కామెంట్: చిన్న టౌనుల్లో 3డి దెబ్బలు
అది రాజమండ్రి టౌన్ అవ్వనివ్వండి.. ఏలూరులో ఒక ధియేటర్ కానివ్వండి.. ఈరోజు పక్కపక్కనే ఉన్న టిక్కెట్ కౌంటర్లను పరిశీలిస్తే.. అక్కడ 'అమీ తుమీ ' సినిమా టిక్కెట్లు పూర్తిగా అమ్ముడుపోలేదు కాని.. ఏకంగా రెండు ధియేటర్లలో విడుదలైన 'ది మమ్మి' సినిమా మాత్రం రెండింటిలోనూ హౌస్ ఫుల్ అయ్యింది. ఇంతకీ ఈ సంఘటన ఎందుకు చెబుతున్నారనేగా మీ ప్రశ్న.. పదండి చూద్దాం.
నిజానికి ఇప్పుడు తెలుగు ప్రేక్షకులు టాప్ క్లాస్ ఎంటర్టయిన్మెంట్ కోరుకుంటున్నారు. చూసే ప్రతీ సినిమా కూడా ఒక బాహుబలి తరహాలో ఉండాలనేది వీరి ఫీలింగ్. అయితే అన్నేసి వందల కోట్లు పెట్టి తెలుగులో అలాంటి సినిమాలు ప్రతీ వారం రిలీజయ్యేలా తీయాలంటే చాలా కష్టమే. అందుకే మనోళ్లకు హాలీవుడ్ సినిమాలు ఆల్టర్నేటివ్ గా మారిపోయాయ్. దానికి తోడు ఈ హాలీవుడ్ సినిమాలు ఇప్పుడు తెలుగులో రిలీజవ్వడం.. పైగా స్టీరియోస్కోపిక్ 3డి లో చూసే సౌలభ్యం ఉండడం.. ఒకవేళ సినిమా కథా కథనం బాగోకపోయినా కొన్ని విజువల్ ఎఫెక్ట్స్ అబ్బురపరచడంతో.. మనోళ్ళు టాక్ తెలియకపోయినా కూడా హాలీవుడ్ సినిమాలకు ఓటేస్తున్నారు. అసలు ఈ హాలీవుడ్ సినిమాలకోసం ఆ హీరోలూ హీరోయిన్లూ ఎవ్వరూ వచ్చి ప్రమోట్ చేయకపోయినా కూడా.. కేవలం పోస్టర్ చూసి జనాలు ధియేటర్లకు లగెత్తేస్తున్నారు.
గత వారం ఒక ప్రక్కన ధియేటర్లలో అంధగాడు.. ఫ్యాషన్ డిజైనర్ వంటి సినిమాలు ఉంటే.. మరో ప్రక్కన వాటికంటే ధీటుగా పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్ 5వ భాగం ఆడేస్తోంది. ఇక పెద్ద పెద్ద టౌన్స్ అండ్ సిటీస్ లో అయితే.. ఇంగ్లీష్ వర్షన్ తెలుగు వర్షన్ రెండూ ఆడేస్తున్నాయి. ఇప్పుడు సిటీస్ లో చాలామంది వీకెండ్ సినిమాగా వండర్ ఉమెన్ కే ఓటేస్తున్నారు. ఇక వచ్చేవారం జూన్ 16న కార్స్-3 సినిమా రిలీజ్ అవుతోంది. చూస్తుంటే ఆ వారం కూడా హాలీవుడ్ సినిమాలే దున్నేస్తాయి అనిపిస్తోంది కదూ.
పెద్ద హీరోల సినిమాలకు ఈ హాలీవుడ్ సినిమాలతో పెద్దగా ఇబ్బందేం ఉండదు కాని.. చిన్న హీరోలకు అలాగే చిన్న బడ్జెట్ సినిమాలకు మాత్రం ఈ 3డి ట్రీట్మెంట్ తో గట్టి దెబ్బలే తగుల్తున్నాయి. అలాగని మనం ఆడియన్స్ ను కట్టడి చేయలేం.. ఇక వచ్చే హాలీవుడ్ సినిమాలనూ ఆపలేం. మన కంటెంట్ వాటి కంటే ఇంప్రెసివ్ గా ఉండేలా చూసుకోవడం ఒక్కటే మార్గం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/