హోరా హోరీగా కిక్కిచ్చే మ్యూజిక్‌

Update: 2015-07-28 04:22 GMT
డైరెక్టర్‌ తేజ ఓ సినిమా తీస్తున్నాడంటే 'యూత్‌'ని టచ్‌ చేసే బోలెడు విషయాలుంటాయన్న అంచనాలుంటాయి. ఇటీవలి కాలంలో అతడు రాంగ్‌ ట్రాక్‌ లో వెళ్లి పేరు చెడగొట్టుకున్నాడని అంతా కామెంట్‌ చేసినా.. అతడు తనదైన బాణీలో మరోసారి యూత్‌ ఫుల్‌ లవ్‌స్టోరీ ని టచ్‌ చేస్తున్నాడనగానే జనాల కళ్లన్నీ అటు వాలిపోయాయి.

తేజ మరోసారి ఏదైనా మ్యాజిక్‌ చేయబోతున్నాడా అన్న ఆత్రంతో అందరూ అతడి సినిమా రాకకోసం ఎదురు చూస్తున్నారు. అయితే జనాల ఆత్రానికి తగ్గట్టుగానే హోరాహోరీ టీజర్‌లు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. అందులో మ్యూజిక్‌, ఆర్‌.ఆర్‌ అదిరిపోయిందని యూత్‌లో డిష్కసన్‌ స్టార్టయ్యింది. తేజ ఈసారి కొట్టేట్టే కనిపిస్తున్నాడని అనిపిస్తోంది. ముఖ్యంగా ఈ సినిమా మ్యూజికల్‌ హిట్‌ అవుతుందన్న అంచనాలేర్పడ్డాయి. కళ్యాణ్‌ కోడూరి తన కెరీర్‌ లోనే ది బెస్ట్‌ మ్యూజిక్‌ ఈ సినిమాకి ఇస్తున్నాడని అర్థమవుతోంది. బాహుబలి తో కీరవాణి రిటైర్‌ మెంట్‌ ప్రకటిస్తున్న ఈ వేళ కళ్యాణ్‌ కోడూరి లైమ్‌ లైట్‌ లోకి వస్తున్నాడన్న సంగతి అర్థమవుతోంది.

మొత్తం పాటల్ని ఈ బుధవారం (29న) రిలీజ్‌ చేయబోతున్నారు. ముందుగా టీజర్‌ లతో కిక్కిచ్చారు. ఇక మ్యూజిక్‌ తో మెరుపులు మెరిపించడం ఖాయం అని అర్థమవుతోంది. కోడూరీ దశ తిప్పేసే సినిమా ఇదని అనుకోవచ్చు.
Tags:    

Similar News