APలో అరకు కాఫీ తాగిస్తుంటే, ముంబైలో కెనడా కాఫీ దేనికి రకుల్?
| అరకు కాఫీని ప్రపంచవ్యాప్తంగా ప్రోత్సహించేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్న వేళ.. నటి రకుల్ ప్రీత్ సింగ్ భర్త జాకీ భగ్నానీతో కలిసి కెనడియన్ కాఫీ బ్రాండ్ బ్లెంజ్ను భారత్లో విస్తరించేందుకు సిద్ధమయ్యారు. ముంబైలో తొలి ఔట్లెట్ ప్రారంభించగా, హైదరాబాద్ సహా పలు నగరాల్లో మొత్తం 50 ఔట్లెట్లు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ నిర్ణయంపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఏపీలో అరకు కాఫీని బ్రాండింగ్ చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా అరకు కాఫీని ఎగుమతి చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. విశాఖలో జరుగుతున్న `సీఐఐ సమ్మిట్ 2026` వేదికగా అరకు కాఫీని రుచి చూసిన విదేశీ మంత్రులు, పారిశ్రామిక వేత్తలు సైతం మన కాఫీ రుచిని ఆస్వాధించి ప్రశంసించారు.
అయితే ఇలాంటి సమయంలో తెలుగు హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కెనడియన్ కాఫీని దిగుమతి చేసేందుకు ప్రయత్నిస్తోంది. భర్తతో కలిసి ముంబైలో తొలి కాఫీ షాప్ ని ప్రారంభించింది. ప్రముఖ కెనడియన్ స్పెషాలిటీ కాఫీ చైన్ `బ్లెంజ్`ను ముంబై సహా హైదరాబాద్ సహా ఇతర మెట్రోలలో, ద్వితీయ శ్రేణి నగరాల్లోను విస్తరించనున్నారట.
కాజల్ అగర్వాల్ లాంటి కథానాయిక అరకులో పేద గిరిజనులకు ఉచిత విద్యను అందించేందుకు కృషి చేస్తుంటే, రకుల్ ప్రీత్ అందుకు భిన్నంగా అరకు కాఫీకి పోటీ పెడుతోంది. ఇక్కడా ద్వితీయ శ్రేణి నగరాల్లో కెనడియన్ బ్రాండ్ ని ప్రమోట్ చేసేందుకు సిద్ధమవుతుండటంపై నెటిజనుల్లో రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి.
నిజానికి ఔట్ లెట్స్ - ఫ్రాంఛైజీ బిజినెస్ పేరుతో లైవ్ టీ, కాఫీలు తాగే అదృష్టం ప్రజలకు కరువడింది. ఫ్లాస్కులోంచి పోసే సువాసనలే లేని ఉత్త టీ, కాఫీలు తాగి విసిగిపోతున్నారు. జేబులు గుల్ల చేయడమే కాకుండా మంచి కాఫీ, టీ తాగామనే భావనను కూడా ప్రజలు కోల్పోతున్నారు. ఇలాంటి ఔట్ లెట్ల సంస్కృతితో ఎలాంటి ప్రయోజనం లేదని పెదవి విరిచేస్తున్నారు. టీటైమ్ పేరుతో నాశిరకం కల్తీ టీలు, కాఫీలు అమ్మేవాళ్లున్నారు. అలాంటి విష సంస్కృతి ఇప్పుడు ఫ్రాంచైజీ బిజినెస్ లో ఉంది. అందుకే ఇలాంటి వాటిని ప్రజలు ప్రోత్సహించడం లేదు.
స్థానికంగా అరకు కాఫీ, అస్సాం కాఫీ సహా పలు భారతీయ బ్రాండ్లకు మంచి ఇమేజ్ ఉంది. వాటన్నిటికీ భిన్నంగా విదేశీ కాఫీ దిగుమతి సరైనదేనా? సాధ్యమైనంత తొందర్లోనే దేశవ్యాప్తంగా 50 ఔట్ లెట్లను ప్రారంభించాలనుకుంటున్న రకుల్- జాకీ భగ్నానీ జంట లాభదాయకమైన వ్యాపారం కోసం ప్రయత్నిస్తోంది. ఇది ప్రజాదరణ దక్కించుకుని.. ఏ మేరకు విజయవంతంగా సాగుతుందో వేచి చూడాలి.