• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'OM' ట్రైలర్.. ధనుష్ అసలు...

'OM' ట్రైలర్.. ధనుష్ అసలు ఎవరి వైపు!

| ధనుష్, మమ్ముట్టి, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటించిన ‘OM’ ట్రైలర్ ఆసక్తి రేపుతోంది. ఏపీ, తమిళనాడు సరిహద్దుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో కథ సాగుతుంది. ఇందులో సాయి పల్లవి టాస్క్‌ఫోర్స్ అధికారిగా, ధనుష్ రహస్య ఆపరేషన్‌లో పాల్గొనే పోలీస్‌గా కనిపిస్తున్నారు. అయితే స్మగ్లింగ్ ముఠాతో ధనుష్ ఎందుకు కలిసి ఉన్నారనే సస్పెన్స్‌ను ట్రైలర్‌లో కొనసాగించారు. సినిమా నవంబర్ 20న విడుదల కానుంది.

By - Tupaki Desk
Update: 2026-11-14 04:18 GMT

ధనుష్ సినిమాల్లో యాక్షన్‌తో పాటు కథలో మంచి ట్విస్టులు కూడా ఉంటాయి. ఇప్పుడు 'OM' ట్రైలర్ కూడా అలాంటి ఆసక్తికరమైన కథతోనే రూపొందినట్లు అనిపిస్తోంది. పైగా ఈసారి మమ్ముట్టి, సాయి పల్లవి లాంటి నటులు తోడవడంతో సినిమా మీద అంచనాలు పెరిగాయి. 'అమరన్' దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి తెరకెక్కించిన ఈ సినిమా ట్రైలర్‌లో ఎర్రచందనం స్మగ్లింగ్, పోలీస్ ఆపరేషన్స్, గ్యాంగ్ వార్స్ లాంటి థ్రిల్లర్ ఎలిమెంట్స్ కనిపిస్తున్నాయి. అయితే ధనుష్ పాత్రను మాత్రం కాస్త సస్పెన్స్‌లో పెట్టారు.

ఆంధ్రప్రదేశ్, తమిళనాడు సరిహద్దుల్లోని రెండు ఆలయ నగరాల మధ్య జరిగే ఎర్రచందనం అక్రమ రవాణా నేపథ్యంలో కథ సాగుతోంది. ఇందులో సాయి పల్లవి ఆంధ్రప్రదేశ్ రెడ్ శాండర్స్ ప్రొటెక్షన్ స్పెషల్ టాస్క్‌ఫోర్స్ అధికారిగా కనిపిస్తున్నారు. తమిళనాడు పోలీస్ విభాగానికి చెందిన ధనుష్, 'ఆపరేషన్ మోల్' OM పేరుతో స్మగ్లింగ్ ముఠాలోకి రహస్యంగా అడుగుపెడతారు. కానీ ఆ తర్వాత జరిగే పరిణామాలతో కథ మరో మలుపు తిరిగినట్లు ట్రైలర్‌లో చూపించారు.

ముఖ్యంగా పోలీసులకు సహాయం చేయాల్సిన ధనుష్, కొన్ని సన్నివేశాల్లో వారితోనే తలపడటం ఆసక్తి కలిగిస్తోంది. అక్రమ రవాణా ముఠాను కాపాడుతున్నట్లుగా కూడా చూపించడంతో, అసలు ధనుష్ ప్లాన్ ఏంటనే సందేహం వచ్చేలా ట్రైలర్‌ను కట్ చేశారు. మరోవైపు ఈ క్రైమ్ నెట్‌వర్క్‌ను నడిపించే రెడ్ హిల్స్ కార్తికేయన్ పాత్రలో మమ్ముట్టి కనిపిస్తున్నారు. ధనుష్, మమ్ముట్టి మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకు హైలెట్ అయ్యేలా ఉన్నాయి.

