• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఎన్టీఆర్‌ డ్రాగన్ షూట్‌...

ఎన్టీఆర్‌ డ్రాగన్ షూట్‌ ఇంకా ఎంత కాలం..?

| ఎన్టీఆర్‌, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘డ్రాగన్’ షూటింగ్‌ను డిసెంబర్‌లోగా పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ప్యాచ్‌వర్క్ జనవరి లేదా ఫిబ్రవరిలో ముగించి, 2027 జూన్‌లో సినిమాను విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో ఎన్టీఆర్‌-త్రివిక్రమ్‌ సినిమా వచ్చే ఏడాది మార్చిలో ప్రారంభమయ్యే అవకాశముంది.

By - Ramesh Palla
Update: 2026-11-13 22:30 GMT

ఎన్టీఆర్‌ అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్న డ్రాగన్‌ మూవీని కచ్చితంగా వచ్చే ఏడాది సమ్మర్‌ చివర్లో విడుదల చేస్తామని ఇటీవల మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత రవి శంకర్‌ ఒక ఇంటర్వ్యూలో చెప్పిన విషయం తెల్సిందే. ప్రశాంత్‌ నీల్ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉన్నా పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ముఖ్యంగా ఎన్టీఆర్‌ చేతికి శస్త్ర చికిత్స కారణంగా కొన్ని నెలల పాటు షూటింగ్‌ ఆగి పోయింది. ఆ కారణంగానే సినిమా ఆలస్యం అయిందని, ఇతర కారణాలు ఏమీ లేవని, ఎన్టీఆర్‌ పూర్తి ఆరోగ్యంతో షూటింగ్‌కు జాయిన్‌ కావడంతో జెట్‌ స్పీడ్‌తో సినిమాను పూర్తి చేసి కచ్చితంగా 2027 జూన్‌ లో విడుదల చేసి తీరుతామని నిర్మాతలు బల్ల గుద్ది మరీ చెబుతున్నారు. ఇదే విషయాన్ని ఓటీటీ సంస్థలతోనూ నిర్మాతలు చెప్పి డీల్‌ కుదుర్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారట.

ఎన్టీఆర్‌, ప్రశాంత్‌ నీల్‌ కాంబో మూవీ...

ఇటీవలే ప్రశాంత్‌ నీల్‌ సైతం డ్రాగన్‌ సినిమాను డిసెంబర్‌ లేదా జనవరిలో షూట్‌ పూర్తి చేస్తానంటూ నిర్మాతలకు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్‌ ఇటీవల కొత్త సినిమాకు సంబంధించిన ఏర్పాట్లు చేసుకోవాలంటూ త్రివిక్రమ్‌కు సూచనలు చేశాడట. అన్ని అనుకున్నట్లుగా జరిగితే వచ్చే ఏడాది మార్చిలోనే ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌ కాంబో మూవీ పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అంటే అప్పటి వరకు డ్రాగన్‌ సినిమా పూర్తి చేయాలని ఎన్టీఆర్‌ సైతం ప్రశాంత్‌ నీల్‌ కి డెడ్‌ లైన్‌ పెట్టాడని యూనిట్‌ సభ్యుల ద్వారా తెలుస్తోంది. అందుకే హైదరాబాద్‌ లో 25 రోజులు అనుకున్న షూటింగ్‌ను దాదాపుగా 40 రోజులు చేయాలని, అక్కడే కీలక సన్నివేశాలు పూర్తి చేయాలని ప్రశాంత్‌ నీల్‌ భావిస్తున్నాడట. షూటింగ్‌ కోసం భారీ సెట్స్ నిర్మాణం ఒక వైపు జరుగుతూనే ఉన్నట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. మొత్తానికి డ్రాగన్‌ మూవీ చకచక షూట్‌ జరుపుకుంటోంది.

డ్రాగన్ విడుదల తేదీ క్లారిటీ...

నిర్మాత ఇటీవల ఒక ఇంటర్వ్యూలో అన్నట్లుగా డిసెంబర్‌ వరకు షూటింగ్‌ పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయి. ప్యాచ్ వర్క్‌ ఏమైనా ఉంటే జనవరి లేదా ఫిబ్రవరి వరకు పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయి. సాధారణంగా ప్రశాంత్‌ నీల్‌ మూవీ అనుకున్న సమయంకు పూర్తి కాదనే ఆరోపణ ఉంది. కానీ ఇప్పటికే చాలా ఆలస్యం అయిన కారణంగా తప్పని పరిస్థితుల్లో డ్రాగన్‌ సినిమాను స్పీడ్‌గా ప్రశాంత్‌ నీల్‌ పూర్తి చేసేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆయన అసోషియేట్స్ అంటున్నారు. ఇదే కనుక నిజం అయితే సినిమాను ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ కోసం 2027 జూన్‌ లో విడుదల చేయడం కన్ఫర్మ్‌. ఎన్టీఆర్‌, ప్రశాంత్‌ నీల్‌ కాంబో మూవీ కోసం కేవలం తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాకుండా పాన్‌ ఇండియా ప్రేక్షకులు సైతం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కేజీఎఫ్‌, సలార్‌ సినిమాల తర్వాత ప్రశాంత్‌ నీల్‌ మూవీ ఇదే కావడంతో అంచనాలు పీక్స్ లో ఉన్నాయి.

ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌ కాంబో మూవీ...

ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో డ్రాగన్‌ సినిమా ప్రకటించినప్పటి నుంచి ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ వెయ్యి కోట్ల బాక్సాఫీస్‌ నెంబర్‌ పై దృష్టి పెట్టారు. ఎన్టీఆర్‌ ఈ సినిమాతో రూ.వెయ్యి కోట్లకు పైగా వసూళ్లను సాధిస్తాడు అనే విశ్వాసం ను వ్యక్తం చేస్తున్నారు. డ్రాగన్‌ సినిమా భారీ వసూళ్లు సాధిస్తేనే ఎన్టీఆర్‌ తో త్రివిక్రమ్‌ చేయబోతున్న సినిమాకు సంబంధించిన బజ్‌ పెరిగే అవకాశం ఉంది. దాంతో భారీ గా ఖర్చు పెట్టేందుకు స్కోప్‌ ఉంటుంది. ఎన్టీఆర్‌ డ్రాగన్‌ సినిమా విడుదల అయ్యే సమయంకు త్రివిక్రమ్‌ దర్శకత్వంలో చేయబోతున్న సినిమాకు సంబంధించిన ఒక షెడ్యూల్‌ షూట్‌ ముగించే విధంగా ప్లాన్‌ చేస్తున్నారట. మరి త్రివిక్రమ్‌ ప్లాన్‌ ఏ మేరకు వర్కౌట్‌ అయ్యేనో చూడాలి. వరుస ఫెయిల్యూర్స్ తో ఇబ్బంది పడుతున్న ఎన్టీఆర్‌ కి డ్రాగన్‌ సినిమా ఫుల్‌ బూస్ట్‌ ఇస్తుందని ఫ్యాన్స్‌ బలంగా నమ్ముతున్నారు. అందుకే ఇంకా ఎప్పుడు షూట్‌ పూర్తి అవుతుంది... ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Tags:    
  • jrntr 
  • dragonmovie 
  • prashanthneel 
  • trivikram 

Similar News

'రామాయణ 2' రీ షూట్‌ వార్తల్లో నిజం ఎంత?

2026-11-13 19:30 GMT

వివాహం అనంత‌రం ఇద్ద‌రు ఒకేలా!

2026-11-13 18:30 GMT

మోక్షజ్ఞ మొదటి సినిమాకు ఇన్ని అడ్డంకులు ఏంటో పాపం..!

2026-11-13 17:30 GMT

O.Mగా టైటిల్ మార్పు.. ధ‌నుష్ ఇవ్వ‌బోతున్న స‌ర్‌ప్రైజ్ అదే!

2026-11-13 16:37 GMT

పూర్తి గుండుతో అందాల క‌థానాయిక ప్ర‌యోగం!

2026-11-13 16:37 GMT

హను రాఘవపూడి డైరెక్షన్ లో నాని ఆ సినిమా చేయాల్సిందా?

2026-11-13 16:30 GMT

షాకింగ్‌: 2 కోట్ల బ‌డ్జెట్ సినిమాకి 63 కోట్ల శాటిలైట్ ధ‌ర‌?

2026-11-13 15:30 GMT

ఆ డైరెక్టర్ కి ఒక్క కమర్షియల్ హిట్ ఉంటే సుకుమార్ కి పోటీ ఇచ్చేవాడా?

2026-11-13 14:30 GMT

'OG 2' కంటే ముందే పవన్ సినిమా.. ఆ ప్లాన్ సెట్టయ్యేనా?

2026-11-13 14:00 GMT

భార్యపై పెరిగే ప్రేమకు ట్యూన్ కడితే.. నితిన్ 'పిచ్చి ప్రేమలో'!

2026-11-13 13:51 GMT

'ఫ్యామిలీ స్టార్' దెబ్బ.. విజయ్‌తో దిల్ రాజు ఈసారి మరోలా!

2026-11-13 13:49 GMT

Copyright @2026

Powered by Blink CMS