టాప్ స్టోరి: మ‌నవాళ్ల‌ రేంజు హిందీలో ఆ రేంజులోనా..!

Update: 2021-07-10 15:30 GMT
టాలీవుడ్ లో భారీ పాన్ ఇండియా సినిమాలు తెర‌కెక్కుతున్నాయి. బాహుబ‌లి త‌ర్వాత అంద‌రి చూపు మ‌న‌వైపే. ఆర్.ఆర్.ఆర్ తో ఇప్పుడు అది మ‌రో లెవ‌ల్ కి చేర‌బోతోంది. 2021 మోస్ట్ అవైటెడ్ మూవీగా ఆర్.ఆర్.ఆర్ అంద‌రి దృష్టిని ఆక‌ర్షించ‌గా.. అటు క‌న్న‌డ రంగం నుంచి కేజీఎఫ్ 2 ఇదే రేసులో ఉంది. ఈ సినిమాల‌న్నిటికీ హిందీ స‌హా ఇరుగు పొరుగు మార్కెట్ల‌లో చ‌క్క‌ని బిజినెస్ పూర్త‌వుతోంది.

అలాగే ప్రభాస్ న‌టించిన ప్రేమ‌క‌థా చిత్రం రాధే శ్యామ్ బిజినెస్ పెద్ద రేంజులోనే వ‌ర్క‌వుట‌వుతోంది. తెలుగు -హిందీలో భారీ మార్కెట్ ని సొంతం చేసుకుంటున్న ప్ర‌భాస్ కి ఇప్ప‌ట్లో హిందీ మార్కెట్ ప‌రంగా ఎలాంటి డోఖా లేదు. అయితే అందుకు త‌గ్గ‌ట్టే వ‌సూళ్ల‌ను ద‌క్కించుకోవాల్సి ఉంటుంది.

పూరి జగన్నాధ్ దర్శకత్వం వహిస్తున్న లైగ‌ర్ కు హిందీ మార్కెట్లో అంతే క్రేజు ఉంది. దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న ఈ చిత్రానికి కరణ్ జోహార్ మద్దతు ఇస్తున్నారు. దీంతో హిందీ థియేట్రికల్ హక్కులను భారీ మొత్తాల‌కు అమ్మ‌నున్నారు. అలాగే బ‌న్ని న‌టిస్తున్న `పుష్ప‌`ను పాన్ ఇండియా లెవ‌ల్లో మార్కెటింగ్ కి ప్లాన్ చేయ‌డం ఆస‌క్తిని క‌లిగిస్తోంది.  ప్ర‌స్తుతం పుష్ప హిందీ థియేట్రికల్ హక్కుల డీల్ మాట్లాడుతున్నారు.

ఇవేకాదు.. తెలుగులో ఖిలాడీ రీమేక్ రైట్స్ ని భారీ మొత్తానికి స‌ల్మాన్ భాయ్ ఛేజిక్కించుకోవ‌డం చూస్తుంటే ఇత‌ర హీరోల‌పైనా హిందీ ప‌రిశ్ర‌మ ఎప్పుడూ క‌న్నేసి ఉంచుతుంద‌ని అర్థ‌మ‌వుతోంది. నేటిత‌రం హీరోలు న‌టించే వాటిలోనూ హిట్టు కొట్టిందంటే చాలు వెంట‌నే రీమేక్ రైట్స్ ని ఎగ‌రేసుకుపోవాల‌ని హిందీ వాళ్లు త‌పిస్తున్నారు. చ‌ర‌ణ్ త‌దుప‌రి శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టించే సినిమాకి హిందీ మార్కెట్లో వేవ్స్ క్రియేట్ చేస్తుంద‌న‌డంలో ఎలాంటి సందేహ‌మేం లేదు. నితిన్ - రామ్- బెల్లంకొండ‌ లాంటి హీరోలు కూడా యూట్యూబ్ డ‌బ్బింగ్ సినిమా ద్వారా హిందీలో పాపుల‌ర‌య్యారు. వీళ్ల‌కు మునుముందు హిందీలో చెప్పుకోద‌గ్గ రేంజులోనే మార్కెట్ పెర‌గ‌నుంద‌ని అంచ‌నా.
Tags:    

Similar News