'మాస్ కా బాప్' కోసం 'ఫలక్ నుమా దాస్' ర్యాప్ సాంగ్...!
'వెళ్లిపోమాకే' చిత్రంతో పరిచయమై తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన 'ఈ నగరానికి ఏమైంది' చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు విశ్వక్ సేన్.. తెలుగు సినిమాల్లో తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. చేసినవి తక్కువ సినిమాలే అయినా తనకో స్టైల్.. తన సినిమాల మీద ఓ ఇంపాక్ట్ క్రియేట్ చేసుకున్నాడు. 'ఫలక్ నుమా దాస్' 'హిట్' సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు ఈ హీరో. తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా చెప్తూ తంటాలను కొని తెచ్చుకోవడంలో విశ్వక్ సేన్ సిద్ధహస్తుడు. ఇక ఈ యంగ్ హీరో ఫేవరేట్ టాలీవుడ్ స్టార్ ఎవరంటే టక్కున 'ఎన్టీఆర్' పేరు చెప్తూంటాడు. అందుకే ఎన్టీఆర్ బర్త్ డే కోసం ఒక సర్పైజ్ ప్లాన్ చేసాడు. ఆయన తన అభిమాన హీరో పట్ల అభిమానాన్ని చాటుకోవడానికి ఒక ర్యాప్ సాంగ్ తో రాబోతున్నాడు. 'ఫలక్ నుమా దాస్ ర్యాప్ సాంగ్' పేరుతో రేపు ఉదయం 11 గంటలకు ఈ సాంగ్ రిలీజ్ అవుతుంది.
ఇదిలా ఉండగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు పురస్కరించుకుని ‘ఆర్.ఆర్.ఆర్’ నుంచి సర్‌ప్రైజ్ వీడియో వస్తుందని అంతా ఊహించారు. కానీ 'కొమరం భీమ్' అప్డేట్ ఉండదంటూ చిత్ర యూనిట్ చెప్పేసారు. అంతే కాకుండా ఎన్టీఆర్ కూడా తన పుట్టిన రోజు వేడుకలను జరపవద్దంటూ.. ఇంటిపట్టునే ఉంటూ అధికారుల సూచనలు పాటిస్తూ భౌతిక దూరానికి కట్టుబడి ఉండాలని ఒక లెటర్ ద్వారా విన్నవించుకున్నాడు. ఫస్ట్ లుక్ లేదా టీజర్ మీ ఆనందం కోసం సిద్ధం చేయాలని చిత్ర బృందం ఎంతగా కష్టపడిందో నాకు తెలుసు. కానీ ఒక ప్రచార చిత్రం మీ ముందు ఉండాలంటే అన్ని సాంకేతిక విభాగాలు కలిసి శ్రమించాలి. అధికారిక ఆంక్షల వలన అది కుదరలేదు అని చెప్పుకొచ్చాడు తారక్.
‘ఆర్.ఆర్.ఆర్’ నుంచి ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ మరియు ఇంట్రో వీడియో ఉంటుందని ఆశించిన అభిమానులకు నిరాశే ఎదురైంది. ఈ నేపథ్యంలో వారిని కొంచెం ఉత్సాహపరచడానికి విశ్వక్ సేన్ ఎన్టీఆర్ కోసం ర్యాప్ సాంగ్ తో ముందుకు రాబోతున్నాడు. ఎన్టీఆర్ పిక్ ఒకటి తన ట్విట్టర్ లో పోస్ట్ చేసిన విశ్వక్ సేన్.. ''మాస్ కా దాస్.. మాస్ కా బాప్ ఫలక్ నుమా దాస్ ర్యాప్ సాంగ్ ను ఎన్టీఆర్ కు అంకితం ఇవ్వబోతున్నాం'' అని తెలిపారు. దీంతో ఎన్టీఆర్ అభిమానులు విశ్వక్ పై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటికే ఈ సాంగ్ విషయమై సోషల్ మీడియాలో ఎన్టీఆర్ డిస్కషన్స్ పెడుతున్నారు. 'ఫలక్ నుమా దాస్ ర్యాప్ సాంగ్' కోసం తారక్ ఫ్యాన్స్ - విశ్వక్ సేన్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.