• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఆ సీక్వెల్‌తోనే చిరుకు...

ఆ సీక్వెల్‌తోనే చిరుకు జాతీయ అవార్డు.. స‌వాల్ స్వీక‌రించే ద‌ర్శ‌కుడు ఎవ‌రు?

| మెగాస్టార్ చిరంజీవికి ఇప్పటివరకు జాతీయ ఉత్తమ నటుడు అవార్డు దక్కకపోవడం అభిమానులకు లోటుగానే మిగిలింది. ‘స్వయంకృషి’, ‘ఆపద్బాంధవుడు’ వంటి చిత్రాల్లో ఆయన నటన ప్రశంసలు అందుకుంది. మమ్ముట్టి తరహాలో వైవిధ్యమైన, భావోద్వేగభరిత పాత్రలు ఎంచుకుంటే చిరులోని నటుడికి మరోసారి గుర్తింపు వచ్చే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ‘కాకా’ చిత్రంలో నటిస్తున్న చిరంజీవి.. తదుపరి ప్రయోగాత్మక కథతో ప్రేక్షకుల ముందుకు వస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.

By - Sivaji Kontham
Update: 2026-11-14 06:43 GMT

తెలుగు సినిమా హిస్ట‌రీలో తనదైన నటన- డ్యాన్స్- ఫైట్స్‌తో దశాబ్దాల పాటు తిరుగులేని క‌మ‌ర్షియ‌ల్ హీరోగా వెలుగొందుతున్న మెగాస్టార్ చిరంజీవి ఖాతాలో ఇప్ప‌టివరకు `జాతీయ ఉత్తమ నటుడు` అవార్డు లేకపోవడం మెగా అభిమానులకు ఎప్పటికీ ఒక తీరని లోటే. మలయాళంలో ఆయన సమకాలీన దిగ్గజాలు మమ్ముట్టి, మోహన్ లాల్ వంటి నటులు పలుమార్లు జాతీయ అవార్డులతో సంచలనాలు సృష్టించారు. తెలుగు చిత్రసీమకు దాదాపు ఏడు దశాబ్దాల నిరీక్షణ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ `పుష్ప` చిత్రంతో మొట్టమొదటి జాతీయ ఉత్తమ నటుడు అవార్డును అందించి చరిత్ర సృష్టించారు. కానీ జాతీయ రాజ‌కీయాల కార‌ణంగా మెగాస్టార్ స‌హా ఎంద‌రో తెలుగు స్టార్లు ఆ అవ‌కాశాన్ని కోల్పోయారు. అప్పట్లో `రుద్రవీణ`, `స్వయంకృషి`, `ఆపద్బాంధవుడు` వంటి ఆణిముత్యాల వంటి చిత్రాలతో చిరుకు తృటిలో నేషనల్ అవార్డు మిస్ అయినా.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ గౌరవం దక్కే అవకాశం ఇంకా లేక‌పోలేదు.

ముఖ్యంగా కళాతపస్వి కె. విశ్వనాథ్ దర్శకత్వంలో తెర‌కెక్కిన `ఆపద్బాంధవుడు` చిత్రం చిరు నట విశ్వరూపానికి నిదర్శనం. కమర్షియల్ ఇమేజ్‌ను పూర్తిగా పక్కన పెట్టి ఒక సాధారణ పాలేరు `మాధవ` పాత్రలో చిరు ఒదిగిపోయిన తీరు.. పతాక సన్నివేశాల్లో మతిస్థిమితం కోల్పోయిన వ్యక్తిగా హావభావాలు, అమాయకత్వం భారతీయ సినీ చరిత్రలోనే అత్యుత్తమ నటనలో ఒకటిగా నిలిచిపోయాయి. ఇక చెప్పులు కుట్టుకునే సాంబయ్యగా నటించిన `స్వయంకృషి` చిత్రంలో చిరంజీవి నటనకు గాను ప్రతిష్టాత్మకమైన నంది ఉత్తమ నటుడు పురస్కారంతో పాటు.. ఈ చిత్రం రష్యాలోని మాస్కో అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ప్రదర్శితమై ప్రశంసలు అందుకుంది. అంతటి అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన చిరు.. ఇప్పుడు `ఆపద్బాంధవుడు` సీక్వెల్ తరహాలో బలమైన భావోద్వేగాలు ఉన్న కథలో నటిస్తే... ప్రస్తుతం జాతీయ స్థాయిలో ఉన్న సానుకూల రాజకీయ వాతావరణం.. జ్యూరీ సభ్యుల దృష్టి ఈ సీనియర్ నటుడి అద్భుత ప్రతిభను క‌చ్చితంగా గుర్తించే అవకాశం ఉంది.

