• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఓపెన్ బ్యాక్ లుక్‌తో కిల్...

ఓపెన్ బ్యాక్ లుక్‌తో కిల్ చేస్తున్న బ్యూటీ!

| ఇటీవ‌లే ఫ‌హ‌ద్ ఫాజిల్ తో క‌లిసి న‌టించిన `కుతిర చాదుం కుతిర` విడుద‌లైంది. ఇది ఓటీటీలో విడుద‌లైనా, త‌న‌ నటనకు ప్రశంసలు అందుకుంది క‌ళ్యాణి.

By - Sivaji Kontham
Update: 2025-12-30 22:30 GMT

క‌ర‌ణ్ జోహార్ అంత‌టివాడు పొగిడేసాడు.. 2025లో `లోకా చాప్ట‌ర్1- చంద్ర‌` త‌న‌కు నచ్చిన ఉత్త‌మ సినిమాల్లో ఒక‌టి అని..!!. ఈ సినిమాలో ప్ర‌ధాన పాత్ర‌ధారి క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్ న‌ట‌ప్ర‌ద‌ర్శ‌న‌, కంటెంట్ పై దిగ్గ‌జ ద‌ర్శ‌క‌నిర్మాత పొగ‌డ్త‌ల వ‌ర్షం కురిపించారు. సాయిధ‌ర‌మ్ స‌ర‌స‌న `చిత్ర‌ల‌హ‌రి`లో న‌టించిన ప్రియ‌ద‌ర్శిని, కొన్ని ఇత‌ర క‌మ‌ర్షియ‌ల్ సినిమాల్లో న‌టించింది. కానీ వాటితో రాని గుర్తింపును ఒకే ఒక్క ఫాంట‌సీ డ్రామా `లోకా`తో సంపాదించింది. నాయికా ప్ర‌ధాన పాత్ర‌లో క‌ళ్యాణి న‌ట‌న‌కు మంచి పేరొచ్చింది. మ‌ల‌యాళ చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లో చాలామంది అగ్ర హీరోలు సాధించ‌లేని రూ.300 కోట్ల క్ల‌బ్ ని అందుకుంది ప్రియ‌ద‌ర్శిని. ఈ ఏడాది అత్యంత చ‌ర్చ‌నీయాంశ‌మైన న‌టీమ‌ణుల‌లో ఒక‌రిగా క‌ళ్యాణి పేరు మార్మోగింది.





 


 


ఇటీవ‌లే ఫ‌హ‌ద్ ఫాజిల్ తో క‌లిసి న‌టించిన `కుతిర చాదుం కుతిర` విడుద‌లైంది. ఇది ఓటీటీలో విడుద‌లైనా, త‌న‌ నటనకు ప్రశంసలు అందుకుంది క‌ళ్యాణి. ఒక పెద్ద బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత మ‌రో ప్ర‌శంస‌.. ఈ భామ‌లో గొప్ప ఉత్సాహం నింపింది. ఇక ఇదే హుషారులో క‌ళ్యాణి వ‌రుస ఫోటోషూట్ల‌లో పాల్గొంటోంది. లుక్ ప‌రంగా ప్ర‌యోగాల‌కు వెన‌కాడ‌టం లేదు. ఇప్పుడు స‌హ‌జ‌సిద్ధ‌త‌- డీసెన్సీ చెడ‌కుండా, ఓపెన్ బ్యాక్ లుక్‌తో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. ఈ ఫోటోషూట్ కోసం ఎంపిక చేసుకున్న డార్క్ థీమ్ డ్రెస్ ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. క‌ళ్యాణి చూడ‌టానికి ఎంత సింపుల్‌గా క‌నిపిస్తోందో, అంత‌కుమించి ట్రెండీగాను త‌న‌ను ఎలివేట్ చేసుకోగ‌ల‌దు. ప్ర‌స్తుతం ఈ స్పెష‌ల్ ఫోటోషూట్ ఇంట‌ర్నెట్‌లో జోరుగా వైర‌ల్ అవుతోంది.




