• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  హైదరాబాద్ లో హాలీవుడ్...

హైదరాబాద్ లో హాలీవుడ్ స్టార్ కటౌట్.. ఆయన లేకున్నా సరే..!

By - Tupaki Desk
Update: 2022-11-09 11:30 GMT
వరల్డ్ సినిమా అంతా ఇప్పుడు ఒకచోటకి వచ్చినట్టే అని చెప్పొచ్చు. ఒక భాషలో సినిమాలు మరొక భాషలో రిలీజ్ అవుతున్నయి. ఇక ఇండియన్ సినిమాల మీద.. ఇక్కడ ప్రేక్షకుల మీద హాలీవుడ్ సినిమాలు.. అక్కడ స్టార్స్ ప్రభావం చాలా ఉంటుంది. హాలీవుడ్ స్టార్స్ ఎంతోమందిని మన ఆడియన్స్ అభిమానిస్తారు. అది ఎంతగా అన్నది చాలా తక్కువసార్లు ప్రూవ్ అవుతుంది. లేటెస్ట్ గా హాలీవుడ్ స్టార్స్ పై తెలుగు ఆడియన్స్ చూపించే అభిమానం, గౌరవం ఎలాంటిదో మరోసారి ప్రూవ్ అయ్యింది.

రెండేళ్ల క్రితం మరణించిన చద్విక్ బోస్మన్ భారీ కటౌట్ ని హైదరాబాద్ సుదర్శన్ థియేటర్ దగ్గర ఏర్పాటు చేశారు. మార్వెల్ మూవీస్ లో బ్లాక్ పాంథర్ సినిమా సెన్సేషనల్ హిట్ అయ్యింది. ఆ మూవీలో నటించిన చద్విక్  బోస్మన్ వరల్డ్ సినీ లవర్స్ కి దగ్గరయ్యారు. బ్లాక్ పాంథర్, ఎవెంగర్స్ ఇన్ఫినిటీ వార్, ఎండ్ గేమ్ సినిమాల్లో కూడా నటించారు చద్విక్ బోస్మన్. 2020లో క్యాన్సర్ వల్ల మృతి చెందారు చద్విక్ బోస్ మన్. ఆయన మరణ వార్త సినీ ప్రియులందరి హృదయాలను కలచివేసింది.

లేటెస్ట్ గా బ్లాక్ పాంథర్ వాకండ ఫర్ ఎవర్ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సినిమాలో చద్విక్ కూడా కనిపిస్తారు. అందుకే హైదరాబాద్ థియేటర్ దగ్గర ఆయన ఫ్యాన్స్ చద్విక్ బోస్ మన్ కటౌట్ ఏర్పాటు చేశారు. హాలీవుడ్ స్టార్స్ పై మన ఆడియన్స్ చూపిస్తున్న ఈ ప్రేమకి వారంతా ఫిదా అవుతున్నారు. ర్యాన్ కూగ్లర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఈ శుక్రవారం వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ స్థాయిలో రిలీజ్ అవుతుంది.

హాలీవుడ్ సినిమాలకు ఎప్పుడూ తెలుగులో మంచి డిమాండ్ ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లోనే సినిమాలను ఎక్కువ ఎంకరేజ్ చేస్తారని తెలిసిందే.. హాలీవుడ్ సినిమాలు కూడా ఇక్కడ బాగా ప్రేక్షకాదరణ పొందుతాయి. ఒక్కోసారి ఇక్కడ స్ట్రైట్ సినిమాలకు ఈక్వల్ గా పోటీ పడి మరి హాలీవుడ్ సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. తెలుగు మార్కెట్ అంత పెద్ద మార్కెట్ అని హాలీవుడ్ మేకర్స్ కూడా గుర్తించారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    
  • ChadwickBoseman 
  • BlackPanther 
  • WakandaForever 
  • Hollywood 
  • Movie 
  • Hyderabad 
  • Cutout 
  • Fans 
  • LatestNews 
  • MovieNews 
  • TupakiNews 

Similar News

‘రామాయణ’కు బాంబే హైకోర్టు రక్షణ!

2026-11-03 07:15 GMT

ఇన్నాళ్లకు సెట్ లో అడుగుపెట్టిన నివేదా థామస్!

2026-11-03 07:05 GMT

రాజమౌళి మొదటి సారి యాక్షన్ చెప్పిన తర్వాత ఏం చేశాడో తెలుసా?

2026-11-03 06:58 GMT

ఇత‌ర న‌టుల‌ను వ‌దిలేసి దియా వీడియోనే ఎందుకు తొల‌గించారు? ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు!

2026-11-03 06:58 GMT

తెలుగు సినిమాలకు ఇప్పుడు ఈ మంత్రం ఒక్కటే అసలైన ప్రమోషన్!

2026-11-03 06:56 GMT

‘కన్నప్ప’కు రాస్తే.. ‘రామాయణం’లో ఛాన్సొచ్చింది

2026-11-03 05:53 GMT

తొలి సంపాదనతో రాజమౌళి ఏం కొన్నారో తెలుసా?

2026-11-03 05:38 GMT

అతని హీరోగా వస్తే.. అందరూ వెళ్ళిపోతారనుకున్నారంట!

2026-11-03 04:47 GMT

2026 వెయ్యి కోట్ల రేసు.. రామాయణమే దిక్కా?

2026-11-03 04:34 GMT

జైలర్ 2: ఇలా జరిగుంటే 1000 కోట్లు వచ్చేవా?

2026-11-03 04:33 GMT

Bigg Boss Telugu 10: నామినేషన్లలో వర్షిణీ ముకేశ్ మీదే టార్గెట్

2026-11-03 04:33 GMT

నాని లాంటి శర్వ.. ఓదెల లాంటి నంది.. వంద కోట్లు దక్కేనా?

2026-11-03 04:31 GMT

Copyright @2026

Powered by Blink CMS