• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  రామ్ చరణ్, సుకుమార్ మూవీ...

రామ్ చరణ్, సుకుమార్ మూవీ నేపథ్యం ఇదేనట?

| రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న RC17పై ఆసక్తి పెరుగుతోంది. సినిమా ప్రారంభోత్సవం సందర్భంగా విడుదల చేసిన నెమలి ఈక పోస్టర్ కథా నేపథ్యంపై కొత్త ఊహాగానాలకు తెరతీసింది. ఈ చిత్రం మైథలాజికల్ జానర్‌లో ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది. రూ.400 కోట్ల బడ్జెట్, హీరోయిన్‌గా సాత్విక వీరవల్లి పేరు కూడా చర్చలో ఉన్నాయి. ఈ సినిమా 2028లో విడుదలయ్యే అవకాశముందని సమాచారం.

By - Ramesh Palla
Update: 2026-11-14 06:42 GMT

రామ్‌ చరణ్‌, సుకుమార్‌ కాంబోలో రూపొందబోతున్న మూవీ కోసం ప్యాన్స్‌తో పాటు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వీరి కాంబోలో ఇంతకు ముందు వచ్చిన 'రంగస్థలం' సినిమా ఏ స్థాయి విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతే కాకుండా ఆ సినిమాలోని రామ్‌ చరణ్‌ పాత్ర గురించి ఇప్పటికీ మెగా ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులు మాట్లాడుకుంటూనే ఉన్నారు. కనుక వీరి కాంబో మూవీ అనగానే రంగస్థలం ను మించి ఉంటుందని ప్రతి ఒక్కరూ బలంగా నమ్ముతున్నారు. రంగస్థలం సినిమా తర్వాత అల్లు అర్జున్‌ తో సుకుమార్‌ చేసిన 'పుష్ప', 'పుష్ప 2' సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేశాయి. ముఖ్యంగా పుష్ప 2 సినిమా రికార్డ్‌ను ఇటీవల విడుదలైన రామాయణ సినిమా సైతం బ్రేక్‌ చేయలేక పోయింది అంటే ఏ రేంజ్‌ లో ఆ సినిమా సూపర్‌ హిట్‌ అయిందో అర్థం చేసుకోవచ్చు.

పుష్ప 2 సినిమాతో బాక్సాఫీస్‌ వద్ద...

పుష్ప తర్వాత ఫుల్‌ స్వింగ్‌లో ఉన్న సుకుమార్‌ అంతకు మించిన సినిమాను తీయడం ఖాయం అని ఆయన అభిమానులతో పాటు ప్రతి ఒక్కరూ చాలా నమ్మకంగా ఉన్నారు. సుకుమార్‌ దర్శకత్వంలో రామ్‌ చరణ్‌ సినిమా వెంటనే పల్లెటూరు నేపథ్యం గుర్తుకు వస్తుంది. రంగస్థలం పీరియాడిక్‌ విలేజ్ డ్రామాగా రూపొందిన విషయం తెల్సిందే. కనుక మళ్లీ అదే తరహాలో రామ్‌ చరణ్‌ తో సుకుమార్‌ చేయాలని ప్రతి ఒక్కరూ ఆశ పడుతున్నారు. కానీ సుకుమార్‌ పూర్తి విభిన్నంగా ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇటీవలే సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభం అయింది. షూటింగ్‌ ప్రారంభం సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌తో సుకుమార్‌ పెద్ద పజిల్‌ పెట్టాడు. నెమలి ఫెదర్‌లో రామ్‌ చరణ్‌ ఫేస్‌ ను క్రియేట్‌ చేయడం ద్వారా సుకుమార్‌ ఏదో మెసేజ్ ఇస్తున్నాడు. సాధారణంగానే సుకుమార్‌ స్క్రీన్‌ ప్లే, ఆయన ఆలోచనలు ఎవరికీ అర్థం కావు అనే అభిప్రాయం ఉంది. ఇప్పుడు ఫెదర్‌ ఐడియాను క్రాక్‌ చేయలేక చాలా మంది జుట్టు పీక్కుంటున్నారు.

రామ్‌ చరణ్‌, సుకుమార్‌ కాంబో మూవీ...

