• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అనార్క‌లీ చీర‌లో దేవ‌తా...

అనార్క‌లీ చీర‌లో దేవ‌తా సుంద‌రిలా మెరిసిపోతున్న బ్యూటీ

| శర్వారీ తన తాజా ట్రెడిషనల్ లుక్‌తో ఆకట్టుకుంది. అబు జానీ, సందీప్ ఖోస్లా రూపొందించిన లేత ఆకుపచ్చ అనార్కలీ డ్రెస్‌లో మెరిసింది. ‘యే ప్రేమ్ మోల్ లియా’ ప్రమోషన్స్‌లో భాగంగా ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో’కు హాజరైన ఆమె ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఆమె నటిస్తున్న ఈ సినిమా నవంబర్ 27న విడుదల కానుంది.

By - Sivaji Kontham
Update: 2026-11-14 04:17 GMT

`ఆల్ఫా` లాంటి భారీ యాక్ష‌న్ చిత్రంలో స్టంట్స్ తో అద‌ర‌గొట్టింది శార్వ‌రి. సినిమా ఆద్యంతం ఆలియా పోటీలో ఉన్నా శార్వ‌రి ఐ క్యాచ‌ర్ గా మారింది. ఈ స్పై యాక్ష‌న్ సినిమా త‌న‌కు విజ‌యాన్ని ఇవ్వ‌క‌పోయినా న‌టిగా గుర్తింపు పొందింది. అదే స‌మ‌యంలో `మైన్ వాప‌స్ ఆవుంగా` లాంటి ప్రేమ‌క‌థా చిత్రంతో బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకోవ‌డ‌మే కాకుండా త‌న అద్భుత న‌ట‌న‌తో మ‌న‌సులు కొల్ల‌గొట్టింది. అంత‌కుముందు `ముంజ్యా` లాంటి విజ‌యం త‌న ఖాతాలో ఉంది. ఓవైపు కెరీర్ ప‌రంగా బ్యాక్ టు బ్యాక్ అవ‌కాశాల‌తో ముందుకు సాగుతున్నా.. ఈ బ్యూటీ ఫ్యాష‌న్ ప్ర‌పంచంలోను వేవ్స్ క్రియేట్ చేయ‌డంలో వెన‌కంజ‌లో లేదు.




యంగ్ బ్యూటీ శర్వారీ తన లేటెస్ట్ ట్రెడిషనల్ లుక్‌తో ఫ్యాషన్ ప్రియులను మంత్రముగ్ధులను చేస్తోంది. ప్రముఖ డిజైనర్లు అబు జానీ- సందీప్ ఖోస్లా డిజైన్ చేసిన లేత ఆకుపచ్చ అనార్కలీ డ్రెస్‌లో శర్వారీ రాజసం ఉట్టిపడేలా మెరిసిపోయింది. ప్రాచీన భారతీయ హస్తకళా నైపుణ్యానికి మోడ్ర‌న్ స్టైలింగ్‌ను జోడిస్తూ.. ఈ డ్రెస్ అంతటా అల్లిన బంగారు వ‌ర్ణం ఎంబ్రాయిడరీ.. డీప్ యు -నెక్ డిజైన్ దుస్తుల‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఎలాంటి హంగూ ఆర్భాటం లేని హుందాతనంతో పాటు పండుగ శోభను తలపించే గ్లామర్ కలగలిసిన ఈ అనార్కలీ దుస్తులు.. నేచురల్ మేకప్‌తో శర్వారీ కట్టిపడేస్తోంది.




శార్వ‌రి తాజా చిత్రం `యే ప్రేమ్ మోల్ లియా` ప్రమోషన్స్‌లో భాగంగా.. నెట్‌ఫ్లిక్స్ వేదికగా ప్రసారమయ్యే `ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో`కు అంటెండ‌యిన శార్వరి ఇలా అందంగా క‌నిపించింది. తాజా అవుట్‌ఫిట్ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. భారీ ఆభరణాల జోలికి వెళ్లకుండా.. కేవలం డ్రెస్ డిజైన్ - ఎంబ్రాయిడరీ వర్క్ హైలైట్ అయ్యేలా చేసిన‌ స్టైలింగ్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. శార్వ‌రి దేవ‌తా సుంద‌రిలా మెరిసిపోతోంద‌ని అభిమానులు ప్ర‌శంసిస్తున్నారు.




ఇక కెరీర్ పరంగా చూస్తే శర్వారీ చేతిలో క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ల స్పెషలిస్ట్ సూరజ్ బర్జాత్యా దర్శకత్వంలో ఆయుష్మాన్ ఖురానా సరసన రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా `యే ప్రేమ్ మోల్ లియా` ఈ ఏడాది నవంబర్ 27న థియేటర్లలో విడుదల కానుంది. దీనితో పాటు యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మాణంలో.. అలీ అబ్బాస్ జఫర్ దర్శకత్వంలో అహన్ పాండేతో కలిసి నటిస్తున్న యాక్షన్ రొమాంటిక్ చిత్రం `బెపర్‌వాహ్` 2027 మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags:    
  • sharvari 
  • traditionallook 
  • anarkalidress 
  • celebrityfashion 

Similar News

తెలుగు రైట్స్‌లో టాప్ సినిమాలు.. 'వారణాసి' ఎంత తేవాలి?

2026-11-14 04:20 GMT

'OM' ట్రైలర్.. ధనుష్ అసలు ఎవరి వైపు!

2026-11-14 04:18 GMT

మినీ డ్రెస్ లో హీట్ పెంచేసిన బాలయ్య బ్యూటీ!

2026-11-14 04:17 GMT

ఘట్టమనేని ఫ్యామిలీలో గట్టిగా మోగనున్న పెళ్లి భాజాలు.. స్పెషల్ ఫోటోలు షేర్ చేసిన మంజుల!

2026-11-14 03:52 GMT

విదేశీ టూరిజం స‌రే.. దిల్ రాజుతో ధ‌న‌శ్రీ‌ మూవీ ఏమైనట్టు?

2026-11-14 03:52 GMT

కుటుంబాలు ఎలా ఉండ‌కూడదో చెప్పిన స్టార్ హీరో వైఫ్‌!

2026-11-14 03:40 GMT

Bigg Boss Telugu 10: పదవ వారం ఎలిమినేషన్‌పై ఉత్కంఠ.. డబుల్ ఎలిమినేషన్ గండంలో ఉన్నదెవరు?

2026-11-14 03:39 GMT

Bigg Boss Telugu 10: కుటుంబాల ఎంట్రీ తర్వాత కెప్టెన్సీ టాస్క్ రగడ!

2026-11-14 03:30 GMT

APలో అర‌కు కాఫీ తాగిస్తుంటే, ముంబైలో కెన‌డా కాఫీ దేనికి ర‌కుల్?

2026-11-14 03:21 GMT

ఒకప్పుడు తెలుగులో ప్రయోగాత్మకమైన సినిమాలకు ఆదరణ లేకపోవడానికి కారణమేంటంటే?

2026-11-14 03:20 GMT

ఎన్టీఆర్‌ డ్రాగన్ షూట్‌ ఇంకా ఎంత కాలం..?

2026-11-13 22:30 GMT

Copyright @2026

Powered by Blink CMS