అయితే `ఆపద్బాంధవుడు`, `ఛాలెంజ్` వంటి క్లాసిక్ చిత్రాలకు సీక్వెల్స్ చేయడం అంత సులభమైన విషయం కాదు. ఆ సినిమాలకు ప్రాణం పోసిన కళాతపస్వి కె. విశ్వనాథ్ నేడు మన మధ్య లేరు. ఆయన స్థాయిలో మానవీయ విలువలను.. సంగీత సాహిత్యాలను..నటుడిలోని అంతర్గత సంఘర్షణను తెరపై ఆవిష్కరించే దర్శకులు నేటి తరంలో అరుదు. చిరు గతంలో నటించిన క్లాసిక్స్ ఫార్ములాతోనే జాతీయ అవార్డులు దక్కించుకోవడం సాధ్యమవుతుంది కానీ.. ఆయనలోని అసలైన నటుడిని మళ్ళీ ఆ స్థాయిలో వెలికితీసే ధైర్యం, ప్రతిభ ఉన్న దర్శకుడు ఆ ఛాలెంజ్‌ను స్వీకరించాల్సిన అవసరం ఉంది.

రొటీన్ కమర్షియల్ ఐడియాలజీకి కాలం చెల్లిన ఈ రోజుల్లో.. కేవలం బాక్సాఫీస్ లెక్కలు.. మాస్ ఎలివేషన్లకే పరిమితం కాకుండా చిరంజీవి కూడా ప్రయోగాత్మక చిత్రాలకు పచ్చజెండా ఊపాల్సిన సమయం ఆసన్నమైంది. మమ్ముట్టి తరహాలో వయసుకు తగ్గ వైవిధ్యమైన- బలమైన పాత్రలను ఎంచుకోవడానికి మెగాస్టార్ సిద్ధంగానే ఉంటారు. అయితే ఆ స్థాయికి తగ్గ ప్రయోగాత్మక కథలు రాయడానికి నేటి తరం దర్శక రచయితలు కూడా ముందుకు రావాల్సి ఉంటుంది. అప్పుడే అవార్డులు వాటంతట అవే మెగాస్టార్ ని వ‌రించే అవ‌కాశం ఉంది.

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి మాస్ దర్శకుడు బాబీ (కె.ఎస్. రవీంద్ర) దర్శకత్వంలో తెరకెక్కుతున్న `కాకా` (వర్కింగ్ టైటిల్) చిత్రీకరణలో ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం వచ్చే సంక్రాంతి బరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ మాస్ జాతర తర్వాతనైనా చిరంజీవి తనలోని అవార్డ్ విన్నింగ్ నటుడిని బయటకు తీసే ఒక క్లాసిక్ లో న‌టిస్తారా? అన్న‌ది వేచి చూడాలి.

Tags:    
  • chiranjeevi 
  • megastar 
  • nationalfilmawards 
  • tollywood 

Similar News

ప్రెగ్నెన్సీలో క్యూట్ లుక్.. సమంత ధరించిన ఈ ఫ్రాక్ ఖరీదు ఎంతో తెలుసా?

2026-11-14 06:53 GMT

కొత్త జేమ్స్ బాండ్ ఎవరు?

2026-11-14 06:53 GMT

హీరో కూతురుకి హిట్ సీక్వెల్ కలిసి వచ్చేనా?

2026-11-14 06:43 GMT

శేఖర్ కమ్ముల సినిమాల్లో అది ఎలా సాధ్యమవుతుంది...

2026-11-14 06:43 GMT

రామ్ చరణ్, సుకుమార్ మూవీ నేపథ్యం ఇదేనట?

2026-11-14 06:42 GMT

తండ్రి కొడుకు ఒకే నెల అవసరమా?

2026-11-14 06:33 GMT

దిల్ రాజు పై ఎవరికి అంత కోపం?

2026-11-14 06:32 GMT

తెలుగు రైట్స్‌లో టాప్ సినిమాలు.. 'వారణాసి' ఎంత తేవాలి?

2026-11-14 04:20 GMT

'OM' ట్రైలర్.. ధనుష్ అసలు ఎవరి వైపు!

2026-11-14 04:18 GMT

అనార్క‌లీ చీర‌లో దేవ‌తా సుంద‌రిలా మెరిసిపోతున్న బ్యూటీ

2026-11-14 04:17 GMT

మినీ డ్రెస్ లో హీట్ పెంచేసిన బాలయ్య బ్యూటీ!

2026-11-14 04:17 GMT

Copyright @2026

Powered by Blink CMS