 


క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్ వెరీ డీసెంట్.. కానీ సంథింగ్ స్పెష‌ల్ ట్యాలెంట్! అంటూ అభిమానులు కితాబిచ్చేస్తున్నారు. `లోకా` ఫ్రాంఛైజీలో క‌ళ్యాణి మ‌రిన్ని అద్భుతాలు చేస్తుంద‌ని కూడా భావిస్తున్నారు. ఈ భామ త‌దుప‌రి వ‌రుస చిత్రాల‌తో బిజీ బిజీగా ఉంది. జెనీ, మార్షల్ అనే భారీ చిత్రాల్లో న‌టిస్తోంది. `లోకా`తో బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్న త‌ర్వాత‌, క‌ళ్యాణి ఈ ఏడాది త‌మిళ ప‌రిశ్ర‌మ‌లోను రాణించేందుకు చేయాల్సిన ప్ర‌య‌త్నాల‌న్నీ చేస్తోంది.




 


మంచి స్నేహంతో విలువ‌

ఏ ప‌రిశ్ర‌మ‌లో అయినా మంచి స్నేహాలు, అనుబంధాలు ఎప్పుడూ ఎదుగుద‌ల‌కు కీల‌కం. అలాంటి మంచి స్నేహితుడు ఉన్నాడు క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్‌కు. మ‌ల‌యాళ స్టార్ హీరో దుల్క‌ర్ స‌ల్మాన్ లాంటి ఒక సోద‌రుడు, స్నేహితుడు త‌న‌కు ఉన్నాడు. లోకా-చాప్ట‌ర్ 1 గ్రాండ్ స‌క్సెస్ సాధించ‌డం వెన‌క చిత్ర నిర్మాత దుల్క‌ర్ స‌ల్మాన్ పెట్టుబ‌డి, ప్ర‌ణాళిక‌, స్నేహితురాలి విజ‌యం కోసం అత‌డు త‌పించిన తీరు చాలా ముఖ్య‌మైన‌వి. బ‌హుశా క‌ళ్యాణి విజ‌యం వెన‌క మంచి స్నేహితుడు ఉన్నాడంటే అతిశ‌యోక్తి లేదు.

Tags:    
  • kalyanipriyadarshan 
  • mollywood 
  • filmindustry 
  • movies 
  • trendingclicks 
  • lokahchapter1 

Similar News

అనిరుధ్ పెళ్లి.. ఆ చిత్రాలపై ఎఫెక్ట్?

2026-11-14 10:45 GMT

ఇండస్ట్రీకి దూరం కానున్న మాస్టర్ భరత్.. వైరల్ న్యూస్ పై క్లారిటీ!

2026-11-14 10:45 GMT

చిరు సినిమాపై తమన్ మళ్లీ హైప్.. ఈసారి ఏమవుతుందో!

2026-11-14 10:44 GMT

అన‌సూయ‌కు అవ‌కాశాలు త‌గ్గిన వేళ‌!

2026-11-14 10:30 GMT

ఆర్సీ 17 కోసం రామ్ చ‌ర‌ణ్ మేకోవ‌ర్!

2026-11-14 09:30 GMT

'దాదా ధమాకా'.. బాలయ్య స్వాగ్ లో నర్గీస్ స్టన్నింగ్ గ్లామర్

2026-11-14 08:42 GMT

హీరోయిన్ల విష‌యంలో సుకుమార్ ఆ రిస్క్ తీసుకోరా?

2026-11-14 08:30 GMT

స్పైడర్-మ్యాన్ ఇమేజ్ దాటేసిన టామ్ హాలండ్!

2026-11-14 07:19 GMT

ప్రెగ్నెన్సీలో క్యూట్ లుక్.. సమంత ధరించిన ఈ ఫ్రాక్ ఖరీదు ఎంతో తెలుసా?

2026-11-14 06:53 GMT

కొత్త జేమ్స్ బాండ్ ఎవరు?

2026-11-14 06:53 GMT

హీరో కూతురుకి హిట్ సీక్వెల్ కలిసి వచ్చేనా?

2026-11-14 06:43 GMT

ఆ సీక్వెల్‌తోనే చిరుకు జాతీయ అవార్డు.. స‌వాల్ స్వీక‌రించే ద‌ర్శ‌కుడు ఎవ‌రు?

2026-11-14 06:43 GMT

Copyright @2026

Powered by Blink CMS