దిల్ రాజు పై ఎవరికి అంత కోపం?
| టాక్సిక్ సినిమా విడుదల సమయంలో తనపై సోషల్ మీడియాలో జరిగిన నెగిటివ్ ప్రచారం వెనుక పెయిడ్ క్యాంపెయిన్ ఉందని నిర్మాత దిల్ రాజు ఆరోపించారు. డబ్బులు ఇచ్చి కొందరు కావాలనే తనపై తప్పుడు ప్రచారం చేయించారని తాజాగా మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. టాక్సిక్ కోసం తెలుగు సినిమాను థియేటర్ల నుంచి తొలగించారంటూ గతంలో ఆయనపై విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
టాలీవుడ్ దిగ్గజ నిర్మాతల్లో దిల్ రాజు ఒకరు. ఈయన గతంతో పోల్చితే సినిమాల నిర్మాణం తగ్గించారు అనేది కొందరి అభిప్రాయం. సినిమాల పంపిణీ, నిర్మాణం విషయంలో దిల్ రాజు మునుపటి ఉత్సాహంను కనబర్చడం లేదు అంటూ సోషల్ మీడియాలో ఒక వర్గం వారు అంటున్నారు. అయితే దిల్ రాజు మాత్రం మంచి సినిమాలకు తనవంతు సహకారం అన్నట్లుగా పంపిణీ చేస్తున్నాను అని, అలాగే సినిమాల నిర్మాణం కూడా కంటిన్యూగా జరుగుతుందని చెప్పుకొచ్చాడు. తాజాగా తన బ్యానర్ నుంచి రిలీజ్ చేసిన రామాయణ పార్ట్ 1, సీన్ సినిమాలు సూపర్ హిట్ టాక్ దక్కించుకుని, భారీ వసూళ్లు రాబడుతున్న నేపథ్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి తన సంతోషాన్ని షేర్ చేసుకున్నాడు. ఆ సమయంలోనే టాక్సిక్ సమయంలో తనపై జరిగిన ట్రోల్స్ గురించి దిల్ రాజు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
యశ్ టాక్సిక్ సినిమా సమయంలో...
యశ్ హీరోగా నటించిన టాక్సిక్ సినిమాను తెలుగులో దిల్ రాజు విడుదల చేయడం జరిగింది. ఆ సమయంలోనే ఒక పెద్ద హీరో తెలుగు సినిమా సైతం విడుదల అయింది. ఆ సినిమా బాగా ఆడుతున్న సమయంలో థియేటర్ల నుంచి తొలగించి టాక్సిక్ సినిమాను వేశారు అంటూ దిల్ రాజు పై తీవ్ర స్థాయిలో కొందరు విమర్శలు చేశారు. తెలుగు సినిమాను తొలగించి, డబ్బింగ్ మూవీని ఎలా వేస్తారంటూ దిల్ రాజును సోషల్ మీడియాలో కొందరు ప్రశ్నించారు. ఆ సమయంలో దిల్ రాజు మౌనంగా ఉన్నారు. ఆ తెలుగు సినిమాకు అన్యాయం చేసే ఉద్దేశం దిల్ రాజుకు లేదని, ఆయన ముందస్తు ఒప్పందం ప్రకారం టాక్సిక్ సినిమాకు థియేటర్లను కేటాయించాడంటూ ఆయన సన్నిహితులు చెబుతూ వచ్చారు. ఇండస్ట్రీ వర్గాల్లో కొందరు సైతం దిల్ రాజుకు ఆ సమయంలో మద్దతుగా నిలిచారు.
దిల్ రాజు పై సోషల్ మీడియాలో...
టాక్సిక్ సినిమా వల్ల దిల్ రాజు మొత్తం కోల్పోయాడు అంటూ కొందరు, టాక్సిక్ గట్టి దెబ్బ వేసిందని కొందరు ఇలా రకరకాలుగా సోషల్ మీడియాలో దిల్ రాజుకు వ్యతిరేకంగా ప్రచారం జరిగిన విషయం తెల్సిందే. ఆ మొత్తం ప్రచారంను దిల్ రాజు పెయిడ్ ప్రచారం అన్నారు. కొందరు కావాలని డబ్బులు ఇచ్చి మరీ తన గురించి ఆ ప్రచారం చేయించారు అంటూ దిల్ రాజు వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో కొందరికి వ్యతిరేకంగా జరిగే ప్రచారాల వెనుక సీక్రెట్ హ్యాండ్స్ ఉంటాయని ఇండస్ట్రీలో మొదటి నుంచి టాక్ ఉంది. కనుక దిల్ రాజు అన్నట్లుగానే ఆయనకు వ్యతిరేకంగా కావాలని ఎవరైనా డబ్బులు ఇచ్చి తప్పుడు ప్రచారం చేయించి ఉంటారని ఆయన మద్దతుదారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు మాత్రం అలాంటిది జరిగి ఉండక పోవచ్చు అని, దిల్ రాజు పై అంత కోపం ఎవరికి ఉంటుందని ప్రశ్నిస్తున్నారు.
టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్...
మొత్తానికి దిల్ రాజు తనపై డబ్బులు ఇచ్చి నెగిటివ్ ప్రచారం చేయించారు అంటూ చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో చర్చనీయాంశం అయ్యాయి. కొందరు ఆ అవసరం ఎవరికి ఉండదు అని, దిల్ రాజు వ్యాఖ్యలను కొట్టి పారేస్తున్నారు. మరికొందరు మాత్రం దిల్ రాజు చిన్న సినిమాల విషయంలో అన్యాయం చేస్తున్నాడని కొందరు ఆరోపిస్తూ ఉంటారు, కనుక వారు ఏమైనా దిల్ రాజు గురించి ఇలాంటి ప్రచారం చేయించి ఉంటారేమో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి సోషల్ మీడియాలో దిల్ రాజు వంటి బడా నిర్మాత గురించి ఎంత నెగిటివ్ ప్రచారం చేసినా ఆ రెండు మూడు రోజుల వరకే, ఆయన క్రేజ్ కు, ఆయన బ్రాండ్‌కు ఇసుమంత అయినా ఇబ్బంది కలగదు అనేది వాస్తవం. దిల్ రాజు గురించి గతంలోనూ ఇలాంటి నెగిటివ్ ప్రచారం జరిగినా, ఆయన టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్‌గా ఎన్నో విజయాలను సొంతం చేసుకున్న విషయం తెల్సిందే.