రివైండ్ 2015: మది దోచిన మధుర గీతాలు
హాలీవుడ్ తో కంపేర్ చేస్తే ఇండియన్ మూవీస్ లో కనిపించే ప్రధాన తేడా "పాటలు".. సౌత్ మూవీస్ లో ముఖ్యంగా తెలుగు సినిమాలలో నాలుగు నుండి ఆరు పాటలుండడం సర్వ సాధారణం.ఇక్కడ పాటలకు ప్రాధాన్యం ఎక్కువ. మన మూడ్ ని మార్చడమే కాక మన మనసులకు తగిలిన గాయాలను సైతం మాన్పగల శక్తి గేయాలకే వుంటుంది.
ఈ ఏడాది విడుదలైన కొన్ని వందల సినిమాల నుండి వేల పాటలనుండి మధురంగా, వచ్చే ఏడాదికి తీసుకెళ్ళే జ్ఞాపకంగా కొన్ని మరపురాని బాణీలను, కొన్ని మరువలేని సాహిత్యాలను తలుచుకుందామా?
ఇటు ఇటు అని చిటికెలు - కంచె
ప్రేమ అందించే మాధుర్యాన్ని, సిరివెన్నెల పెన్ను అందించిన గొప్ప భావోద్వేగాలతో చితరంజన్ భట్స్వరపరిచిన యుగళగీతం. కంచె సినిమాలో వరుణ్ - ప్రగ్యాలు ఈ పాటకు వన్నె తెచ్చారు. క్రిష్ చిత్రీకరణ కూడా పాట విజయానికి తోడయ్యింది. ఈ సినిమాకు సింగిల్ కార్డ్ రాసిన సిరివెన్నెల కి చిత్రంలో ఈ పాట ఫేవరేట్ అని పలుమార్లు తెలిపారు.
సూపర్ మచ్చి - సన్నాఫ్ సత్యమూర్తి
సాధారణంగానే త్రివిక్రమ్ - బన్నీ ల కాంబినేషన్ కు పనిచేసే సమయంలో దేవి నుండి బెస్ట్ అవుట్ పుట్ వస్తుంది. ఎలానో త్రివిక్రమ్ సినిమాలలో ఐటెం సాంగ్ లు వుండవు కాబట్టి మసాలా సాంగ్ ని ప్లాన్ చేసుకున్నారు. ఈ క్క్రమంలో దేవి స్వరపరిచిన సూపర్ మచ్చి ఈ ఏడాది సూపర్ హిట్ మసాలా సాంగ్ గా నిలుస్తుంది. జనాలు ఈ మచ్చి ని పిచ్చి పిచ్చి గా లైక్ చేశారంటే విడ్డూరం కాదు. అన్నట్టు దీనికి సాహిత్యం కూడా దేవినేనండోయ్..
జతకలిసే జతకలిసే - శ్రీమంతుడు:
మిర్చి తరువాత కొరటాల - దేవి జతకలిసిన మరో సినిమా శ్రీమంతుడు. మహేష్ కి కెరీర్ బెస్ట్ కలెక్షన్లను అందించిన ఈ సినిమాలో అన్ని పాటలూ వినసొంపైనవే. అయితే హీరో హీరోయిన్ల మధ్య వచ్చే జతకలిసే పాట మనలో వున్న ప్రేమికులను నిద్రలేపి మరీ జ్ఞాపకాలను గుర్తుచేస్తుంది. చాలా మంది ఈ ట్యూన్ ని రింగ్ టోన్ గా పెట్టుకున్నారు.
గువ్వా గోరింకతో - సుబ్రహ్మణ్యం ఫర్ సేల్:
ఈ యేటి మేటి రీమిక్స్ సాంగ్.. చిరు చిందేసిన పాటకు కోటి రాగాలు అందించిన పాటకు రీమిక్స్ పేరిట సాయి ధరమ్ - మిక్కీ జె మేయర్ లు తమవంతు న్యాయం చేశారు. ఈ పాట చిత్రీకరించిన లొకేషన్ కూడా పాట విజయానికి ప్లస్సయింది.
లవ్ చెయ్యాలా వద్దా - కుమారి 21F
ఈ ఇయర్ ఇన్స్టంట్ హిట్ సాంగ్. మార్కెట్ లోకి విడుదలవగానే ఒక పాట ఎక్కాలంటే ట్యూన్ క్యాచీగా లిరిక్స్ ఈజీగా అన్నిటికంటే ముందు మన జీవితంతో ముడిపడి వుండాలని నిరువుపించిన పాట. ఈ సినిమాలో మిగిలిన పాటలకు కూడా మంచి ఆదరణే లభించింది.
భజే భాజే - గోపాల గోపాల
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాలు అటు ఇటు కదిపినా అభిమానులు ఆనందంతో తడిచి ముద్దవుతారని నిరువుపించిన పాట. వెంకీ - పవన్ లు ఒకే స్క్రీన్ పై స్టెప్ వెయ్యడం, అనూప్ మ్యూజిక్ లో మ్యాజిక్ , అనంత్ లిరిక్ లో డివినిటీ ఈ పాటకు తోడయ్యాయి.
దేవుడా దేవుడా - టెంపర్ :
పూర్తి స్థాయి మాస్ సాంగ్ .. సినిమాకు టైటిల్ ట్రాక్ గా నిలుస్తుంది. తాగిన మత్తులో మనిషిగా మారిన తారక్ వేసిన స్టెప్పులు ఆదరగొట్టాయి. పాట టైమింగ్ కి పూరి కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి.
ఇవేకాక రఘువరన్ Btech లో అమ్మ పాట, బ్రూస్ లీలో మెగా మీటర్, అఖిల్ చిత్రంలో పడేసావే, లోఫర్ లో సువ్వి సువ్వాలమ్మా పాటలు కూడా ఈ ఏడాది మెప్పించాయి.