• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అనిరుధ్ పెళ్లి.. ఆ...

అనిరుధ్ పెళ్లి.. ఆ చిత్రాలపై ఎఫెక్ట్?

| అనిరుధ్ రవిచందర్ తన వివాహం నేపథ్యంలో వచ్చే ఏడాది జనవరి వరకు ప్రొఫెషనల్ వర్క్‌కు బ్రేక్ ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది. నవంబర్ 21న చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్ నిర్వహించనున్నట్లు కథనం పేర్కొంది. ప్రస్తుతం ఆయన తెలుగులో ‘మ్యాజిక్’, ‘AA 23’, ‘NTR x Trivikram’, ‘RC 17’, ‘దేవర 2’ వంటి ప్రాజెక్టులతో పాటు తమిళ, హిందీ చిత్రాలకు కూడా సంగీతం అందిస్తున్నారు. ఈ విరామం వల్ల కొన్ని సినిమాల షెడ్యూళ్లపై ప్రభావం పడే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది.

By - Madhu Reddy
Update: 2026-11-14 10:45 GMT

చిత్ర పరిశ్రమలో మ్యూజిక్ సెన్సేషన్ గా గుర్తింపు తెచ్చుకున్న అనిరుధ్ రవిచందర్ ఎట్టకేలకు సోషల్ మీడియా రూమర్స్ కి చెక్ పెడుతూ తన ప్రేయసి , హైదరాబాద్ సన్ రైజర్స్ సీఈవో కావ్య మారన్ తో అతిరథుల మహారధుల సమక్షంలో గ్రీస్ వేదికగా సెల్ఫ్ రెస్పెక్ట్ పద్ధతిలో వివాహం చేసుకున్నారు. వివాహం అనంతరం నూతన దంపతులిద్దరూ చెన్నై చేరుకున్నారు. కుటుంబ సభ్యులతో ఎయిర్ పోర్ట్ నుంచి కారులో ఇంటికి వెళ్లిపోయిన దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

వచ్చే ఏడాది జనవరి వరకు ఇండస్ట్రీకి బ్రేక్..

నవంబర్ 21న చెన్నైలో సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖుల కోసం ప్రత్యేకంగా గ్రాండ్ రిసెప్షన్ ని కూడా ఏర్పాటు చేయనున్నారు. ఇకపోతే కొత్తగా పెళ్లి చేసుకున్న నేపథ్యంలో వచ్చే ఏడాది జనవరి వరకు అనిరుధ్ ప్రొఫెషనల్ వర్క్ కి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.. అయితే ఈ నిర్ణయం ఆయన సినిమాలపై ఎఫెక్ట్ పడనుందా అనే కామెంట్లు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మరి అనిరుధ్ టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు అందిస్తున్న ఆ చిత్రాల జాబితా ఏంటో ఇప్పుడు చూద్దాం.

అనిరుధ్ సంగీతం అందిస్తున్న తెలుగు చిత్రాలు..

2026 చివరి నాటి నుండి 2027లో విడుదల కానున్న అనిరుద్ ప్రధాన చిత్రాల జాబితా ఇప్పుడు మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రస్తుతం ఈయన గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వస్తున్న 'మ్యాజిక్' అనే చిత్రానికి సంగీతం అందించారు ఈ సినిమా నవంబర్ 226న ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే అల్లు అర్జున్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో రాబోతున్న భారీ మూవీ 'AA 23' కి అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రానికి కూడా 'NTR x Trivikram' ప్రాజెక్టుకు కూడా అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నారు. వీటితోపాటు రామ్ చరణ్ ,సుకుమార్ కాంబినేషన్లో రాబోయే RC 17, కొరటాల శివ జూనియర్ ఎన్టీఆర్ కలయికలో రాబోతున్న దేవరా సీక్వెల్ దేవర 2, అలాగే గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఎం.ఎస్.సుబ్బులక్ష్మి బయోపిక్ చిత్రానికి కూడా అనిరుధ్ సంగీతం అందించనున్నారు.

తమిళ్, హిందీ ప్రాజెక్ట్స్ కూడా..

తెలుగు మాత్రమే కాకుండా తమిళ్, హిందీ ప్రాజెక్ట్స్ కు కూడా ఆయన సంతకం చేశారు. అటు తమిళ్లో శంకర్ దర్శకత్వంలో కమలహాసన్ నటిస్తున్న 'ఇండియన్ 3' , కమలహాసన్, రజనీకాంత్ కాంబినేషన్లో రాబోతున్న KH x RK రీ యూనియన్ , ఎస్ యు అరుణ్ కుమార్ దర్శకత్వంలో కమలహాసన్ నటిస్తున్న 'సిండియార్', అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో అజిత్ కుమార్ నటిస్తున్న 'డేర్ డెవిల్', అశ్వత్ మారి ముత్తు దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా నటిస్తున్న 'ధర్మన్', వెట్రిమారన్ దర్శకత్వంలో శింబు నటిస్తున్న అరసన్ వంటి చిత్రాలకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. అలాగే సిద్ధార్థ ఆనంద్ దర్శకత్వంలో షారుక్ ఖాన్ నటిస్తున్న 'కింగ్' చిత్రానికి కూడా అనిరుధ్ అతిథి గా సంగీతం అందిస్తుండడం గమనార్హం. ఇకపోతే జనవరి వరకు అనిరుధ్ బ్రేక్ తీసుకున్నప్పటికీ ప్రత్యేకించి కొన్ని చిత్రాలపై ఎఫెక్ట్ పడిన మిగతా సినిమాలు ఇంకా ప్రారంభం కాలేదు కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు అనే కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి.

Tags:    
  • anirudhravichander 
  • kavyamaran 
  • aa23 
  • tollywood 
  • kollywood 

Similar News

ఇండస్ట్రీకి దూరం కానున్న మాస్టర్ భరత్.. వైరల్ న్యూస్ పై క్లారిటీ!

2026-11-14 10:45 GMT

చిరు సినిమాపై తమన్ మళ్లీ హైప్.. ఈసారి ఏమవుతుందో!

2026-11-14 10:44 GMT

అన‌సూయ‌కు అవ‌కాశాలు త‌గ్గిన వేళ‌!

2026-11-14 10:30 GMT

ఆర్సీ 17 కోసం రామ్ చ‌ర‌ణ్ మేకోవ‌ర్!

2026-11-14 09:30 GMT

'దాదా ధమాకా'.. బాలయ్య స్వాగ్ లో నర్గీస్ స్టన్నింగ్ గ్లామర్

2026-11-14 08:42 GMT

హీరోయిన్ల విష‌యంలో సుకుమార్ ఆ రిస్క్ తీసుకోరా?

2026-11-14 08:30 GMT

స్పైడర్-మ్యాన్ ఇమేజ్ దాటేసిన టామ్ హాలండ్!

2026-11-14 07:19 GMT

ప్రెగ్నెన్సీలో క్యూట్ లుక్.. సమంత ధరించిన ఈ ఫ్రాక్ ఖరీదు ఎంతో తెలుసా?

2026-11-14 06:53 GMT

కొత్త జేమ్స్ బాండ్ ఎవరు?

2026-11-14 06:53 GMT

హీరో కూతురుకి హిట్ సీక్వెల్ కలిసి వచ్చేనా?

2026-11-14 06:43 GMT

ఆ సీక్వెల్‌తోనే చిరుకు జాతీయ అవార్డు.. స‌వాల్ స్వీక‌రించే ద‌ర్శ‌కుడు ఎవ‌రు?

2026-11-14 06:43 GMT

Copyright @2026

Powered by Blink CMS