శేఖర్ కమ్ముల సినిమాల్లో అది ఎలా సాధ్యమవుతుంది...
| శేఖర్ కమ్ముల సినిమాల్లో సాధారణ కమర్షియల్ చిత్రాల తరహాలో బలమైన విలన్లు కనిపించరు. హీరోహీరోయిన్ల మధ్య వచ్చే ఈగోలు, అపార్థాలు, చిన్నపాటి మనస్పర్థలనే కథకు ప్రధాన సంఘర్షణగా మలుస్తారు. ‘ఫిదా’లో వరుణ్, భానుమతి మధ్య అపార్థాన్ని సెకండాఫ్‌కు కీలక మలుపుగా ఉపయోగించారు. ప్రేమ, భావోద్వేగాలు, కుటుంబ బంధాలను సహజంగా చూపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకోవడమే శేఖర్ కమ్ముల సినిమాల ప్రత్యేకత.
సినిమా అంటే హీరో హీరోయిన్ తో పాటు కండలు తిరిగిన విలన్ ఉండాలి. ప్రతినాయకుడు హీరో ను ఇబ్బంది పెడుతుంటే మన కథానాయకుడు వాటన్నింటిని తట్టుకొని ఎలా నిలబడ్డాడు. ఫైనల్ గా విలన్ ను ఎలా అంతం చేశాడనేది చాలా సినిమాల్లో కనిపించే రొటీన్ టెంప్లేట్... కానీ కొంతమంది దర్శకుల సినిమాలు భిన్నంగా ఉంటాయి. అందులో శేఖర్ కమ్ముల ఒకరు. ఆయన సినిమాల్లో ఏం ఉంటుంది? ఆయన ఎందుకంత స్పెషల్ అనేది తెలుసుకుందాం...
శేఖర్ కమ్ముల మూవీలో విలన్ ఎవరు?
తీసినవి తక్కువ సినిమాలే అయిన చాలా ఎక్కువ రోజులు గుర్తుండిపోయే సినిమాలను తీసిన దర్శకుడు శేఖర్ కమ్ముల... ప్రేక్షకుడి ఆలోచన ధోరణికి తగ్గట్టుగా సెన్సిటివ్ ఇన్సిడెంట్స్ తో కథను రాసుకొని మూవీస్ చేసి సక్సెస్ లను సాధిస్తాడు. ఆయన సినిమాల్లో విలన్ కనిపించడు. హీరో హీరోయిన్స్ మధ్య వచ్చే చిన్నపాటి గొడవలే సినిమాను నడిపిస్తాయి. ఈగో ప్రాబ్లం, మిస్ అండర్ స్టాండింగ్ వల్ల కాన్ఫ్లిక్ట్ ను క్రియేట్ చేసి ప్రేక్షకుడికి ఎక్కడ బోర్ కొట్టకుండా సినిమా ను నడిపించడంలో శేఖర్ కమ్ముల సిద్ధహస్తుడు. ఆయన సినిమాలో పరిస్థితి కి తగిన విలన్స్ మాత్రమే ఉంటారు. అంటే హీరోయిన్ కి ఎవరైనా సైట్ కొడితే హీరో వాళ్ళను కొట్టడం వాళ్ళు అప్పుడే మారిపోవడం లాంటి విలన్స్ కనిపిస్తారు. కానీ సినిమా మొత్తం ట్రావెల్ అవుతూ హీరో మీద కక్ష్య తీర్చుకోవాలనే విలన్స్ ఆయన సినిమాల్లో చాలా తక్కువగా కనిపిస్తారు. ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు యూత్ లో కూడా శేఖర్ కమ్ముల సినిమాకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
ఎమోషన్స్ ను బ్యాలెన్స్ చేయడం...
ఇద్దరు ప్రేమికుల మధ్య ఉండే ఎమోషనల్ సన్నివేశాలను చాలా బ్యాలెన్స్డ్ గా తెరకెక్కిస్తుంటారు. ఇద్దరి ఆలోచన విధానం ఒక్కటే అయినప్పటికీ ఎమోషన్ ను పూర్తిస్థాయిలో బ్యాలెన్స్ చేయడానికి ఆయన క్యారెక్టర్ సస్పెన్స్ ను వాడుతారు. అంటే సినిమాలో ఏదో ఒక సన్నివేశం జరిగి ఉంటుంది. దానిని హీరో లేదా హీరోయిన్ తప్పుగా అర్థం చేసుకుంటారు. దాంతో వాళ్ళ రిలేషన్ మధ్య తేడాలు వస్తాయి. ఉదాహరణకి 'ఫిదా' సినిమాలో వరుణ్ (వరుణ్ తేజ్) భానుమతి(సాయి పల్లవి)ని ఇష్టపడతాడు. అలాగే భానుమతి కూడా వరుణ్ ను ప్రేమిస్తుంది. భాను మాత్రం వాళ్ల అక్క పెళ్లి అయిపోయాక తన ప్రేమను వరుణ్ కి చెప్పాలనుకుంటుంది. వరుణ్ మాత్రం తన మరదలు డిప్రెషన్ లో ఉందని ఫ్యూచర్ మీద నిస్సహాయతను వ్యక్తం చేస్తుందని తను ఫారాన్ వెళ్ళడానికి భయపడుతుంటే తనకి ధైర్యం చెప్పడానికి విలేజ్ లో ఏముంది? ఫారాన్ లో ఉండటమే బెటర్ అని చెబుతుంటే భానుమతి వింటుంది. అలాగే వరుణ్ తన మరదలు ఇద్దరు ప్రేమించుకుంటున్నారు, తొందర్లోనే పెళ్లి చేసుకోబోతున్నారనే మాట తనకి వినిపిస్తుంది. నిజానికి భాను కి వాళ్ళ నాన్న ను విడిచి పెట్టి పెళ్లి చేసుకొని దూరం వెళ్ళడం ఇష్టం లేదు. వరుణ్ కి తన ప్రేమ విషయం చెప్పి తనను పెళ్లి చేసుకొని ఇల్లరికం వచ్చి ఇక్కడే ఉండమని అడగాలనుకుంటుంది. కానీ వరుణ్ నోటి నుంచి పల్లెటూరులో ఏముంటుంది? అనే మాట వినేసరికి భాను కి తన మీద ప్రేమ చచ్చిపోతుంది. అందుకే వరుణ్ ను దూరం పెడుతుంది.
సినిమా చూసే ప్రేక్షకుడికి వరుణ్ భానుమతిని ఎంతలా ప్రేమిస్తున్నాడు? తను మాట్లాడకపోతే ఇబ్బంది పడుతున్నాడనే విషయాన్ని చెప్పేసి భానుమతి క్యారెక్టర్ కి మాత్రమే వరుణ్ ను మిస్ అండర్ స్టాండింగ్ చేసుకున్నట్టుగా ఆమెకి ఏమి తెలియనట్టుగా క్యారెక్టర్ సస్పెన్స్ పెట్టారు. ఈ ఒక్క చిన్న ఎమోషన్ తో సెకండాఫ్ మొత్తం నడిపించాడు. ఇలా శేఖర్ కమ్ముల మూవీలో సాధ్యమైనంతవరకు మనకు విలన్స్ కనిపించరు. బంధాలు, అనుబంధాలను హైలెట్ చేస్తూ, ఈగో లతో సంఘర్షణ ను క్రియేట్ చేస్తాడు. అందుకే అందరి సినిమాల్లోకి శేఖర్ కమ్ముల సినిమాలు ప్రత్యేకంగా నిలుస్తుంటాయి...