• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'స్పై థ్రిల్లర్'తో...

'స్పై థ్రిల్లర్'తో హాలీవుడ్ సూపర్ స్టార్ డిజిటల్ ఎంట్రీ..!

By - Tupaki Desk
Update: 2021-05-21 01:30 GMT
హాలీవుడ్ సీనియర్ సూపర్ స్టార్ ఆర్నాల్డ్ స్క్వార్జెనెగర్‌ గురించి ప్రపంచవ్యాప్తంగా సినీప్రియులకు పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే టర్మినేటర్ - ప్రేడేటర్ - కమాండో - సబోటేజ్ - కానన్ ది బార్బరియన్ లాంటి ఎన్నో సూపర్ సినిమాలతో ప్రపంచ దేశాలకు సుపరిచితుడు అయ్యాడు. అయితే ప్రస్తుతం ఆయన వయసు 73ఏళ్లు. ఈ వయసులో కూడా యంగ్ హీరోలకు ధీటుగా ఫిట్నెస్ మెయింటైన్ చేస్తూ చాలామంది యంగ్ స్టార్స్‌కు రోల్ మోడల్‌గా నిలుస్తున్నాడు. ప్రపంచ వ్యాప్తంగా సూపర్  క్రేజ్ కలిగిన హాలీవుడ్ సూపర్ స్టార్లలో ఒకడైన ఆర్నాల్డ్.. అటు రాజకీయాల్లో కూడా విజయవంతంగా రాణించారు. ప్రస్తుతం అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో నివసిస్తున్న ఆర్నాల్డ్.. పరిస్థితుల మేరకు స్వీయ నిర్బంధంలో ఉన్నాడు.

అయితే ఫస్ట్ నుండి అందరికీ భిన్నంగా ఆలోచించే ఆర్నాల్డ్ గుర్రాన్ని.. గాడిదను పెంచుకోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. క్వారంటైన్ సమయంలో ఈ పెంపుడు జంతువులతోనే కాలక్షేపం చేస్తున్నారు. ఆ మధ్యలో గాడిదతో చెస్ ఆడుతున్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి హల్చల్ చేశారు. అయితే ఈ ఐకానిక్ స్టార్ ఏడు పదుల వయసులో ఫస్ట్ టైం ఫ్యాన్స్ కోరిక మేరకు డిజిటల్ ఎంట్రీ చేయనున్నాడు. త్వరలోనే నెట్ ఫ్లిక్స్ కోసం ఓ టీవీ స్పై థ్రిల్లర్ లో నటిస్తున్నాడు. ఆయనతో పాటు 30ఏళ్ల మోనిక బార్బరా ఈ స్పై థ్రిల్లర్ ఎపిసోడ్స్ లో కనిపించనుంది. ఇందులో ఆర్నాల్డ్ - మోనిక ఇద్దరూ తండ్రి కూతురుగా కనిపించనున్నారు. అయితే ఈ యాక్షన్ అడ్వంచర్ లో ఆర్నాల్డ్ సీక్రెట్ సిఐఏ అధికారిగా నటిస్తున్నట్లు టాక్.

ఇంకా పేరు పెట్టని ఈ థ్రిల్లర్ టీవీ సిరీస్ ను నిక్ సంతోరా తెరకెక్కించగా.. స్కైడాన్స్ అండ్ నెట్ ఫ్లిక్స్ రెండు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అయితే ఎంతో కాలంగా అభిమానులు అడుగుతున్నటువంటి ఈ స్పైథ్రిల్లర్ తో టీవీ సిరీస్ లో అడుగుపెడుతున్నాను. ఇదంతా కేవలం డైరెక్టర్ నిక్ - యాక్ట్రెస్ మోనిక టీమ్ కారణంగానే సాధ్యం అయిందని ఆర్నాల్డ్ చెప్పుకొచ్చాడు. ఇదివరకు ఆర్నాల్డ్ ఇండియన్ సినిమాల్లో నటించాల్సిన సందర్భాలు వచ్చాయి కానీ రెమ్యూనరేషన్ విషయంలో మేకర్స్ వెనకడుగు వేసినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఆర్నాల్డ్ ఈ స్పై థ్రిల్లర్ టీవీ సిరీస్ తో పాటుగా ‘కుంగ్ ఫ్యూరీ 2’ అనే యాక్షన్ కామెడీ మార్షల్ ఆర్ట్స్ మూవీలో నటిస్తున్నారు.
Tags:    
  • Arnold Schwarzenegger 
  • Arnold Schwarzenegger movies 
  • Arnold Schwarzenegger ott 
  • Arnold Schwarzenegger netflix 

Similar News

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

రామాయణ లో ఉన్నది.. ఆదిపురుష్‌లో లేనిది ఇదేనా!

2026-11-06 10:48 GMT

రామాయణంలో భాగం కావడం మర్చిపోలేని అనుభూతి.. రకుల్ ప్రీత్ సింగ్!

2026-11-06 10:46 GMT

ఈసారైనా పెళ్లి అవుతుందా? సీజన్ 2పై పెరిగిన ఆసక్తి!

2026-11-06 10:30 GMT

భారతీయ కథలకు ప్రపంచమే వేదిక!

2026-11-06 09:30 GMT

రామాయణం లిప్ సింక్.. ఏం మ్యాజిక్ చేశారబ్బా?

2026-11-06 09:19 GMT

శ్రీరాముడు కూడా 14 ఏళ్లే వనవాసం.. నాకు మాత్రం ఎందుకిలా..రేణు దేశాయ్ ఆవేదన..!

2026-11-06 09:18 GMT

ఈర్ష్య కాదు ప్రశంస.. కై పో చే ఫ్రెండ్స్!

2026-11-06 08:30 GMT

'సీన్' మూవీ రివ్యూ

2026-11-06 07:54 GMT

గార్జియస్ లుక్ లో అందరినీ తన వైపు తిప్పుకున్న శ్రీలీల.. ఔట్ఫిట్ తోనే మాయ చేస్తూ!

2026-11-06 07:51 GMT

రాజకీయాల నుంచి వెండితెరకు అసాధారణ ప్రయాణం!

2026-11-06 07:30 GMT

'సమ్మర్ హాలిడేస్' రివ్యూ

2026-11-06 07:23 GMT

Copyright @2026

Powered by Blink CMS