ఒకప్పుడు తెలుగులో ప్రయోగాత్మకమైన సినిమాలకు ఆదరణ లేకపోవడానికి కారణమేంటంటే?
| తెలుగు హీరోల మాస్ ఇమేజ్ కారణంగా వారు చేసిన ప్రయోగాత్మక సినిమాలకు ఆశించిన ఆదరణ దక్కేది కాదని విశ్లేషణ. హీరో పాత్రను కాకుండా ఆయనకున్న ఇమేజ్‌తో ప్రేక్షకులు పోల్చి చూసేవారు. ఇతర భాషల డబ్బింగ్ సినిమాల్లో హీరోలపై అలాంటి అంచనాలు లేకపోవడంతో పాత్రలకే కనెక్ట్ అయ్యేవారు. అందుకే కమల్ హాసన్ ‘స్వాతిముత్యం’ హిట్ కాగా, చిరంజీవి ‘ఆపద్బాంధవుడు’ ఆశించిన విజయం సాధించలేదు.
ఒకప్పుడు తెలుగు చలన చిత్ర పరిశ్రమలో కమర్షియల్ సినిమాలకు ఎక్కువ ఆదరణ ఉండేది. సినిమా అంటే 6 పాటలు, 5 ఫైట్లు, 4 కామెడీ సన్నివేశాలు ఉండేవి. అవి ప్రేక్షకులకు విపరీతంగా నచ్చేవి. దాంతో అప్పుడప్పుడు మన హీరోలు ప్రయోగాలు చేసిన పెద్దగా సక్సెస్ లను సాధించేవి కాదు. కానీ ఇతర భాషల హీరోలు చేసిన వైవిధ్యభరితమైన సినిమాలకు తెలుగులో మంచి ఆదరణ దక్కేది. అలా ఎందుకు జరిగేది? ప్రేక్షకులకు డిఫరెంట్ మూవీస్ నచ్చకపోతే ఎవ్వరీ సినిమాలు చేసిన అవి చూడకూడదు. కానీ ఇతర భాషల హీరోల మూవీస్ ఎందుకు చూశారు. మన సినిమాలను ఎందుకు రిజెక్ట్ చేశారనే కారణాలను మనం తెలుసుకుందాం...
ప్రయోగాత్మకమైన సినిమాలు నచ్చావా...
మన హీరోలు చేసిన సినిమాలు కమర్షియల్ ఎలిమెంట్స్ తో రావడం, హీరో ఒకసారి కత్తి ఎత్తితే దాదాపు పది మంది నుంచి 20 మంది ని చంపేవాడు. దానివల్ల హీరో లో తెగింపు, ఎవ్వరికి తగ్గని తనం, తొడ కొట్టి నిలబడే తత్వం అందరికీ నచ్చేది. హీరో అంటే ఇలానే ఉంటాడు, తను అనుకున్నది చేసి తీరుతాడు. అంతే తప్ప ఎవరి దగ్గర తల వచ్చాడనే రీతిలో ప్రేక్షకుల మైండ్ లో హీరో అంటే ఎలా ఉండాలో ఒక స్టాండర్డ్ ను సెట్ చేసి పెట్టారు. దాని వల్ల హీరో ఆర్ట్ సినిమాలు చేస్తే ప్రేక్షకుడికి నచ్చేవి కాదు. హీరో వేరేవాళ్ళ దగ్గర చేతులు కట్టుకొని ఉండటం, అన్ని విషయాల్లో తగ్గుతూ ఒక బలహీనుడిలా కనిపించే సరికి అవి మన ప్రేక్షకులకు నచ్చేవి కాదు. ఆ సినిమాలో హీరో వేసిన క్యారెక్టర్ ను కాకుండా నిజ జీవితం లో హీరో కి ఉండే ఇమేజ్ ను పోల్చి చూసుకునేవారు. దాంతో ఆడియన్స్ కి ఆ సినిమాలు పెద్దగా కనెక్ట్ అయ్యేవి కాదు.
ఇతర భాషల సినిమాలు నచ్చడానికి కారణం...
ఇతర భాషలో రిలీజై తెలుగులో డబ్ అయిన సినిమాల్లో హీరో ఎవ్వరో మనకు తెలియదు. ఒకవేళ తెలిసిన వాళ్ళకి మన హీరోలకు ఉన్న మాస్ ఇమేజ్ ఉండేది కాదు. కాబట్టి వాళ్ల మీద ప్రేక్షకులకు ఎలాంటి అంచనాలు ఉండవు. కాబట్టి సినిమా చూసే ప్రేక్షకుడికి క్యారెక్టర్ మాత్రమే కనిపించేది. నిజ జీవితపు ఇమేజ్ తెలిసేది కాదు కాబట్టి ఆ సినిమాలను మన ప్రేక్షకులు ఆదరించేవారు... అందుకే కె విశ్వనాథ్ డైరెక్షన్ లో కమల్ హాసన్ చేసిన 'స్వాతి ముత్యం' మూవీ సూపర్ హిట్ అయింది. చిరంజీవి చేసిన 'ఆపద్బాంధవుడు' మాత్రం అనుకున్న రీతిలో సక్సెస్ సాధించలేదు. దీనికి చిరంజీవి మాస్ ఇమేజ్ కారణమని చెప్పొచ్చు.