ఈ పోస్టర్‌ను చూసిన కొందరు ఇది మైథలాజికల్‌ మూవీ కావచ్చు అనే అభిప్రాయం ను వ్యక్తం చేస్తున్నారు. సుకుమార్‌కు ఆ జోనర్‌ సెట్‌ అవుతుందా అనే అనుమానాలు ఉన్నాయి. సుకుమార్‌ తల్చుకుంటే ఏ జోనర్‌లో అయినా సినిమాను తీయగలడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన కెరీర్‌ ఆరంభం నుంచి ప్రతిసారి విభిన్నమైన కాన్సెప్ట్‌, కంటెంట్‌, నేపథ్యంతో సినిమాలు చేస్తూ వస్తున్నాడు. కనుక ఈసారి ఇప్పటి వరకు చేయని కొత్త జోనర్‌ లో సినిమాను తీయాలి అనుకోవచ్చు. కనుక మైథలాజికల్‌ మూవీ అయినా కావచ్చు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మైత్రి మూవీ మేకర్స్‌ బ్యానర్‌ లో ఈ సినిమా రూ.400 కోట్ల బడ్జెట్‌తో రూపొందబోతుందనే వార్తలు వస్తున్నాయి. అంత బడ్జెట్‌ అంటే కచ్చితంగా సినిమా మైథలాజికల్‌ అయ్యి ఉంటుందని సినీ విశ్లేషకులు, మీడియా వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

రామ్‌ చరణ్‌ కు జోడీగా సాత్విక వీరవల్లి...

సినిమా నేపథ్యం ఏదైనా రామ్‌ చరణ్‌, సుకుమార్‌ కాంబో అంటే మొదటి వారం రోజులు కనీసం టికెట్లు దొరకడం కష్టం. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా సుకుమార్‌ క్రేజ్‌ తో మొత్తం దేశ వ్యాప్తంగా ఈ సినిమాకు భారీగా మొదటి వీకెండ్‌ వసూళ్లు నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయి. సుకుమార్‌, రామ్‌ చరణ్‌ కాంబోలో రూపొందుతున్న సినిమాలో హీరోయిన్‌గా ఎవరు నటించబోతున్నారు అనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. కానీ కొత్త అమ్మాయి సాత్విక వీరవల్లి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అంతకు ముందు సారా అర్జున్, అనీత్‌ పడ్డా పేర్లు సైతం ప్రముఖంగా వినిపించాయి. కానీ సాత్విక వీరవల్ల వద్ద ప్రచారం ఆగింది. కనుక ఆమెను ఫైనల్‌ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. రెగ్యులర్‌ షూటింగ్‌కు కాస్త సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి. ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ కనీసం మూడు నుంచి నాలుగు నెలలు సమయం తీసుకుంటుందని యూనిట్‌ సభ్యులు అంటున్నారు. ఇప్పటికే ప్రారంభం అయిన ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ ను ఈ ఏడాది చివరి వరకు ముగించే అవకాశాలు ఉన్నాయి. 2028లో RC17 సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Tags:    
  • ramcharan 
  • sukumar 
  • rc17 
  • rangasthalam 
  • tollywood 

Similar News

అహంకారమనే ముద్రకు ధనుష్ వినూత్న కౌంటర్!

2026-11-15 09:46 GMT

అర్థరాత్రి పూట భార్య‌కి వార్నింగ్ లు!

2026-11-15 09:45 GMT

రామాయ‌ణ‌: 10రోజుల్లో 1200 కోట్లు.. 2000 కోట్ల క్ల‌బ్ ఇంకెంత దూరం?

2026-11-15 09:42 GMT

పని పోతుందనే భయంతో వేధింపులు సైతం భరించాను!

2026-11-15 09:38 GMT

25 ఏళ్లయినా ఇంకా జీవితాన్ని అర్ధం చేసుకుంటూనే ఉన్నా!

2026-11-15 07:32 GMT

త్రివిక్రమ్ గారు మీరు అలాంటి సినిమాలే తీయండి సార్...

2026-11-15 07:32 GMT

లగ్జరీ కంటే ప్రశాంతతే ముఖ్యం..ఎందుకో చెప్పిన సీత‌మ్మ‌

2026-11-15 06:52 GMT

బాలయ్యకు డిసెంబర్ సెంటిమెంట్.. ట్రాక్ రికార్డ్ ఎలా ఉందంటే..

2026-11-15 06:31 GMT

మెగా హీరో సినిమాలో ఛాన్స్.. బండి సరోజ్ ఎందుకు వద్దన్నారంటే!

2026-11-15 06:19 GMT

నిర్మాత కష్టాలతోనే సినిమా.. పేర్లు కూడా బయటపెడతానంటూ..

2026-11-15 05:28 GMT

భర్తతో ప్రేమ.. ఆ తర్వాత వేరే వాళ్లతో డేటింగ్.. కాజల్ లవ్ స్టోరీ ఇదే..!

2026-11-15 03:34 GMT

జూనియ‌ర్ అతిలోక సుంద‌రి అలా ఫెయిలైంది!

2026-11-15 02:30 GMT

Copyright @2026

Powered by Blink CMS