కామెంట్: అల్లూరి.. రుద్రమదేవి.. శాతకర్ణి..

Update: 2016-10-12 17:30 GMT
ఇంకొన్ని తరాలు గడిచాక వెనక్కితిరిగి చూసుకుంటే.. అసలు తెలుగువారందరూ గర్వంగా చెప్పుకొనే సినిమాలు ఏముంటాయి? రిలీజైన నాళ్ళలో ''మాయాబజార్'' కూడా చాలా వింతగానే ఉండేది. కాని ఈనాటి కుర్రకారులో కనీసం సగంమంది కూడా ఆ సినిమాను చూసండరు. రేపొద్దున్న మనం గొప్పగా చెప్పుకుంటున్న మగధీరలు శ్రీమంతులు గ్యారేజీలు కూడా ఇలాగే అయిపోవచ్చు. బాహుబలి సినిమా ఒక్కటే కాస్త గొప్పగా కనిపిస్తుంటుంది. కాకపోతే మన చరిత్ర ఇది అని చెప్పుకోవడానికి.. ఈ కొత్త సినిమాల సంగతి పక్కనెట్టండి.. అసలు మన చరిత్ర ఏంటనేది చెప్పే సినిమాలు ఎన్నున్నాయి?

కలర్ సినిమాల విషయం తీసుకుంటే.. అప్పట్లో మనం బ్రిటీష్ దొరలతో పోరాడి సాధించుకున్నాం అని చెప్పుకోవడానికి ''అల్లూరి సీతారామరాజు'' సినిమా ఒకటుంది. ఆ తరువాత ఏదైనా చరిత్రను తెరకెక్కించామా అంటే మాత్రం.. అది ఖచ్చితంగా ''రుద్రమదేవి'' సినిమాయే. ఆ తరువాత అసలు మన చరిత్ర రుద్రమకంటే ముందు.. రాయల కాలానికి వెయ్యేళ్ళ మునుపు.. అసలు మన తెలుగువారి చరిత్ర ఏంటి? ఇలాంటివి ఎక్కడో పుస్తకాల్లో చదువుకోవడమే కాని.. సినిమాల రూపంలో ఏమీ లేవు. ఫిక్షనల్ కథలు వందొచ్చినా కూడా.. హిస్టారికల్ కథలో ఉన్న కిక్కే వేరు. అందుకే ఆ రెండు సినిమాల లిస్టులో చేరే మరో సినిమాయే ఈ ''గౌతమీపుత్ర శాతకర్ణి''.

యుట్యూబ్ హిట్స్ వచ్చాయా? కలక్షన్లు వందలు కోట్లు అయ్యాయా? సాంగ్స్ వర్కవుట్ అవుతాయా? విజువల్ ఎఫెక్ట్స్ ఎలా ఉన్నాయి? ఇలాంటి క్రిటిసిజంలు సందేహాలు శాతకర్ణి విషయంలో పెట్టుకోవడం అనవసరం. బాలయ్య మన తెలుగువారి చరిత్ర పదిలంగా ఒక డివిడి రూపంలో ఉండే తరహాలో ఒక సినిమాను తెస్తున్నారు. అది మనం ఎంజాయ్ చేయాలి. దాచుకోవాలి. ఈయన్ను ఇనిస్పిరేషన్ గా తీసుకుని ప్రతీ హీరో తన జీవితంలో ఒక్కటంటే ఒక్కటైనా కూడా తెలుగు చరిత్రకు సంబంధించిన ఒక సినిమా తీస్తే.. పిల్లలకు ప్రత్యేకించి తెలుగు చరిత్ర కోసం వికీపీడియా అవసరం రాకపోవచ్చు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News