యాక్షన్‌తో పాటు ఈ కథలో బలమైన ఫ్యామిలీ ఎమోషన్ కూడా ఉన్నట్లు ట్రైలర్ హింట్ ఇస్తోంది. ధనుష్ భార్యగా శ్రీలీల కనిపించగా, కుటుంబ బాధ్యతలు, పోలీస్ డ్యూటీ మధ్య నలిగిపోయే పాత్రలో ధనుష్ వేరియేషన్స్ చూపించారు. ట్రైలర్ చివర్లో అడవి నేపథ్యంలో వచ్చే ఫైట్స్, పోలీస్ ఆపరేషన్స్, భారీ ఛేజింగ్ సన్నివేశాలతో యాక్షన్ డోస్ పెంచారు. సాయి అభ్యంకర్ అందించిన బీజీఎం సన్నివేశాల్లోని ఉత్కంఠను బాగా ఎలివేట్ చేసింది.

మమ్ముట్టి పవర్‌ఫుల్ లుక్‌తో పాటు సాయి పల్లవి పోలీస్ పాత్ర కూడా కొత్తగా కనిపిస్తోంది. సీనియర్ నటుడు నసీరుద్దీన్ షా కూడా ఇందులో ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. వండర్‌బార్ ఫిల్మ్స్, ఆర్ టేక్ స్టూడియోస్ బ్యానర్లపై ధనుష్, అజ్మత్ జగ్మాగ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఎజిల్ అరసు సినిమాటోగ్రఫీ ఫారెస్ట్ విజువల్స్ ను సహజంగా చూపించింది. 'అమరన్'తో మంచి విజయం అందుకున్న రాజ్‌కుమార్ పెరియసామి, ఈసారి పూర్తిగా క్రైమ్, యాక్షన్ కథను ఎంచుకున్నారు. ధనుష్‌ను పోలీస్ ఆఫీసర్‌గా పరిచయం చేస్తూనే ముఠాతో ఎందుకు కలిసి తిరుగుతున్నారనే సస్పెన్స్ ఉంచారు. నవంబర్ 20న విడుదల కానున్న ఈ సినిమాకు ఇప్పటికే డీసెంట్ బజ్ ఉంది. మరి ధనుష్ క్యారెక్టర్ తెరపై ఎలాంటి ట్విస్టులు ఇస్తుందో చూడాలి.


Full View


Tags:    
  • dhanush 
  • ommovie 
  • mammootty 
  • saipallavi 
  • omtrailer 

Similar News

అహంకారమనే ముద్రకు ధనుష్ వినూత్న కౌంటర్!

2026-11-15 09:46 GMT

అర్థరాత్రి పూట భార్య‌కి వార్నింగ్ లు!

2026-11-15 09:45 GMT

రామాయ‌ణ‌: 10రోజుల్లో 1200 కోట్లు.. 2000 కోట్ల క్ల‌బ్ ఇంకెంత దూరం?

2026-11-15 09:42 GMT

పని పోతుందనే భయంతో వేధింపులు సైతం భరించాను!

2026-11-15 09:38 GMT

25 ఏళ్లయినా ఇంకా జీవితాన్ని అర్ధం చేసుకుంటూనే ఉన్నా!

2026-11-15 07:32 GMT

త్రివిక్రమ్ గారు మీరు అలాంటి సినిమాలే తీయండి సార్...

2026-11-15 07:32 GMT

లగ్జరీ కంటే ప్రశాంతతే ముఖ్యం..ఎందుకో చెప్పిన సీత‌మ్మ‌

2026-11-15 06:52 GMT

బాలయ్యకు డిసెంబర్ సెంటిమెంట్.. ట్రాక్ రికార్డ్ ఎలా ఉందంటే..

2026-11-15 06:31 GMT

మెగా హీరో సినిమాలో ఛాన్స్.. బండి సరోజ్ ఎందుకు వద్దన్నారంటే!

2026-11-15 06:19 GMT

నిర్మాత కష్టాలతోనే సినిమా.. పేర్లు కూడా బయటపెడతానంటూ..

2026-11-15 05:28 GMT

భర్తతో ప్రేమ.. ఆ తర్వాత వేరే వాళ్లతో డేటింగ్.. కాజల్ లవ్ స్టోరీ ఇదే..!

2026-11-15 03:34 GMT

జూనియ‌ర్ అతిలోక సుంద‌రి అలా ఫెయిలైంది!

2026-11-15 02:30 GMT

Copyright @2026

Powered by Blink CMS