వివాహం అనంతరం ఇద్దరు ఒకేలా!
| పెళ్లి తర్వాత కూడా శోభిత ధూళిపాళ, అదితి రావు హైదరీ సినిమాలతో బిజీగా ఉంటున్నారు. కథాబలమున్న సినిమాలు, వెబ్ సిరీస్‌లకే ప్రాధాన్యత ఇస్తూ కెరీర్‌ను కొనసాగిస్తున్నారు. శోభిత ‘చీకట్లో’, ‘వెంట్టువం’లో నటిస్తుండగా.. అదితి ‘లస్ట్ స్టోరీస్ 3’తో పాటు బాలీవుడ్, హాలీవుడ్ చిత్రాల్లో అవకాశాలు అందుకుంటున్నారు. వ్యక్తిగత జీవితం, కెరీర్‌ను ఇద్దరూ సమతూకంతో ముందుకు తీసుకెళ్తున్నారు.
వివాహం అనంతరం హీరోయిన్లు ఎంత యాక్టివ్ గా సినిమాలు చేస్తున్నారో? చెప్పాల్సిన పనిలేదు. ఇంకా చెప్పాలంటే పెళ్లి తర్వాత అవకాశాలు అంతకంతకు పెరుగుతున్నాయి. ఆ క్రేజ్ ను భామలు తెలివిగా వినియోగిం చుకుంటున్నారు. కాజల్ అగర్వాల్, కీర్తి సురేష్, సమంతలు పెళ్లి తర్వాత ఎలా దూసుకుపోతున్నారో? కళ్ల ముందు కనిపిస్తూనే ఉంది. వీళ్లంతా స్పీడ్ కాకపోయినా? తెలుగు మూలాలున్న అందాల భామలు శోభిత ధూళిపాళ, అదితి రావు హైదరీ సరికొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నారు.
పెళ్లయిన తర్వాత వ్యక్తిగత జీవితాన్ని ఆస్వాదిస్తూనే మరోవైపు సినిమాల ఎంపికలోనూ ఇద్దరూ ఒకే రకమైన పరిణతితో.. పక్కా బ్యాలెన్స్‌తో దూసుకుపోతున్నారు. 2024 సెప్టెంబర్‌లో హీరో సిద్ధార్థ్‌ను అదితి రావు హైదరీ వివాహం చేసుకోగా.. అదే ఏడాది డిసెంబర్లో అక్కినేని నాగ చైతన్యతో శోభిత ధూలిపాళ ఏడడుగులు వేసిన సంగతి తెలిసిందే. ఇద్దరూ స్టార్ హీరోల కుటుంబాలకు కోడళ్లుగా అడుగుపెట్టినా? తమ వ్యక్తిగత గుర్తింపును..నటన పట్ల అభిరుచిని ఏమాత్రం తగ్గించుకోలేదు.
పెళ్లి తర్వాత కూడా కెరీర్ గ్రాఫ్‌ను ఎలా ముందుకు తీసుకెళ్లాలో పక్కా ప్రణాళికతో అడుగులు వేస్తున్నారు. ఇద్దరి కెరీర్ ఎంపికలను గమనిస్తే కొన్ని సారూప్యతలు కనిపిస్తాయి. గ్లామర్ పాత్రల వెంట పడకుండా కథలో బలమున్న కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు.. వెబ్ సిరీస్‌లకే తొలి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఒకవైపు భర్తలతో కలిసి వెకేషన్లు.. ఫ్యామిలీ ఈవెంట్లకు సమయం కేటాయిస్తూనే.. మరోవైపు నచ్చిన స్క్రిప్టులకు మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇస్తూ క్వాలిటీ వర్క్‌పై దృష్టి పెడుతున్నారు.
శోభిత ధూలిపాళ పాన్ ఇండియా సినిమాలు. అంతర్జాతీయ ప్రాజెక్టులు.. ప్రయోగాత్మక వెబ్ సిరీస్‌లతో తనదైన ముద్ర వేస్తుండగా... అదితి రావు హైదరీ హిందీ, తమిళ, తెలుగు భాషల్లో విభిన్నమైన పాత్రలతో బిజీగా గడు పుతున్నారు. సంఖ్య కంటే నాణ్యత ముఖ్యమనే సూత్రాన్ని ఇద్దరు తూచా తప్పక పాటిస్తున్నారు. పెళ్లి తర్వాత ఇద్దరి క్రేజ్ మరింత పెరిగిందన్నది కాదనలేని నిజం. ఈ ఏడాది శోభిత ఏడాది ఆరంభంలో `చీకట్లో` అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రస్తుతం తమిళ్ లో `వెంట్టువం`లో నటిస్తోంది. అదితిరావు మాత్రం `లస్ట్ స్టోరీస్ 3` తో హల్చల్ చేసింది. ప్రస్తుతం ఓ బాలీవుడ్ చిత్రం..మరో హాలీవుడ్ చిత్రంలోనూ నటిస్తోంది.