• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మినీ డ్రెస్ లో హీట్...

మినీ డ్రెస్ లో హీట్ పెంచేసిన బాలయ్య బ్యూటీ!

| ప్రగ్యా జైస్వాల్ ముంబైలో జరిగిన ఆర్ట్ ముంబై 2026 కార్యక్రమానికి గోల్డ్, బ్లాక్ కలర్ సీక్విన్ మినీ డ్రెస్‌లో హాజరైంది. గోల్డెన్ ఇయర్ రింగ్స్, హైహీల్స్‌తో మెరిసిన ఆమె.. ఫొటోలకు ‘బంగారంతో తడిసిపోతున్నాను’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఈ ఫొటోలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.

By - Madhu Reddy
Update: 2026-11-14 04:17 GMT

చిత్ర సీమలో గ్లామర్ బ్యూటీస్ గా పేరు దక్కించుకుంటున్న సెలబ్రిటీస్ లలో ప్రగ్యా జైస్వాల్ ఎప్పుడూ ముందు వరుసలో ఉంటుంది. అందం, అభినయంతో ఆకట్టుకోవడమే కాకుండా పలు ఫ్యాషన్ దుస్తులతో ఫ్యాషన్ ప్రియులను ఎప్పటికప్పుడు ఆకర్షిస్తూ ఉంటుంది. అలాంటి ఈమె తాజాగా మరో లేటెస్ట్ అవుట్ ఫిట్ తో అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. పైగా ఆ ఫోటోలకు క్యాప్షన్ గా బంగారంతో తడిసిపోతున్నాను అంటూ ఇచ్చిన క్రేజీ క్యాప్షన్ మరింతగా ఆకట్టుకుంది.




నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ప్రేక్షకులను అలరించే ప్రగ్యా జైస్వాల్ భారీ ఫాలోవర్స్ ని కూడా సొంతం చేసుకుంది. 2.8 మిలియన్లకు పైగా ఫాలోవర్లను దక్కించుకున్న ఈమె.. నిత్యం ఏదో ఒక ఫోటోషూట్ తో అలరిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే తాజాగా షేర్ చేసిన ఈ మినీ డ్రెస్ ఈమె అందాన్ని రెట్టింపు చేసిందని చెప్పవచ్చు. తాజాగా ధరించిన దుస్తుల విషయానికి వస్తే ముంబైలో జరిగిన ఆర్ట్ ముంబై 2026 కార్యక్రమానికి ఈ అవుట్ ఫిట్ లో ప్రగ్యా సందడి చేసింది. స్క్వేర్ నెక్ లైన్ కలిగిన గోల్డ్ , బ్లాక్ కలర్ కలయికలో డిజైన్ చేసిన సీక్విన్ మినీ డ్రెస్ ధరించింది.




లుక్ కి తగ్గట్టుగా గోల్డెన్ కలర్ స్టేట్మెంట్ ఇయర్ రింగ్స్, కాక్ టెయిల్ రింగ్ ధరించింది. తన అవుట్ ఫిట్ ను ఫుల్ ఫిల్ చేయడానికి బ్లాక్ కలర్ హై హీల్స్ ధరించి తన మేకోవర్ ను పూర్తిచేసుకుంది . మొత్తానికైతే ఈ మినీ డ్రెస్ లో అందాలు ఆరబోసిన ఈమె గ్లామర్ తో అభిమానులను కట్టిపడేసిందని చెప్పవచ్చు. ఇండస్ట్రీలోకి రాకముందు సింబయాసిస్ విశ్వవిద్యాలయంలో చదువుతున్న రోజుల్లోనే వివిధ రకాల అందాల పోటీలలో పాల్గొని సందడి చేసింది. 2008లో మిస్ ఇండియా పోటీలలో పాల్గొన్న ఈమె మిస్ ఫ్రెష్ ఫేస్, మిస్ డాన్సింగ్ క్వీన్, మిస్ ఫ్రెండ్ ఆఫ్ ఎర్త్ వంటి టైటిల్స్ ను సొంతం చేసుకుంది.




అలాగే డవ్, డాబర్ వాటిక, మిలీనియం హైపర్ మార్కెట్ ఫర్ దుబాయ్, రిలయన్స్ డిజిటల్ వంటి ఎన్నో పాపులర్ బ్రాండ్స్ కి కూడా అంబాసిడర్ గా చేసింది. డేగ అనే చిత్రంతో తొలిసారి తెలుగు, తమిళ్ ప్రేక్షకులను పలకరించింది. ఆ తర్వాత టిట్టూ ఎంబీఏ అనే హిందీ చిత్రంతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈమె తెలుగులో మాత్రం నేరుగా మిర్చి లాంటి కుర్రాడు అనే సినిమాతోనే పరిచయం అయింది. ఆ తర్వాత క్రిష్ దర్శకత్వంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన కంచే సినిమాలో నటించింది. ఇందులో తన అద్భుతమైన పాత్రకు ఈమెకు గద్దర్ అవార్డు కూడా లభించింది.




పలు చిత్రాలలో నటించిన కానీ ఈమెకు మంచి గుర్తింపును అందించింది మాత్రం అఖండ అనే చెప్పాలి. బాలకృష్ణ హీరోగా నటించిన ఈ సినిమా భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. అయితే ఈ సినిమా తర్వాత మళ్లీ ఈమెకు తెలుగులో అవకాశం లభించకపోవడం గమనార్హం.

Tags:    
  • pragyajaiswal 
  • artmumbai2026 
  • goldendress 
  • celebrityfashion 

Similar News

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

బన్నీతో సినిమా.. ఇంకెంత వెయిటింగ్!

2026-11-20 05:07 GMT

రావిపూడి సరే.. మరో డైరెక్టర్ ఎక్కడ వెంకీ?

2026-11-20 04:36 GMT

'కింగ్ 100' లో చైత‌న్య అతిథి పాత్ర‌లో న‌టిస్తున్నారా?

2026-11-20 04:36 GMT

2026లోనూ టాయిలెట్..బాత్రూమ్ గురించి మాట్లాడుకునే దుస్తుతి!

2026-11-20 04:36 GMT

100 కోట్ల హీరో + 100 కోట్ల డైరెక్టర్.. ఈసారి పెద్ద టార్గెట్టే!

2026-11-20 04:16 GMT

Bigg Boss Telugu 10: డిక్టేటర్ల ఈగో వార్తో పోటెత్తిన హౌజ్!

2026-11-20 03:46 GMT

యంగ్ హీరోలతో సుకుమార్.. లిస్టు పెరుగుతూనే ఉందిగా..

2026-11-19 22:30 GMT

Copyright @2026

Powered by Blink CMS