయట సెట్ వేస్తారన్న టాక్ నడుస్తుంది. ఐతే అది ఎంతవరకు వాస్తవం అన్నది క్లారిటీ రావాలి. అన్నపూర్ణ స్టూడియోస్ కాకపోతే నాగార్జున హోస్ట్ గా కొనసాగుతారా లేదా అన్న డౌట్ రేజ్ అవుతుంది. మొన్న జరిగిన ఈవెంట్ లో నాగార్జున మాటలను బట్టి చూస్తే ఆయన తెలుగు బిగ్ బాస్ హోస్ట్ గా కొన్నాళ్ల పాటు కొనసాగాలనే ఆలోచన ఉన్నట్టు అనిపిస్తుంది. మరి సీజన్ 10 లొకేషన్ మారితే హోస్ట్ మారుతాడా లేదా మన కింగ్ నాగార్జుననే కొనసాగుతారా అన్నది చూడాలి.

టాలీవుడ్ లో సీనియర్ స్టార్ అయిన నాగార్జున ఓ పక్క సినిమాలు చేస్తూనే బిగ్ బాస్ హోస్ట్ గా కొనసాగుతున్నారు. బిగ్ బాస్ సీజన్ 3 నుంచి రీసెంట్ గా పూర్తైన సీజన్ 9 అంటే దాదాపు 7 సీజన్లు నాగార్జున హోస్ట్ గా చేశారు. సో సీజన్ 10 మాత్రమే కాదు తెలుగు బిగ్ బాస్ కి ఒకే ఒక్క హోస్ట్ అది నాగార్జున మాత్రమే అనేస్తున్నారు బిగ్ బాస్ ఆడియన్స్.

Tags:    

Similar News